‘కరోనా’ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనాన్ని నిలువరించేందుకు రూ. లక్షన్నర కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్ధీపన ప్యాకేజీని సిద్ధం చేయనున్నట్టు తాజా వార్త. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకు మధ్య చర్చలు జరుగుతున్నట్టు ‘రాయిటర్స్’ కథనం. ఈ ప్యాకేజీ రూ. 2.3 లక్షల కోట్ల వరకు కూడా ఉండొచ్చని ఓ ప్రభుత్వ అధికారి చెప్పినట్టు ‘రాయిటర్స్’ రాసింది. ప్యాకేజీలో భాగంగా 10 కోట్ల మంది పేదల అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేయవచ్చని, దెబ్బ తిన్న వ్యాపారాలను ఆదుకోవడానికి చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వారాంతంలోగా ప్యాకేజీని ప్రకటిస్తారని సమాచాారం.
2020-03-25‘కరోనా’ కష్ట కాలంలో ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడుతుందా? సోమవారం పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లుకు కేంద్రం చేసిన సవరణ అవుననే అంటోంది! ప్రత్యేక ఎక్సైజ్ సుంకం విధింపుపై ఉన్న పరిమితులను పెట్రోలుపై రూ. 18కి, డీజిలుపై రూ. 12కి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ బిల్లు 2020కి సవరణను ప్రతిపాదించారు. ఈ సవరణతో సహా ఫైనాన్స్ బిల్లు ఏ చర్చా లేకుండానే ఆమోదం పొందింది. దీంతో.. భవిష్యత్తులో రూ. 8 మేరకు పన్నులు పెంచే అధికారం ప్రభుత్వానికి దఖలు పడింది. ముడి చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచుకుంటూ పోతోంది.
2020-03-23స్టాక్ మార్కెట్ తరహాలోనే రూపాయి తిరోగమనం కొనసాగుతోంది. సోమవారం డాలరు విలువ ఓ రూపాయికి పైగా పెరిగింది. డాలరుకు 76.29 రూపాయల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇది చరిత్రలోనే కనిష్ఠ స్థితి. రిస్కీ ఆస్తులను వదిలించుకొని ఇన్వెస్టర్లు సురిక్షత మార్గాలవైపు మళ్ళుతుండటం ఈ పరిస్థితికి కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలే 11 సంవత్సరాల కనిష్ఠ స్థితికి చేరిన భారత జాతీయ వృద్ధి రేటు ‘కరోనా’ దెబ్బకు మరింత తగ్గుతుందనే ఆందోళన నెలకొంది.
2020-03-23ఈ నెల 31 వరకు తెలంగాణ ‘లాక్ డౌన్’ ప్రకటించిన సిఎం కేసీఆర్, ప్రజలకు అవసరమైన నిత్యావసరాలకోసం ఒక ప్యాకేజీని ప్రకటించారు. రాష్ట్రంలోని 87.59 లక్షల కుటుంబాల్లో ఒక్కో మనిషికి 12 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఇతర సరుకులు కొనుగోలు చేయడంకోసం కుటుంబానికి రూ. 1500 చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారు. 3.36 లక్షల టన్నుల బియ్యానికి రూ. 1103 కోట్లు, సరుకులకోసం మరో రూ. 1314 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
2020-03-22‘‘బిల్ గేట్స్, జాక్ మా వంటి వారు ‘కరోనా’పై పోరాటంలో తమ దేశానికే కాకుండా ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో సాయం చేస్తున్నారు. మరి ఇండియన్ బిలియనీర్లు బాల్కనీలో నిలబడి చప్పట్లు చరిచి చేతులు దులుపుకుంటారా?’’.. సామాజిక మాథ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్న ఇది. రూ. లక్షల కోట్లలో ఏటా పొందే రాయితీలు, బ్యాంకు రుణాల మాఫీతో పాటు.. ఈ ఏడాది పన్ను తగ్గింపు ద్వారా మరో రూ. 1,46,000 కోట్ల అదనపు లబ్ది పొందారు భారత పారిశ్రామికవేత్తలు. కానీ, ‘కరోనా వైరస్’ వంటి మహమ్మారిని నిరోధించే చర్యల్లో భాగం కావడంలేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.
2020-03-21స్టాక్ మార్కెట్ల పతనం ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసికి భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది. లిస్టెడ్ కంపెనీలలో జీవిత బీమా కార్పొరేషన్ ఈక్విటీ పెట్టుబడుల విలువ 2019 డిసెంబరు చివరికి రూ. 6.02 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ. 4.14 లక్షల కోట్లకు తగ్గింది. రూ. 1.88 లక్షల కోట్లు (31 శాతం) తగ్గింది. 209 కంపెనీలను అధ్యయనం చేసినప్పుడు.. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలలో రూ. 56,810 కోట్లు నష్టం తేలింది. తర్వాత ఆయిల్ & గ్యాస్ (రూ. 36,020 కోట్లు), సిగరెట్ కంపెనీలు (రూ. 17,374 కోట్లు), ఐటి (రూ.15,826 కోట్లు), మెటల్స్ (రూ.12,045 కోట్లు), ఆటోమొబైల్ (రూ.11,329 కోట్లు) రంగాలు ఎక్కువ నష్టాలను మిగిల్చాయి.
2020-03-19 Read Moreరోజువారీ పతనంతో నిన్న 30 వేల పాయింట్ల దిగువకు పడిపోయిన బిఎస్ఇ సెన్సెక్స్, గురువారం మరింత దిగజారింది. ఓ దశలో 1870 పాయింట్లు పడిపోగా ప్రస్తుతం 1600 పాయింట్ల నష్టంతో 27,270 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. గత 38 నెలల్లో ఇదే కనిష్ఠం. ఎన్ఎస్ఇ నిఫ్టీ 8000 పాయింట్ల దిగువకు (7,900) పతనమైంది. 2016 డిసెంబర్ 27 తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ అత్యధికంగా 13 శాతం పడిపోయాయి. కోటక్ మహీంద్రా, ఇండస్ ల్యాండ్ బ్యాంక్ 10 శాతం, హెచ్.డి.ఎఫ్.సి. ద్వయం 7 శాతం చొప్పున తగ్గిపోయాయి.
2020-03-19 Read More2019 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ. 18,564 కోట్ల నష్టాన్ని ప్రకటించింది సంక్షుభిత ‘ఎస్’ బ్యాంకు. 2018 డిసెంబరు త్రైమాసికంలో బ్యాంకు రూ. 1001 కోట్ల లాభాన్ని చూపించింది. 2019 చివరికి బ్యాంకు పారు బకాయిలు రూ. 40,709 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణాల్లో ఇవి 18.87 శాతం. వాటి సర్దుబాటు కోసం బ్యాంకు ఏకంగా రూ. 24,765.73 కోట్లు కేటాయించింది. దీంతో కేపిటల్ భారీగా తగ్గిపోయింది. 2019 సెప్టెంబరు 30 నాటికి రూ. 2.09 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకు డిపాజిట్లు డిసెంబర్ నాటికి రూ. 1.65 లక్షల కోట్లకు తగ్గాయి.
2020-03-15 Read Moreమొబైల్ ఫోన్లపై పన్నును పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మోతాదు మొబైల్ ఫోన్లపై 12 శాతంగా ఉంది. దాన్ని 18 శాతానికి పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. మొబైల్ ఫోన్లపై 12 శాతం పన్ను ఉన్నప్పుడే.. వాటిలో వాడే కొన్ని పరికరాలపై 18 శాతం పన్ను ఉండేది. దాన్ని 12 శాతానికి తగ్గించాలి పరిశ్రమ వర్గాలు కోరగా.. కేంద్రం మొబైల్ ఫోన్లపైనే పన్నును పెంచింది.
2020-03-14అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే భారత ప్రభుత్వం పన్నులు పెంచింది. పెట్రోల్, డీజిల్ లపై లీటరుకు రూ. 3 చొప్పున సుంకాలను పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఎక్సైజ్ సుంకం రూ. 2, రోడ్ సెస్ మరో రూపాయి పెంచారు. దీంతో కేంద్ర పన్నుల వాటా లీటరు పెట్రోలుపై రూ. 22.98కి, డీజిలుపై రూ. 18.83కి పెరిగింది. ముడి చమురు ధర పెరిగినప్పుడు వేగంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ముడి చమురు ధర తగ్గినప్పుడు మాత్రం ఎక్కువ ప్రయోజనాన్ని ప్రభుత్వం, కంపెనీలు పంచుకుంటున్నాయి.
2020-03-14