2020 కేలండర్ సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ‘సున్నా’గా ఉంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. కొద్ది రోజుల క్రితం అంచనాల్లో.. జీడీపీ 2.5 శాతం వృద్ధి చెందుతుందని ఈ సంస్థ పేర్కొంది. 21 రోజుల దేశవ్యాప్త ‘లాక్ డౌన్’ను 19 రోజులు (మే3 వరకు) పొడిగించడం వల్ల ఆర్థిక వ్యవస్థ 234.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 18 లక్షల కోట్ల)ను నష్టపోతుందని అంచనా వేసింది. ఇది మొత్తం జీడీపీలో 8.1 శాతం. ‘లాక్ డౌన్’తో పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్ భారీగా నష్టపోతాయని బార్క్లేస్ పేర్కొంది.

2020-04-14

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ‘కరోనా’ కష్టకాలంలో రిజర్వు బ్యాంకు స్వల్పంగా ఊరట కలిగించింది. వరుసగా 21 రోజుల వరకు, ఒక త్రైమాసికంలో 50 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్టు (ఒ.డి) సదుపాయాన్ని వినియోగించుకునేలా పరిమితులను పెంచింది. ఇప్పటిదాకా.. వరుసగా 14 రోజులకు మించి, ఒక త్రైమాసికంలో 36 రోజులకు మించి ఒ.డి.కి వెళ్లే అవకాశం లేదు. తాజా మార్పులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. 2020 సెప్టెంబరు 30 వరకు ఈ వెసులుబాటు కల్పించింది. ఒ.డి.గా తీసుకునే మొత్తంపైన అదనపు వడ్డీ ఉంటుంది.

2020-04-08

గుజరాత్ నుంచి 3 కంపెనీలు హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను అమెరికాకు ఎగుమతి చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పారు. ఈ పరిణామాన్ని.. ‘ప్రపంచవ్యాప్తంగా గుజరాత్ ప్రకాశించడం’గా సిఎం అభివర్ణించారు. ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ పంపకపోతే ‘ప్రతీకార చర్యలు’ ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. కేంద్ర అనుమతించినందున ఎగుమతులకు గుజరాత్ సిద్ధంగా ఉందని విజయ్ రూపాని మంగళవారం ఓ ప్రైవేటు రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు.

2020-04-08

‘కరోనా’ కట్టడికోసం విధించిన ఆంక్షలు, దేశవ్యాప్త ‘లాక్ డౌన్’ మధ్య మార్చి నెలలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్లు కొద్దిగా తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రూ. 97,597 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో రూ. 1,06,577 కోట్లు సమకూరాయి. 2019 మార్చి కంటే 2020 మార్చిలో తగ్గుదల 4 శాతం ఉంటే.. మొత్తం ఆర్థిక సంవత్సంలో వసూళ్ళు 8 శాతం పెరిగాయి. 2018-19లో 12 నెలలకు రూ. 8,76,794 కోట్లు వసూలు కాగా 2019-20లో 9,44,414 కోట్లు వచ్చాయి. గత సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కూడా వసూళ్ళు తగ్గినా ఆర్థిక సంవత్సరం మొత్తంలో పెరుగుదలే నమోదైంది.

2020-04-01

టెన్నిస్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ‘వింబుల్డన్’. అలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ ఈ ఏడాది ‘కరోనా వైరస్’ కారణంగా రద్దయింది. జూన్ 29 నుంచి జూలై 13 వరకు జరగాల్సిన వింబుల్డన్ ఛాంపియన్ షిప్ 2020ని రద్దు చేస్తూ.. అల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రధాన బోర్డు (ఎ.ఇ.ఎల్.టి.సి), మేనేజ్ మెంట్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. 134వ ఛాంపియన్ షిప్స్ ను 2021 జూన్ 28 నుంచి జూలై 11 వరకు నిర్వహించాలని నిర్ణయించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ‘వింబుల్డన్’ రద్దు కావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ సహా అనేక క్రీడోత్సవాలు వాయిదా పడ్డాయి.

2020-04-01

ఈ నెల 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ప్రార్ధనలకోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆరుగురు మరణించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి వెల్లడించింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో, గ్లోబల్ ఆసుపత్రులలో ఒక్కొక్కరు, నిజామాబాద్, గద్వాల్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడినట్టు సిఎంఒ ట్విట్టర్ ద్వారా తెలిపింది. శనివారం మరణించిన వృద్ధుడితో కలిపి ఆరుగురా.. లేక సోమవారమే ఆరుగురు మరణించారా? అన్న విషయంలో స్పష్టత లేదు. ఢిల్లీ ప్రార్ధనలకోసం వెళ్లివచ్చినవారిని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు సిఎంఒ పేర్కొంది.

2020-03-30

ప్రైవేటు కంపెనీలు జీతాల్లో కోత విధించడానికి వీల్లేదని కొద్ది రోజుల క్రితం హుకుం జారీ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఇప్పుడందుకు భిన్నంగా స్పందించారు. సిఎం నుంచి సర్పంచ్ వరకు, ఐఎఎస్ నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు అందరి వేతనాల్లోనూ కొత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల ఛైర్మన్ల జీతాల్లో 75 శాతం.. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల్లో 60 శాతం, మిగిలిన ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించనున్నట్టు సమాచారం. ఉద్యోగులతోపాటు పెన్షనర్లకు చెల్లించే మొత్తంలోనూ 50 శాతం కోత పడనుంద

2020-03-30

అమెరికా క్రూడాయిల్ ధర 18 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం 20 డాలర్ల కంటే తక్కువ స్థాయికి చేరింది. ‘కరోనా వైరస్’ దెబ్బకు డిమాండ్ తగ్గిపోవడంతో ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయి. అమెరికా ఆయిల్ బెంచ్ మార్క్ అయిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లేదా డబ్ల్యుటిఐ (బ్యారెల్) ధర 19.92 డాలర్లకు తగ్గింది. ఒక్క రోజులో 6 శాతం తగ్గి యూరప్ ఉదయానికి 20 డాలర్లకంటే కొద్దిగా పైకి చేరింది. అంతర్జాతీయ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ 10 శాతం తగ్గి బ్యారెల్ ధర 22.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2002 నుంచి ఇదే అత్యల్పం.

2020-03-30 Read More

‘కరోనా’ కేసులు పెరుగుతున్నందున వెంటిలేటర్లను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలను కోరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో 14,000 వెంటిలేటర్లు ‘కోవిడ్ 19’ పేషెంట్లకోసం సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. వచ్చే రెండు నెలల్లో 30,000 వెంటిలేటర్లను ఉత్పత్తి చేయవలసిందిగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే కోరింది. నోయిడా లోని అగ్వా హెల్త్ కేర్ మరో 10 వేల వెంటిలేటర్ల తయారీకి ఆర్డర్లు తీసుకుంది. 11.9 లక్షల ఎన్95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని, దేశీయ ఉత్పత్తిదారులు ప్రస్తుతం రోజుకు 50 వేల మాస్కులను తయారు చేస్తున్నారని కేంద్రం పేర్కొంది.

2020-03-30

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే యుద్ధంలో టాటా గ్రూపు సంస్థలు భాగమయ్యాయి. టాటా ట్రస్టులు, టాటా సన్స్, టాటా గ్రూపు కంపెనీలన్నీ కలిపి ఇందుకోసం రూ. 500 కోట్లు కేటాయించాయి. వైరస్ నుంచి రక్షణకోసం వైద్య సిబ్బందికి వ్యక్తిగత సాధనాలు, రోగులకు అవసరమైన శ్వాస పరికరాలు, పరీక్షలను పెంచడానికి టెస్టింగ్ కిట్లు, చికిత్సా సదుపాయాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా శనివారం వెల్లడించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠిన పరీక్షల్లో ‘కరోనా’ ఒకటి అని రతన్ టాటా పేర్కొన్నారు.

2020-03-28
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page