ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంత కుల పిచ్చి ఏమిటో అర్దం కావడంలేదని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై స్వయాన ముఖ్యమంత్రి మాటల దాడి చేయడాన్ని నరేంద్ర తప్పు పట్టారు. ‘‘మీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ ఏ కులం? పీవీపీది ఏ కులం? మీరు రాజకీయం కోసం వాటేసుకున్న వంశీది ఏ కులం? నిన్నగాక మొన్న చేరిన బలరాంది ఏ కులం?’’ అని సిఎంను ప్రశ్నించారు. ‘‘మీ ధనదాహం తీర్చడానికైతే కులాలు అక్కర్లేదు’’ అని నరేంద్ర మండిపడ్డారు.
2020-03-16‘‘రాష్ట్రానికి వచ్చింది కరోనా వైరసా.. కమ్మ వైరసా?’’ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్న ఇది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై స్పీకర్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ లోనూ బ్లాక్ షీప్ప్ ఉన్నాయంటూ.. రాష్ట్రం రమేష్ కుమార్ అబ్బ జాగీరు అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములు వస్తే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రధాని, రాష్ట్రపతి స్పందించాలన్న తమ్మినేని, ఉద్యమాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
2020-03-16 Read Moreఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆయన ఇష్టం వచ్చినట్టు తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అధికారిని ఎన్నికల కమిషనర్ గా నియమించాడని వ్యాఖ్యానించారు. ‘కరోనా’ సాకుతో ఓవైపు ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తూ..మరోవైపు గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను మారుస్తున్నట్టు సిఎంలాగా ఆదేశాలిచ్చాడని ఆక్షేపించారు. ఈ అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ‘ఎవడో’ రాసి ఇచ్చిన ఆర్డర్లను ఆయన ఈరోజు చదివాడని సిఎం వ్యాఖ్యానించారు.
2020-03-15‘కరోనా వైరస్’కి మందు అంటూ గోమూత్రంతో పార్టీ ఏర్పాటు చేశారు అఖిల భారత హిందూ మహాసభ చీఫ్ చక్రపాణి. శనివారం దేశ రాజధానిలో నిర్వహించిన ఈ తంతులో గోమూత్రాన్ని కలిపిన పాయసం వంటి పదార్ధాన్ని తాగారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ఆ సంస్థ చెబుతోంది. గోమూత్రంతో రోగాలు పోవని ఎంతమంది చెప్పినా.. మత సంస్థలు మాత్రం అందులో ఔషధ గుణాలున్నాయని ప్రచారం చేస్తున్నాయి. ‘‘కరోనా.. మాంసాహారులైన చైనీయులను శిక్షించడానికి వచ్చిన మరో అవతారం’’ అన్న చక్రపాణి (శాఖాహారి), ఇప్పుడు ‘కరోనా’కు మందు (గోమూత్రం) తీసుకోవడం గమనార్హం.
2020-03-14 Read Moreగత నెలలో మతోన్మాద అల్లరి మూకలు దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించాయి. 50 మందికి పైగా మరణించారు. మసీదులు, ఇళ్ళు దగ్ధమయ్యాయి. భయం వెన్నాడుతుండగా మనుషుల మధ్య కొత్త కంచెలు పుట్టుకొస్తున్నాయి. కాలనీలు, మసీదుల రక్షణకు వివిధ ప్రాంతాల్లో స్థానికులు ఇనుప గేట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముస్తఫాాబాద్, ఇందిరా విహార్, భాగీరథీ విహార్..ఇలా పలు ప్రాంతాల్లో కొత్తగా వీధులకు గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. చమన్ పార్కులోని మసీదుకు రక్షణగా ఓ గేటును ఏర్పాటు చేశారు.
2020-03-14 Read Moreఏసుక్రీస్తు పుట్టిన స్థలంగా భావించే బెత్లెహమ్ నేటివిటీ చర్చిని ‘కరోనా’ భయంతో మూసివేశారు. బెత్లెహెంలోని ఓ హోటల్ కు వచ్చిన గ్రీకు టూరిస్టులలో ఇద్దరికి ‘కరోనా’ సోకినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో.. స్థానిక చర్చిలు, మసీదులు, ఇతర సంస్థలను తదుపరి సమాచారం ఇచ్చేవరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో చర్చ్ ఆఫ్ నేటివిటీని నిరవధికంగా మూసివేస్తున్నట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో.. ఈస్టర్ కోసం (వచ్చే నెల) వేలాది మంది ఈ చర్చికి తరలి వస్తారు.
2020-03-05 Read Moreగత నెలలో ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న మతోన్మాద ఘర్షణల్లో మృతుల సంఖ్య 53కు చేరింది. దాడులకు గురైనవారిలో ఆరుగురు గురువారం మరణించినట్టు గురు తేజ్ బహుదూర్ ఆసుపత్రి ప్రకటంచింది. వీరితో కలిపి ఆ ఆసుపత్రిలో రిపోర్టయిన మృతుల సంఖ్య 44కు చేరింది. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో ఐదుగురు, ఎల్.ఎన్.జె.పి. ఆసుపత్రిలో ముగ్గురు, ప్రవేష్ చంద్ర ఆసుపత్రిలో ఒకరు చొప్పున మృతుల పేర్లు నమోదయ్యాయి. అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా 654 కేసులు నమోదు కాగా 1829 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు.
2020-03-05 Read Moreకేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా ఆదివారం (మార్చి 1న) కోల్ కత నగర వీధుల్లో ‘గోలీమారో’ నినాదాలు మార్మోగాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేకులను దేశద్రోహులుగా పేర్కొంటూ వారిని కాల్చి చంపాలని బిజెపి నేతలు నినదించారు. షాహిద్ మినార్ మైదానంలో అమిత్ షా సభకు హాజరయ్యేందుకు వెళ్తూ బిజెపి నేతలు ఈ నినాదాలు ఇచ్చారు. ఢిల్లీలో సాక్షాత్తు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బిజెపి నేత కపిల్ మిశ్రా ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, ఆ తర్వాత మతోన్మాద దాడులు జరగడం తెలిసిందే.
2020-03-01 Read Moreబాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులైన రామజన్మభూమి న్యాస్ చీఫ్ నృత్యగోపాల్ దాస్, విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులుగా ఎంపికయ్యారు. కేంద్రం ప్రకటించిన ట్రస్టు తొలి సమావేశం బుధవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాది పరాశరన్ ఇంట్లో జరిగింది. ముందే నిర్ణయమైన వారిద్దరి పేర్లనూ చివరివరకు ట్రస్టు సభ్యుల్లో చేర్చలేదు. బుధవారం నాటి సమావేశానికి కూడా వారు ఆహ్వానితులుగానే హాజరయ్యారు. వారిద్దరూ ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.
2020-02-20 Read Moreమహాత్మా గాంధీని నాథురాం గాడ్సే చంపిన చోట... తొలిసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. గాంధీ తానొక సనాతన హిందువునని అనేకసార్లు చెప్పారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం చెప్పారు. గాంధీ అనేక ప్రయోగాలు చేశారని, కొన్ని విఫలమైనా...వాటికి తానే బాధ్యత తీసుకున్నారని భగవత్ పేర్కొన్నారు. ఈ రోజుల్లో నిరసనలు హింసాత్మకమైనా ఏ ఒక్కరూ బాధ్యత వహించడంలేదని పరోక్షంగా సిఎఎ వ్యతిరేక ఆందోళనకారులను ఆక్షేపించారు.
2020-02-17