2019లో ఇండియా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7.2 శాతం పెరుగుతుందని, 2020లో వృద్ధి 7.3 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) అంచనా వేసింది. ‘2017లో నమోదైన 7.2 నుంచి 2018లో 7.0 శాతానికి తగ్గింది. వ్యవసాయ ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడం.. ప్రభుత్వ వ్యయం తగ్గడం, చమురు ధరలు పెరుగడం వల్ల వినిమయం మందగించడం ఇందుకు కారణాలు’ అని విశ్లేషించింది. ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గింపు, రైతులకు ఆదాయ మద్ధతు వల్ల దేశీయంగా డిమాండ్ పెరుగుతోందని ఎడిబి తన తాజా ‘ఆసియా అభివృద్ధి అంచనా’లో పేర్కొంది.

2019-04-03 Read More

డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం 40 పైసలు పెరిగింది. తాజాగా డాలరు రూ. 68.74 వద్ద స్థిరపడింది. విదేశీ నిధుల రాక, దేశీయ ఈక్విటీలలో భారీ కొనుగోళ్ళు రూపాయి బలపడటానికి కారణాలుగా చెబుతున్నారు. మరొక అభిప్రాయం ప్రకారం... రిజర్వు బ్యాంకు డాలర్ - రూపాయి స్వాప్ ను రెండోసారి ప్రకటించిన తర్వాత ఇండియా కరెన్సీ బలపడింది. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) మంగళవారం కేపిటల్ మార్కెట్లలో రూ. 543.36 కోట్లు పెట్టినట్టు సమాచారం.

2019-04-02 Read More

ప్రపంచంలోనే అత్యధికంగా లాభం పొందే కంపెనీ ఏదంటే కళ్ళు మూసుకొని టక్కున చెప్పే సమాధానం ‘యాపిల్’! అయితే, సోమవారం సౌదీ ఆరాంకో కంపెనీ వెల్లడించిన డేటా చూస్తే యాపిల్ లాభం ఏమూలకు.. అనిపించింది. సౌదీ రాజుల కంపెనీ 2018లో 111.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7,77,770 కోట్లు) లాభాన్ని సంపాదించింది. అదీ సౌదీ ప్రభుత్వానికి 102 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించిన తర్వాత..!! యాపిల్, శాంసంగ్, ఆల్ఫాబెట్ కంపెనీల మూడింటి మొత్తం లాభం ‘సౌదీ ఆరాంకో’ లాభానికి దాదాపు సమానంగా ఉంది.

2019-04-02 Read More

2018-19 ఆర్థిక సంవత్సరం ఆఖరి నెల మార్చిలో రూ. 1,06,577 కోట్ల మేరకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మొత్తం వసూలైంది. 2017 జూలైలో జీఎస్టీ అమలు ప్రారంభమయ్యాక ఒక నెలలో ఇంత వసూలు కావడం ఇదే తొలిసారి. 2018 మార్చితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 15.6 శాతం గ్రోత్ నమోదైంది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ. 11.77 లక్షల కోట్ల పన్ను ఆదాయం జీఎస్టీ ద్వారా వచ్చింది. మార్చి వసూళ్ళలో కేంద్ర జీఎస్టీ రూ. 20,353 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ రూ. 27,520 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 50,418 కోట్లు, సెస్ రూపంలో రూ. 8,286 కోట్లు వసూలయ్యాయి.

2019-04-01 Read More

‘‘ఒక వ్యక్తి రూ. 9000 కోట్ల మోసానికి పాల్పడి దేశాన్ని వదిలిపోతే రూ. 14,000 కోట్ల విలువైన అతని ఆస్తులు జప్తు చేశాం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం ‘టివి9 భారత్ వర్ష్’ను ప్రారంభించిన మోదీ, ఆ సందర్భంగా ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా పేరు ప్రస్తావించకుండానే ఆయన విషయం మాట్లాడారు. మోసాలకు పాల్పడినవారికి ఇండియాలో ఉన్న ఆస్తులను జప్తు చేయడంతోపాటు.. విదేశాల్లోని ఆస్తులను కూడా వేలం వేసేలా తాము ఒక చట్టం తెచ్చిన కారణంగానే ఇదంతా జరిగిందని మోదీ చెప్పారు.

2019-03-31

2014 ఎన్నికల సమయానికి వార్షికాదాయంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. అప్పట్లో జయదేవ్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ. 16.31 కోట్లు. ఆ ఎన్నికల్లో ఎంపీలైనవారిలో 479 మంది అఫిడవిట్లను ఎడిఆర్ సంస్థ మదించింది. ఎడిఆర్ నివేదిక ప్రకారం ఆదాయంలో చివరి స్థానంలో ఉన్నది కూడా ఆంధ్రుడే. విజయవాడ ఎంపీ కేశినేని నాని నికరంగా రూ. 2.07 కోట్ల మైనస్ లో ఉన్నారు. 2019 ఎన్నికలకోసం సమర్పించే అఫిడవిట్లను ఆ తర్వాత మదించాల్సి ఉంది.

2019-04-01

వార్షిక వ్యక్తిగత ఆదాయం విషయంలో ఆంధ్రా ఎంపీలకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) సంస్థ 479 మంది ఎంపీలు ప్రకటించిన ఆస్తుల వివరాలను మదించి తేల్చిన విషయమిది. ఆంధ్రలోని 19 మంది ఎంపీల వార్షికాదాయం రూ. 1.06 కోట్లుగా ఉంటే రెండో స్థానంలో ఉన్న ఒడిషా ఎంపీల (15 మంది) సగటు ఆదాయం రూ. 68.8 లక్షలుగా ఉంది. దేశం మొత్తం మీద 479 మంది లోక్ సభ సభ్యుల వార్షికాదాయం సగటున రూ. 30.29 కోట్లుగా తేలింది.

2019-03-31 Read More

ఇండియాలో అతిపెద్ద ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ లండన్ నగరంలో అరెస్టయ్యారు. లండన్ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసిన రెండు రోజుల తర్వాత బుధవారం అక్కడి పోలీసులు మోదీని అదుపులోకి తీసుకున్నారు. బుధవారమే ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,000 కోట్లకు పైగా ముంచిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. ఈ కేసులో మోదీని ఇండియాకు అప్పగించాలని కోరుతూ సీబీఐ ఓ విన్నపాన్ని భారత విదేశాంగ శాఖ ద్వారా యుకె ప్రభుత్వానికి పంపింది. నీరవ్ మోదీ లండన్ నగరంలో విలాసవంతంగా బతుకుతున్నట్టు టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించాక చర్యలు తీసుకోక తప్పలేదు.

2019-03-20 Read More

2018-19 ఆర్థిక సంవత్సరంలో గడచిన 11 నెలల్లో ఇండియా వాణిజ్య లోటు 165.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వాణిజ్య లోటు పెరుగుదల 11 శాతంగా ఉంది. 2012-13లో వాణిజ్య లోటు పతాక స్థాయికి చేరి 190 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆ తర్వాత గత ఆరేళ్లలో ఇదే అత్యధిక లోటు. ముడి చమురు దిగుమతి పెరగడం ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. భారత విదేశీ వాణిజ్యంలో ముఖ్యమైన దేశంగా ఉన్న అమెరికా ఇటీవల విధించిన సుంకాలు కూడా రానున్న కాలంలో ప్రభావితం చేస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

2019-03-19 Read More

అమెరికా రక్షణ కేటాయింపులను 5 శాతం పెంచడానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. దీంతో 2020 ఆర్థిక సంవత్సరంలో (2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు) రక్షణ బడ్జెట్ 750 బిలియన్ డాలర్లకు చేరనుంది. దౌత్యానికి 23 శాతం తగ్గించి వివాదాస్పద సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు కేటాయించే ప్రతిపాదనలపై కాంగ్రెస్ లో వ్యతిరేకత రావచ్చు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనలు యధాతథంగా ఆమోదం పొందితే... పెంటగాన్ కు 718 బిలియన్ డాలర్లు, అణ్వాయుధ ఇంథనంకోసం 32 బిలియన్ డాలర్లు వెచ్చిస్తారు.

2019-03-14 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page