‘‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు..’’ అన్న రాష్ట్రాల విమర్శలకు కేంద్రం విరుగుడు మంత్రం వేసింది. ఎక్కువ అప్పులు చేసుకోండంటూ ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 3% నుంచి 5%కి (రాష్ట్రాల జి.ఎస్.డి.పి.లో) పెంచింది. ఈ పెంపుదలతో రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం చెప్పారు. ‘కరోనా’ దెబ్బకు ఆర్థికంగా కష్టాలపాలైన రాష్ట్రాలు కేంద్ర సాయాన్ని, తమకు రావలసిన బకాయిలను కోరుతున్నాయి. వాటి విషయం ప్రక్కన పెట్టి అప్పులు పెంచుకునేందుకు అనుమతించిన కేంద్రం, దానికీ ‘సంస్కరణల’ షరతు పెడుతున్నట్టు సమాచారం.
2020-05-17‘కరోనా’ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ పేరిట కొత్త ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ రూ. 20 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. అయితే, ఇందులో అన్నీ కొత్తవి కావు. ‘కరోనా’పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ప్రకటించిన చర్యలు, ఈ కొత్త ప్యాకేజీ కలిపి రూ. 20 లక్షల కోట్లుగా ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత జీడీపీలో సుమారు 10 శాతం ఉంటుందని తెలిపారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ ప్రధానాంశాలుగా... రైతులు, కూలీలు, కుటీర పరిశ్రమలను పరిగణనలోకి తీసుకొని ప్యాకేజీని రూపొందించినట్టు మోడీ చెప్పారు.
2020-05-12ముడి చమురు ధరలు పతనమైనా పెట్రోలు, డీజిల్ రేట్లను తగ్గించని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడా లాభం మొత్తాన్ని తన ఖజానాకు మళ్లిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో మంగళవారం అర్ధరాత్రి ఎక్సైజ్ సుంకాలను పెంచింది. పెట్రోలుపై లీటరుకు రూ. 10, డీజిలుపై రూ. 13 చొప్పున పెంచిన ఎక్సైజ్ సుంకాలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో ఎక్సైజ్ సుంకం లీటరు పెట్రోలుపై ఏకంగా రూ. 32.98కి, డీజిలుపై రూ. 31.83కు పెరిగింది. అయితే, ఈ పెరిగిన భారం మొత్తం వెంటనే ప్రజలపై పడదు. ముడిచమురు ధరల తగ్గుదల లాభాన్ని ఇప్పటిదాకా కంపెనీలు అనుభవించగా.. ఇప్పుడు కేంద్రం గుంజుకుంటోంది.
2020-05-06కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంబిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆర్థిక రంగంలో ప్రధానమైన అధికారాలు కేంద్రం వద్ద ఉన్నాయని, అవి బదిలీ చేయడం గానీ లేదంటే నిధులు ఇవ్వడంగానీ చేయాలని, కేంద్రం ఏదీ చేయడంలేదని విమర్శించారు. తెలంగాణ సొంత ఆదాయం నెలకు రూ. 10,800 కోట్లు రావలసి ఉండగా.. గత నెల రూ. 1,600 కోట్లు మాత్రమే వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ మనీ వంటి సూచనను పట్టించుకోకపోగా.. రాష్ట్రాలను ఇరకాటంలోకి నెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీరు ఇలాగే కొనసాగితే రాష్ట్రాల నిరసన తప్పదని హెచ్చరించారు.
2020-05-05దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 8 లక్షల కోట్ల ఉద్ధీపన ప్యాకేజీ అవసరమని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అంచనా వేశారు. ముందే దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను ‘కరోనా’ మరింత దిగజార్చిందని స్వామి అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన ఉత్పత్తి నష్టం, కోల్పోయిన వేతనాలు, మరో ఏడాదిన్నర పాటు ఈ ప్రభావం ఉంటుందన్న అంచనాతో తాను ఈ లెక్క వేసినట్టు పేర్కొన్నారు. 2020 జూన్ 1 నుంచి 8 లక్షల కోట్ల ప్యాకేజీ అమలు చేయడం అవసరమని ‘ద సండే గార్డియన్’కు రాసిన వ్యాసంలో స్వామి అభిప్రాయపడ్డారు.
2020-05-03 Read More‘ఆసియా అతిపెద్ద సంపన్నుడు’ టైటిల్ మరోసారి ముఖేష్ అంబానీ సొంతమైంది. ‘ఫేస్ బుక్’ కంపెనీ రిలయన్స్ జియో వేదికల్లో 9.99 శాతం వాటా కొనుగోలు చేశాక.. ‘బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్’లో అంబానీ సంపద అకస్మాత్తుగా $4.7 బిలియన్లు పెరిగింది. మొత్తం $49.2 బిలియన్ల సంపదతో అంబానీ చైనా సంపన్నుడు జాక్ మా ($46 బిలియన్లు)ను మించిపోయారు. అంతకు ముందు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అంబానీ సంపద 28 శాతం తగ్గింది. ఫేస్ బుక్ ఒప్పందంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 90 వేల కోట్లు పెరిగింది.
2020-04-23ప్రపంచమంతా ‘కరోనా’ భయంతో వణుకుతున్న వేళ భారత మార్కెట్లలో ఓ మెగా పెట్టుబడి ఒప్పందం సంచలనం సృష్టించింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో వేదికల్లో కేవలం 9.99 శాతం వాటాకు రూ. 43,574 కోట్లు చెల్లించడానికి ‘ఫేస్ బుక్’ అంగీకరించింది. ఈ ఒప్పందంతో రిలయన్స్ జియో వేదికల మొత్తం విలువ అనూహ్యంగా రూ. 4.62 లక్షల కోట్లుగా తేలింది. మైనర్ వాటాకోసం ఇండియాకి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్.డి.ఐ) ఇదే అవుతుంది. ‘ఫేస్ బుక్’కు స్వాగతం పలుకుతూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
2020-04-22 Read Moreకేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని (డి.ఎ.ని) 4% మేరకు పెంచాలన్న నిర్ణయాన్ని ఈ కేలండర్ ఏడాది అమలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ ఆదాయంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో.. బుధవారం భేటీ కానున్న కేంద్ర కేబినెట్ వాయిదా నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ఈ నిర్ణయం 49.26 లక్షల ఉద్యోగులు, 61.17 లక్షల పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. 17% డి.ఎ.ని 21%కి పెంచాలని గత నెలలో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ పెంపుదలను ఈ ఏడాదికి నిలిపివేసి.. వచ్చే ఏడాది బకాయిల రూపంలో చెల్లించాలని ప్రభత్వం యోచిస్తోంది.
2020-04-21కరోనా వైరస్ కేంద్ర స్థానమైన చైనాలో 2020 తొలి త్రైమాసికంలో జీడీపీ తిరోగమించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో స్థూల ఉత్పత్తి మైనస్ 6.8 శాతంగా నమోదైంది. కరోనా ప్రభావం తీవ్రంగా పడింది ఈ త్రైమాసికంలోనే. జనవరి-మార్చి కాలంలో చైనా స్థూల దేశీయోత్పత్తి 20.65 ట్రిలియన్ యువాన్లు (2.91 ట్రిలియన్ యుఎస్ డాలర్లు)గా తేలింది. భారతీయ కరెన్సీలో ఇది రూ. 224 లక్షల కోట్లకు సమానం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంటే జీడీపీ 6.8 శాతం తగ్గిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ శుక్రవారం వెల్లడించింది. 1976 తర్వాత చైనా జీడీపీ కుంచించుకుపోవడం ఇదే తొలిసారి.
2020-04-17‘కరోనా’ మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా గ్రూపులను ఏర్పాటు చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ సహా ఆరుగురు ఇండియన్ అమెరికన్ కార్పొరేట్ లీడర్లకు వాటిలో చోటిచ్చారు. 18 గ్రూపుల ఏర్పాటుకోసం వివిధ పరిశ్రమలు, వర్గాలనుంచి 200కు పైగా ప్రముఖులను ఎంపిక చేశారు. వారి నుంచి ఉజ్వలమైన సలహాలను ట్రంప్ ఆశిస్తున్నారు. టెక్ గ్రూపులో పిచాయ్, నాదెళ్ళలతో పాటు అరవింద్ క్రిష్ణ (ఐబిఎం), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్), తయారీ రంగం గ్రూపులో ఆన్ ముఖర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూపులో అజయ్ బంగా పేర్లున్నాయి.
2020-04-16