‘‘కరోనా’ ఓ వైరస్ కాదు. ఓ అవతారం’’ అంటున్నాడు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు ‘స్వామి’ చక్రపాణి. మాంసాహారులను శిక్షించి, ఇతర జీవులను రక్షించడానికి అవతరించిందట! నరసింహ స్వామి రాక్షసుడిని సంహరించినట్టే.. జంతువులను హింసిస్తున్న చైనీయులకు ఓ పాఠం నేర్పడానికి ‘కరోనా’ అవతరించిందని ఈ ‘స్వామి’ చెప్పుకొచ్చాడు. ఈ పైత్యం అంతటితో ఆగలేదు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కరోనాకు ఒక విగ్రహాన్ని సృష్టించి క్షమాపణ వేడుకోవాలని కూడా చెప్పాడు ఈ స్వామి.

2020-02-16

ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట (హైదరాబాద్) ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. పాత బస్తీ లోని లాల్ దర్వాజాలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, ఆఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతుల కోసం రూ. 3 కోట్లు విడుదల చేయాలని కోరారు. వెంటనే కేసీఆర్...ఈ రెండు ప్రార్ధనా మందిరాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు.

2020-02-09

సిఎఎకి కేరళలో వ్యక్తమైన నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ ఖండించారు. ‘‘సిఎఎ వ్యతిరేక ఆందోళన తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తోందని కేరళ సిఎం చెబుతుంటే సిపిఎం ఎందుకు సమర్ధిస్తోంది’’ అని మోడీ నిన్న రాజ్యసభలో ప్రశ్నించారు. ప్రధాని తన ప్రకటనను సవరించుకోవాలని విజయన్ డిమాండ్ చేశారు. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్.డి.పి.ఐ), ఆర్ఎస్ఎస్... రెంటి మతతత్వాన్నీ వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

2020-02-07

గతంలో ఆర్ఎస్ఎస్ సమావేశాలకు వెళ్లిన తాను ఆ సంస్థనుంచి బయటకు రావడానికి కారణం ఏమిటో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకం చదివానని, మనుస్మృతినే రాజ్యాంగంగా భావించే ఆ సిద్ధాంతం సరి కాదని బయటకు వచ్చానని అరుణ్ కుమార్ చెప్పారు. ప్రజలను భయపెట్టే చట్టాలు, పాకిస్తాన్ వ్యతిరేకతతో ఎన్నికలు గెలవాలనే ప్రయత్నం మానాలని ప్రధాని మోడీకి సూచించారు.

2020-02-06

అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదును తిరిగి నిర్మించడంకోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ఉత్తరప్రదేశ్ మంత్రి శ్రీకాంత్ శర్మ బుధవారం ప్రకటించారు. ఫైజాబాద్ జిల్లా సోహావాల్ తెహసీల్ పరిధిలో ధన్నిపూర్ గ్రామంలో భూమిని కేటాయించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ గ్రామం అయోధ్య పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రిపబ్లిక్ టీవీ మాత్రం వారణాసిలోని ‘ధన్నిపూర్’లో భూమి కేటాయించనున్నట్టు రాసింది. ఇది అయోధ్యకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంటుంది.

2020-02-05

అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణంకోసం ట్రస్టు ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం లోక్ సభలో ప్రకటన చేశారు. ట్రస్టుకు ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’గా నామకరణం చేసినట్టు చెప్పారు. రామజన్మభూమి దర్శనంకోసం వచ్చే యాత్రీకులను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశమై రామజన్మభూమి నిర్మాణ ట్రస్టుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంది.

2020-02-05

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను వ్యతిరేకిస్తున్నవారిపై బిజెపి నేతల విద్వేష ప్రచారం తారా స్థాయికి చేరింది. నిరసనకారులను ‘‘దేశ ద్రోహులు’’గా అభివర్ణిస్తూ అనుకూల ర్యాలీలలో ‘‘కాల్చి చంపండి’’ అని నినాదాలివ్వడం చూశాం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో సాక్షాత్తు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీ అనుయాయులతో అదే నినాదాన్ని చేయించారు. ‘దేశ్ కే గద్దారోంకో’ అని ఠాకూర్ అంటే.. సభికులు ‘గోలీమారో సాలోంకో’ అని నినదించారు.

2020-01-28

హిందు, ముస్లిం, క్రైస్తవ మతాల మధ్య సామరస్యానికి కేరళ ఓ ఉదాహరణ. తాజాగా చేరవల్లి జమాత్ మసీదు ఓ హిందూ వివాహానికి వేదికై మరోసారి ఈ అంశాన్ని చాటింది. వధూ వరులు ఆషా, శరత్ హిందూ సంప్రదాయ పద్ధతుల్లో ఆ మసీదులో వివాహం చేసుకున్నారు. ఆషా తల్లి మసీదు సాయం కోరడంతో స్పందించిన పెద్దలు వివాహం జరిపించారు. వధూవరులకు, కుటుంబాలకు, మసీదు ప్రముఖులకు, చేరవల్లి ప్రజలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుభాకాంక్షలు తెలిపారు.

2020-01-19

మహారాష్ట్రలో షిర్డీ సాయి జన్మస్థల వివాదం రాజుకుంది. సాయి మందిరం కొలువైన షిర్డీ పట్టణంలో ఆదివారం బంద్ నిర్వహిస్తున్నారు. సాయి జన్మస్థలం పర్భని జిల్లాలోని ‘పత్రి’ అని పేర్కొంటూ.. ఆ ప్రాంత అభివృద్ధికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రూ. 100 కోట్లు ప్రకటించడంపై ‘షిర్డీ’ సంస్థానం మండిపడింది. 102 సంవత్సరాల క్రితం సాయి సమాధి అయ్యేవరకు షిర్డీలో గడిపారని సంస్థానం చెబుతోంది. షిర్డీ నిరవధిక బంద్ జరిగినా దేవాలయం మాత్రం తెరిచే ఉంటుందని సంస్థానం తెలిపింది.

2020-01-19

పాకిస్తాన్లో ముగ్గురు హిందూ, సిక్కు బాలికల అపహరణపై ఇండియా తీవ్రంగా స్పందించింది. భారత విదేశాంగ శాఖ శుక్రవారం పాకిస్తాన్ హై కమిషన్ అధికారిని పిలిపించి తీవ్రమైన నిరసనను వ్యక్తీకరించింది. శాంతి మేఘ్వాద్, శర్మి మేఘ్వాద్ అనే అమ్మాయిలు జనవరి 14న అపహరణకు గురయ్యారు. వీరిద్దరూ సింధ్ ప్రావిన్సులోని ఉమర్ గ్రామ వాసులు. జనవరి 15న మెహక్ అనే అమ్మాయి అపహరణకు గురైంది. పాకిస్తాన్లో హిందూ మహిళల అపహరణలు, బలవంతపు పెళ్లిళ్ళపై ఇండియా ఇటీవల పలుమార్లు నిరసన వ్యక్తం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

2020-01-18 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 Last Page