ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ముహూర్తం ప్రకారం శనివారం ఉదయం 11.47 గంటలకు బాధ్యతలు స్వీకరించిన సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన సూత్రానికి వెళ్లి భోజనం చేశారు.

2019-06-22

ట్రిపుల్ తలాఖ్ బిల్లును శుక్రవారం లోక్ సభలో కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యతిరేకించారు. ‘ట్రిపుల్ తలాఖ్’కు తాము వ్యతిరేకమేనని, సుప్రీంకోర్టు తీర్పుతో ఆ అనాచారానికి కాలం చెల్లిందని, అయితే దానిపైన ప్రభుత్వం తెచ్చిన బిల్లు ఒక మతాన్ని లక్ష్యంగా చేసిందని కాంగ్రెస్ నేత శశిథరూర్ విమర్శించారు. ఈ బిల్లులో ముస్లిం పురుషులకు నిర్దేశించిన మూడేళ్ల జైలు శిక్షను ప్రస్తావించిన అసదుద్దీన్ ఒవైసీ, అలాంటి నేరమే చేసిన ముస్లిమేతర పురుషులకు ఏడాది జైలు శిక్ష ఉందని చెప్పారు.

2019-06-21

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదాభివందనాల పరంపర కొనసాగుతోంది. విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందకు ఆయన సోమవారం విజయవాడలో పాదనమస్కారం చేశారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ కార్యక్రమం విజయవాడలో సోమవారం ముగిసింది. కిరణ్ కుమార్ శర్మకు ‘స్వాత్మానందేంద్ర’గా నామకరణం చేశారు స్వరూపానంద. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ ‘స్వాత్మానంద’కు కిరీటం పెట్టి ‘స్వరూపానంద’కు పాదాభివందనం చేశారు.

2019-06-17

హిందూత్వ పార్టీలు కూడా చేయనంతగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు యాగాలు నిర్వహించారని విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానంద కొనియాడారు. కేసీఆర్ ఆయత చండీయాగం, రాజశ్యామల యాగం చేయడాన్ని ప్రశంసించారు. కేసీఆర్ మహాభారతాన్ని రెండుసార్లు చదివారంటూ... మహాభారతం చదివి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి దేశంలో కేసీఆర్ అని స్వరూపానంద వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో శారదాపీఠం ఉత్తరాధికారి పట్టాభిషేక కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

2019-06-17

జగన్మోహన్ రెడ్డిని ఏపీ సిఎంను చేయడంకోసం విశాఖ శారదా పీఠం ఐదేళ్లు ప్రాణం పెట్టి పని చేసిందని, అందరు దేవతల ఆశీస్సులు ఆయనకు దక్కేలా కృషి చేసిందని పీఠాధిపతి స్వరూపానందేంద్ర చెప్పారు. కిరణ్ కుమార్ శర్మకు విజయవాడలో ‘స్వాత్మానందేంద్ర సరస్వతి’గా పట్టాభిషేకం చేసిన కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ హాజరయ్యారు. వారిద్దరినీ రెండు రాష్ట్రాలకు రాజులుగా అభివర్ణించారు స్వరూపానంద. జగన్ అంటే తనకు ప్రాణమని స్వరూపానంద ఈ సందర్భంగా చెప్పారు.

2019-06-17

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానంద దర్శనం చేసుకున్నారు. అనంతరం రాజశ్యామలాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకోసం జగన్ ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్ళారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి భారీ కాన్వాయ్ తో జగన్ శారదాపీఠానికి వెళ్ళారు.

2019-06-04
First Page 1 2 3 4 5 6 7 8 9 10 Last Page