సామ్రాజ్యవాదానికి, జాతివివక్షకు ప్రతీకలుగా నిలిచిన అనేక మంది విగ్రహాలు అమెరికా, ఐరోపాలలో కూలిపోతున్నాయి. ఆ క్రమంలోనే... అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రవేశ ద్వారానికి ముందు కనిపించే థియోడర్ రూజ్‌వెల్ట్ విగ్రహాన్ని తొలగించబోతున్నారు. ఆ విగ్రహ రూపకల్పనలోనే.. ఆఫ్రికన్ అమెరికన్లు, స్వదేశీ అమెరికన్లను తక్కువ జాతివారిగా చిత్రించారని అభ్యంతరాలున్నాయి. రూజ్‌వెల్ట్ గుర్రంపై కూర్చొని ఉంటే ఓ నల్లజాతీయుడు, మరో దేశీ అమెరికన్ క్రింద నిల్చొని ఉన్నట్లుగా ఆ కాంశ్య విగ్రహాన్ని చెక్కారు. రూజ్‌వెల్ట్ విగ్రహాన్ని తొలగించనున్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో ప్రకటించారు.
2020-06-22ఇండియాలో ప్రముఖ ఆద్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్.. సోషలిజంపై చేసిన వ్యాఖ్యానం ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో బాగా ప్రచారంలో ఉంది. ప్రఖ్యాత అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ కమ్యూనిస్టు రష్యా వెళ్లినప్పుడు.. రెండు కోళ్ళతో కనిపించిన వ్యక్తిని ఓ కోడి అడిగితే ఎలా స్పందించాడో జగ్గీ చెప్పుకొచ్చారు. 1910లో మరణించిన మార్క్ ట్వైన్ 1917లో స్థాపించిన సోవియట్ రష్యా ఎలా వెళ్లారని కొందరికి ధర్మ సందేహం వచ్చింది. అయితే, ఆ చర్చను నిర్వహించిన కార్పొరేట్ ప్రముఖుడు కె.వి. కామత్ (పద్మభూషణ్)కు గానీ, జగ్గీ అనుయాయులకుగానీ ఈ సందేహం రాలేదు. పైగా సోషలిజంపై జగ్గీ వెటకారానికి పగలబడి నవ్వారు. ఆధ్యాత్మి‘కథ’లింతేనా?
2020-06-10అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన తొలి దశ పనులు పున:ప్రారంభమయ్యాయి. మందిరం శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ‘కరోనా లాక్ డౌన్’ నుంచి రామమందిరం పనులకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో.. స్థలంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నారు. మెటల్ బారికేడ్లను, సి.ఆర్.పి.ఎఫ్. క్యాంపును తొలగించారు. స్థలాన్ని చదును చేయడం ప్రారంభమైంది. స్థానిక పిడబ్ల్యుడి అధికారుల బృందం ఎల్&టి ఇంజనీర్లతో కలసి పని చేస్తోంది. కంపెనీ ‘నో ప్రాఫిట్, నో లాస్’ ప్రాతిపదికన మందిర నిర్మాణంలో భాగమవుతున్నట్టు చెబుతున్నారు.
2020-05-08‘లాక్ డౌన్’ సమయంలో రంజాన్ ఇఫ్తార్ విందులకూ మినహాయింపు ఉండదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ మత కార్యక్రమాలూ జరగకుండా ‘లాక్ డౌన్’ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. రంజాన్ మాసం ఈ నెల 23న ప్రారంభం కానుండగా.. ‘లాక్ డౌన్’ను మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మత కార్యక్రమాలు, పాఠశాలలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలూ నిర్వహించకూడదని కిషన్ రెడ్డి బుధవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘లాక్ డౌన్’ మినహా ‘కరోనా’ కట్టడికి మరో మార్గం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
2020-04-15హిందూ పేషెంట్లకు ఒక వార్డు.. ముస్లిం పేషెంట్లకు మరో వార్డు.. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో జరిగిన ఏర్పాటు ఇది. పైగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే వేర్వేరు వార్డులు ఏర్పాటు చేశామని చెప్పారు ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గణ్వంత్ హెచ్. రాథోడ్. కరోనా వైరస్ పేషెంట్లు, అనుమానిత కేసుల కోసం 1200 బెడ్లను ఈ ఆసుపత్రిలో సిద్ధం చేశారు. మత విశ్వాసాల ఆధారంగా పేషెంట్లను వేర్వేరుగా ఉంచడం ఇక్కడి ఉన్మాద స్థితిని సూచిస్తోంది. అయితే... ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నితిన్ పటేల్ ఈ విషయం తనకు తెలియదని చెబుతున్నారు.
2020-04-15ఏపీలో బుధవారం వరకు నమోదైన 87 ‘కరోనా’ కేసుల్లో 70 ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్ధనా సమావేశాలతో సంబంధం ఉన్నవేనని సిఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశాలకు వెళ్లారని, వారిలో ఇప్పటికి 585 మందికి పరీక్షలు నిర్వహించగా 70 పాజిటివ్ కేసులు తేలాయని సిఎం బుధవారం వివరించారు. మరో 500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని, 21 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవాళ్లతో పాటు.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగినవారు డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ‘ఇదేం తప్పు కాదు. నయం కాని జబ్బూ కాదు. 104కు ఫోన్ చేస్తే వైద్యులు వచ్చి పరీక్షిస్తారు’ అని సిఎం చెప్పార
2020-04-01ఢిల్లీ నిజాముద్దీన్ ‘మర్కజ్’లో ‘తబ్లిఘి జమాత్’ నిర్వహించిన మత సమ్మేళనం ‘కరోనా’ వ్యాప్తికి ఒకానొక కేంద్ర బిందువుగా మారడం.. ఇప్పుడు ముస్లిం వ్యతిరేక సంస్థలకు ఆయుధంలా అందివచ్చింది. మంగళవారం సామాజిక మాథ్యమాల్లో.. #coronajihad #biojihad #terrorists హ్యాష్ ట్యాగులతో ముస్లిం వ్యతిరేక ప్రచారం తారాస్థాయికి చేరింది. విదేశాల నుంచి నిజాముద్దీన్ ‘మర్కజ్’కు వచ్చినవారు ఉద్దేశపూర్వకంగానే ‘కరోనా’ను వ్యాపింపజేశారనే ప్రచారం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 8.55 లక్షల మందికి సోకిన ‘కరోనా’ ఇండియాలో వెయ్యిమందిని దాటేసరికి ‘మతం’ రంగు పులుముకుంది! ‘చైనా వైరస్’ రూపు మారింది!!
2020-04-01‘కరోనా వైరస్’ కట్టడికోసం దేశ ప్రజలంతా ఆదివారం ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ ఎదుట ఓ పెట్రోల్ బాంబు పేలింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా 100 రోజుల ఆందోళన తర్వాత.. నిన్న ఖాళీ చేసిన నిరసన శిబిరంపై ఓ దుండగుడు కాల్పులు జరుపుతూ పెట్రోల్ బాంబు విసిరినట్టు జామియా విద్యార్ధులు, అధ్యాపకులు చెప్పారు. డెలివరీ బాయ్ వేషధారణలో ఓ వ్యక్తి బైకుపైన వచ్చినట్టు సీసీ కెమేరాలో రికార్డయింది. ‘కరోనా’పై దేశమంతా ఏకమై పోరాడుతున్న క్రమంలో.. ఈ పెట్రోల్ బాంబుతో ఉన్మాదులు మరోసారి విభజన సందేశం పంపారు.
2020-03-22‘కరోనా’ భయం వ్యాపించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. ఉత్తరాది నుంచి వచ్చిన ఓ భక్తుడికి ‘కరోనా’ లక్షణాలు కనిపించడంతో గురువారం టీటీడీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. మధ్యాహ్నం నుంచి తిరుమల కొండపైకి వచ్చే వాహనాలను అనుమతించలేదు. కాలినడక మార్గాలను కూడా మూసివేసి కొండపైన దర్శనం చేసుకుంటున్న వాళ్లు తిరిగి వెళ్లడానికి మాత్రమే అనుమతించారు. అందరూ వెళ్లిపోయాక దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు.
2020-03-19పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)లో మత ప్రస్తావన, దేశాల పేర్లు తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. సిఎం కేసీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి) అమలుతో పెద్ద సంఖ్యలో ప్రజలు తొలగింపునకు గురవుతారన్న ఆందోళన తీర్మానంలో వ్యక్తమైంది. ‘సమానత్వం’, ‘సెక్యులరిజం’ అనే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు సిఎఎ పూర్తి విరుద్ధంగా ఉందని, పౌరసత్వ చట్టాల నుంచి వాటిని తొలగిండం ద్వారా మత పాలనను వ్యవస్థీకృతం చేయవచ్చని తీర్మానంలో పేర్కొన్నారు.
2020-03-16