చైనా సంస్థలతో కుదుర్చుకున్న 3 పెట్టుబడి ఒప్పందాలను నిలిపివేస్తూ మహారాష్ట్రలోని ‘మహావికాస్ అఘాది’ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి విలువ రూ. 5 వేల కోట్లు ఉంటుందని సమాచారం. ఇటీవల మాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 పేరిట నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. లడఖ్ లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో.. ఆ ఒప్పందాలపై మహారాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. ఘర్షణ జరగక ముందు ఈ ఒప్పందాలు కుదిరాయని, మరే ఇతర ఒప్పందాలపైనా సంతకాలు చేయవద్దని విదేశాంగ శాఖ సూచించిందని మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ చెప్పారు.
2020-06-22చైనా నిర్మించిన భారీ ప్రాజెక్టులలో ఒకటి ‘త్రీ గార్జెస్’ డ్యాం. వరద నివారణ, జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా ప్రధాన లక్ష్యాలుగా తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తయింది. లక్ష్యానికి తగ్గట్టే జలరవాణాలో ‘త్రీగార్జెస్’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 17 సంవత్సరాలుగా ఈ డ్యాం వద్ద ఉన్న షిప్ లాక్ ద్వారా 8,73,800 ఓడలు పయనించాయి. 1.22 కోట్ల మంది ప్రజలు ప్రయాణించగా 146 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగినట్లు త్రీగార్జెస్ కార్పొరేషన్ వెల్లడించింది. అంటే.. రోజుకు 2.35 లక్షల టన్నులకు పైగా సరుకు రవాణా జరిగింది.
2020-06-22పనికోసం విదేశాలనుంచి వచ్చేవారిని అడ్డుకోవడానికి.. హెచ్-1బి, ఎల్1 వీసాలపై సరికొత్త ఆంక్షలను ఆదివారం లేదా సోమవారం ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం (అమెరికా కాలమానం) చెప్పారు. ‘కరోనా’ వైరస్ అమెరికా ఉద్యోగ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేసిన నేపథ్యంలో స్థానికుల ఉద్యోగాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. కొత్త ఆంక్షల్లో మినహాయింపులు ఉంటాయా? అని ‘ఫాక్స్ న్యూస్’ జర్నలిస్టు అడిగినప్పుడు ‘చాలా తక్కువ’ అని సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
2020-06-21అమెరికా సంస్థ ‘టైసన్ ఫుడ్స్’ నుంచి కోడి మాంసం దిగుమతిని నిలిపివేస్తున్నట్లు చైనా కస్టమ్స్ అధారిటీ ఆదివారం ప్రకటించింది. మాంసం ఎగుమతి సంస్థ ‘టైసన్ ఫుడ్స్’ ఉద్యోగుల్లో కొందరు ‘కరోనా’ బారిన పడిన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశానికి చేరుకున్న, మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తుల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. 22.56 లక్షల ‘కరోనా’ కేసులు, సుమారు 1.20 లక్షల మరణాలతో అమెరికా అల్లాడుతోంది.
2020-06-21ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి ఆందోళనకరంగా మారింది. 2019-20లో రెవెన్యూ లోటు అసాధారణంగా రూ. 26,646 కోట్లకు పెరిగింది. రాష్ట్ర విభజన జరిగాక... చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన సంవత్సరం (2014-15) రెవెన్యూ లోటు రూ. 24,314 కోట్లు కాగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తొలి ఏడాది అంతకు మించిపోయింది. గత ఏడాది రెవెన్యూ రశీదులు రూ. 1,10,871 కోట్లకు తగ్గిపోగా వ్యయం రూ. 1,37,518 కోట్లకు పెరిగింది. 2020-21లో రెవెన్యూ రశీదులు రూ. 1,61,958 కోట్లుగా, వ్యయం రూ. 1,80,392 కోట్లుగా తాజా బడ్జెట్లో అంచనా వేశారు. లోటు రూ. 18,434 కోట్లు ఉంటుందని అంచనా. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
2020-06-16జగన్ ప్రభుత్వ తొలి బడ్జెట్ (2019-20) అంచనా ప్రకారం రెవెన్యూ రశీదుల మొత్తం రూ. 1,78,697 కోట్లు రావలసి ఉంది. సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 1,10,871 కోట్లు మాత్రమే! రూ. 68 వేల కోట్లు కోత ఎక్కడ పడింది? సొంత పన్నుల ఆదాయం రూ. 75,438 కోట్లు వస్తుందని బడ్జెట్ రోజు అంచనా వేయగా సవరించిన అంచనా ప్రకారం ఆ మొత్తం రూ. 57,447 కోట్లు. ఇక్కడ 18 వేల కోట్లు, పన్నేతర ఆదాయంలో మరో రూ. 4 వేల కోట్లు కోత పడింది. కేంద్రం నుంచి రూ. 61,071 కోట్ల మేరకు గ్రాంట్లు వస్తాయని గత బడ్జెట్లో చూపారు. వచ్చింది రూ. 21,876 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా రూ. 34,833 కోట్లు అనుకుంటే రూ. 28,224 కోట్లకు తగ్గింది.
2020-06-162020-21లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యయం రూ. 2,24,789 కోట్లు ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ఈమేరకు బడ్జెట్ ప్రతిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ మొత్తం గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదన (రూ. 2,27,975 కోట్ల) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. గత ఏడాది (2019-20) జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి బడ్జెట్లో అంచనాలు అసాధారణంగా కనిపించాయి. అయితే, సవరించిన అంచనాల్లో ఆ మొత్తాన్ని రూ. 1,74,757 కోట్లకు తగ్గించారు. అంటే, బడ్జెట్ అంచనా కంటే రూ. 53,218 కోట్లు (23.34%) తక్కువ. మరి ఈ ఏడాదైనా బడ్జెట్ అంచనాలకు తగినట్టుగా వ్యయం ఉంటుందా?
2020-06-162020-21 ఏపీ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత.. మధ్యాహ్నం ఒంటిగంటకు సభ పున:ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా సిఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ఆర్ పేరిట ఉన్న పథకాలకు సింహభాగం కేటాయించారు బుగ్గన. ‘జగనన్న అమ్మఒడి’కి రూ. 6000 కోట్లు, ఆయన తండ్రి పేరిట ఉన్న ‘వైఎస్ఆర్ ఆసరా’కు రూ. 6300 కోట్లు కేటాయించారు. గ్రామ వాలంటీర్లకు రూ. 1104 కోట్లు, పాత పథకాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ. 16,000 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి రూ. 2,100 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు 3615 కోట్లు కేటాయించారు.
2020-06-16గత నాలుగేళ్ళుగా రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ సింగిల్ డిజిట్ బాట పట్టింది. 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి) 8.16 శాతం పెరిగినట్టు తాజా సామాజిక ఆర్థిక సర్వే అంచనా వేసింది. గత ఆరేళ్ళలో ఇదే కనిష్ఠం. సర్వేను సిఎం జగన్ సోమవారం విడుదల చేశారు. స్థిర ధరల్లో ఏపీ జి.ఎస్.డి.పి. 2014-15లో 9.2 శాతం వృద్ధి చెందిగా.. 2015-16లో 12.16 శాతం, 2016-17లో 10.40 శాతం, 2017-18లో 11.32 శాతం, 2018-19లో 11.02 శాతం వృద్ధి నమోదైంది. స్థూల ఉత్పత్తి 2019-20లో స్థిర ధరల్లో 6,72,018 కోట్లుగానూ, ప్రస్తుత ధరల్లో 9,72,782 కోట్లుగానూ అంచనా.
2020-06-162020-21 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత ఏడాది కంటే తగ్గుతుందని ఇప్పటికే అనేక సంస్థలు అంచనా వేశాయి. ఇప్పుడు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) కూడా అదే మాట చెప్పింది. శుక్రవారం రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు తిరోగమన దశలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇండియాలో డిమాండ్ కుప్పకూలిందని, ‘కరోనా’ కారణంగా ప్రైవేటు వినిమయం, పెట్టుబడి డిమాండ్ పడిపోయాయని, ప్రభుత్వ రెవెన్యూ భారీగా తగ్గిందని దాస్ పేర్కొన్నారు. అయితే, ఇటీవల తీసుకున్న ద్రవ్య, ఆర్థిక, పరిపాలనా చర్యలతో పరిస్థితి మెరుగుపడుతుందని దాస్ ఆశాభావం వ్యక్తం చేశ�
2020-05-22