తయారీ రంగానికి సంబంధించిన చేదు వార్త ఇది. ఫిబ్రవరిలో వాహనాల రిటైల్ అమ్మకాలు 8.06 శాతం, హోల్ సేల్ అమ్మకాలు 3.05 శాతం తగ్గిపోయాయి. కార్లతోపాటు బైకుల అమ్మకాలు కూడా పడిపోయాయి. పాసెంజర్ కార్ల అమ్మకాలు 8.25 శాతం, వాణిజ్య వాహనాలు 7.08 శాతం తగ్గగా.. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7.97 శాతం తగ్గాయి. 2018 ఫిబ్రవరిలో మొత్తంగా 15,79,349 వాహనాలు అమ్ముడుపోగా 2019 ఫిబ్రవరిలో ఆ సంఖ్య 14,52,078కి తగ్గింది. 2019 జనవరితో (17,14,400 వాహనాలు) పోలిస్తే ఈ తగ్గుదల 15.30 శాతంగా ఉంది.
2019-03-13 Read Moreఈ ఏడాది జనవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు కేవలం 1.7 శాతమే..! 2018 జనవరి వృద్ధి రేటు (7.5 శాతం)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కేంద్ర గణాంక సంస్థ (సిఎస్ఒ) మంగళవారం తాజా ఐఐపి డేటాను విడుదల చేసింది. 2018 డిసెంబర్ ఐఐపిని ఇదివరకు అంచనా వేసిన 2.4 శాతం నుంచి 2.6 శాతానికి పెంచింది. తయారీ రంగంలో వృద్ధి 2018తో (8.7 శాతం) పోలిస్తే ఈ జనవరిలో బాగా తగ్గడం (కేవలం 1.3 శాతం) గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జనవరి కాలం మొత్తానికి తీసుకుంటే మాత్రం పారిశ్రామిక వృద్ధి గత ఏడాదికంటే కాస్త ఎక్కువగా 4.4 శాతం నమోదైంది.
2019-03-12 Read Moreపరారీలో ఉన్న భారత అతి పెద్ద ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ లండన్ నగరంలో దర్జాగా తిరుగుతూ మీడియాకు దొరికిపోయారు. వేషం మార్చిన మోదీని టెలిగ్రాఫ్ సీనియర్ పాత్రికేయుడు లండన్ వీధుల్లో పట్టుకున్నారు. వజ్రాల వ్యాపారి అయిన మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13 వేల కోట్లకు పైగా ముంచారు. భారత బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతి పెద్ద మోసం. గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేయడానికంటే ముందే కుటుంబంతో సహా ఇండియా వదిలి పారిపోయారు. భారత విచారణ సంస్థల విన్నపం మేరకు మోదీపై గత జూలైలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది.
2019-03-09 Read Moreసూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఇ)ల ద్వారా కొత్తగా వచ్చిన ఉద్యోగాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. గత నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఇలలో నికరంగా 16,034 ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్టు భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా కల్పించిన 3.32 లక్షల ఉద్యోగాల్లో ఏపీ వాటా 4.82 శాతంగా ఉంది. అదే సమయంలో తెలంగాణ వాటా 9.92 శాతం (32,982 ఉద్యోగాలు)గా ఉండటం విశేషం. అంతకు ముందు మూడేళ్ళతో పోలిస్తే 2015-16, 2018-19 మధ్య కాలంలో ఎంఎస్ఎంఇలలో కొత్త ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయాయి.
2019-03-09 Read Moreచిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా గత నాలుగేళ్లలో (2015-16 నుంచి 2018-19 వరకు) కేవలం 3,32,394 ఉద్యోగాలు వచ్చినట్టు సిఐఐ సర్వే తేల్చింది. అంతకు ముందు 2014-15 వరకు గడచిన మూడేళ్ల కాలంలో 11,54,293 ఉద్యోగాలు ఎంఎస్ఎంఇ రంగంలో వచ్చాయని సర్వే నివేదిక పేర్కొంది. గత నాలుగేళ్లలో కల్పించిన ఉద్యోగాల్లో మూడు రాష్ట్రాల (మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ) వాటా 50 శాతంగా ఉన్నట్టు సిఐఐ తెలిపింది. కొత్త ఉద్యోగాల్లో 73 శాతం సూక్ష్మ తరహా పరిశ్రమల్లో కల్పించినవేనని సర్వేలో తేలింది.
2019-03-09 Read Moreజపాన్ యెన్ మినహాయిస్తే.. ఆసియా కరెన్సీలలో ఈ ఏడాది ఎక్కువగా బలహీనపడింది రూపాయే. ఇప్పుడే ఏముంది.. ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు కొందరు నిపుణులు. సెప్టెంబర్ నాటికి రూపాయి మరింత పతనమవుతుందని, డాలర్ విలువ రూ. 80కి పెరుగుతుందని రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా తాజాగా అంచనా వేసింది. నిన్ననే విడుదలైన ప్రభుత్వ డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ కేవలం 6.6 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో రూపాయి విలువపై ఆర్.బి.సి. అంచనా ఆందోళన కలిగిస్తోంది.
2019-03-01ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికిగాను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఎఐఐబి) 45.5 కోట్ల డాలర్ల మేరకు రుణం ఇవ్వనుంది. ఈ రుణ ఒప్పందంపై గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ, ఎఐఐబి అధికారులు సంతకాలు చేశారు. ప్రస్తుత మారకం విలువ ప్రకారమైతే ఎఐఐబి రుణ మొత్తం రూ. 3222 కోట్లు ఉంటుంది. 13 జిల్లాల్లో సుమారు 3,300 నివాస ప్రాంతాలను కలుపుతూ రోడ్లను నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మొత్తం ప్రాజెక్టు విలువ 66.6 కోట్ల డాలర్లు కాగా అందులో ఎఐఐబి రుణం 45.5 కోట్ల డాలర్లు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 21.1 కోట్ల డాలర్లు.
2019-03-012018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్ - డిసెంబర్)లో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితమైంది. గురువారం కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థ తాజా డేటాను విడుదల చేసింది. గత రెండు త్రైమాసికాల్లో ఇంతకు ముందు నమోదైన వృద్ధి రేటును తాజాగా సవరించారు. అప్పటి అంచనాల ప్రకారం 2018-19 వార్షిక జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం కాగా, తాజాగా సవరించిన అంచనాల ప్రకారం 7 శాతానికి పరిమితం కానుంది. అంటే, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనూ వృద్ధి రేటు నిరాశాజనకంగానే ఉంటుందన్నమాట.
2019-03-01పన్ను వసూళ్లు లక్ష్యాలకు అనుగుణంగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సూచీలు తిరోగమనంలో ఉన్నాయి. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు లక్ష్యాలను దాటి అగాథపు అంచులకు చేరాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లోనే (జనవరి వరకు) ద్రవ్య లోటు లక్ష్యంలో 121.5 శాతానికి చేరుకుంది. రెవెన్యూ లోటు లక్ష్యానికి 143.4 శాతం నమోదు కాగా ప్రాథమిక లోటు లక్ష్యానికి ఏకంగా 656.7 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ద్రవ్య లోటు లక్ష్యానికి 113.7 శాతం, రెవెన్యూ లోటు 109.2 శాతం, ప్రాథమిక లోటు 409.8 శాతం నమోదయ్యాయి.
2019-02-28విశాఖపట్నంలో ప్రతిపాదించిన అదానీ డేటా సెంటరుకు కోరిన రాయితీలను ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మతించింది. సోమవారం అమరావతిలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రాయితీ ప్రతిపాదనలను ఆమోదించింది. స్టాంపు డ్యూటీ, విద్యుత్ సుంకాలలో రాయితీలతోపాటు డేటా సెంటరు పరికరాలపై జీఎస్టీ రీ ఇంబర్స్ మెంట్ కావాలని అదానీ సంస్థ కోరింది. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ శ్రేణి’ డేటా సెంటరు వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రిమండలి అభిప్రాయపడింది.
2019-02-25