200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 25 శాతం పన్ను వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల క్రితం చేసిన ట్వీట్ ప్రపంచ మార్కెట్లను భూమార్గం పట్టించింది. 102 పదాల ఈ ఒక్క ట్వీట్ ప్రపంచ స్టాక్ మార్కెట్ల విలువను 1.36 ట్రిలియన్ డాలర్ల మేరకు తగ్గించింది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 95,20,000 కోట్లు. అంటే ట్రంప్ ట్వీట్ లోని ఒక్కో పదానికి రూ. 91 వేల కోట్లు ఆవిరయ్యాయన్నమాట. ఈ నేపథ్యంలో గురువారం, శుక్రవారం రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలు సఫలమవుతాయా? లేక శుక్రవారంనుంచి కొత్త పన్నులు అమలవుతాయా? వేచి చూడాలి.
2019-05-08 Read Moreఎన్నికల్ కోడ్ పేరిట అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్షను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ ప్రారంభించారు. సోమవారం ఆయన నేరుగా ప్రాజెక్టు స్థలం వద్దకు వెళ్లి పనులను పర్యవేక్షించబోతున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న అసెంబ్లీకి, లోక్ సభ సీట్లకు పోలింగ్ పూర్తయినా మే 23వ తేదీవరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో...పోలింగ్ ముగిశాక పోలవరంపై చంద్రబాబు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం వివాదాస్పదమైంది. దాంతో గత రెండు వారాల్లో సమీక్ష చేయలేదు.
2019-05-06వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద ఏప్రిల్ మాసంలో రూ. 1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇప్పటివరకు అత్యధిక మొత్తం ఇదేనని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2018 ఏప్రిల్ తో పోలిస్తే ఇది 10 శాతం అధికం. 2019 తొలి నాలుగు మాసాల్లో లక్ష కోట్లు దాటి వసూలు కావడం ఇది మూడోసారి. డిసెంబరులో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ జరిగినా... పన్ను చెల్లించేవారి సంఖ్య పెరగడంవల్ల వసూలు అధికంగా ఉందంటున్నారు. ఏప్రిల్ వసూళ్లలో ఐజీఎస్టీ పంపిణీ తర్వాత నికరంగా కేంద్రానికి రూ. 47,533 కోట్లు, రాష్ట్రాలకు రూ. 50,776 కోట్లు రానున్నాయి.
2019-05-01 Read Moreప్రపంచ దేశాలు సైన్యాలపై ఖర్చు చేస్తున్న వ్యయం ఎంతో తెలుసా? అక్షరాలా కోటీ ఇరవై ఏడు లక్షల యాబై నాలుగు వేల కోట్ల రూపాయలు (1.822 ట్రిలియన్ డాలర్లు). అందులో అమెరికా ఒక్క దేశపు వాటా 36 శాతం. ‘సిప్రి’ తాజా సమాచారం ప్రకారం.. 2018లో అమెరికా మిలిటరీ వ్యయం 649 బిలియన్ డాలర్లు (రూ. .45,43,000 కోట్లు). 250 బిలియన్ డాలర్ల వ్యయంతో చైనా రెండో స్థానంలో ఉండగా 67.6 బిలియన్ డాలర్లతో సౌదీ అరేబియా ఇండియాను మించిపోయింది. 66.5 బిలియన్ డాలర్లు మిలిటరీపై ఖర్చు చేసిన ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.
2019-04-29 Read Moreబోట్సువానాలోని కరోవె గనిలో టెన్నిస్ బాల్ పరిమాణంలో ఉన్న వజ్రం ఒకటి దొరికింది. లుకారా డైమండ్ కార్పొరేషన్ వెలికి తీసిన ఈ వజ్రం (1,758 కేరట్లు) ప్రపంచంలో ఇప్పటివరకు లభ్యమైన అతి పెద్దవాటిలో రెండవది. అతి పెద్ద వజ్రం (3,106 కేరట్లు) 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. నాలుగేళ్ళ క్రితం లుకారా కంపెనీ కరోవె గనిలో కనుగొన్న 1,1099 కేరట్ల వజ్రమే ఇప్పటిదాకా రెండో అతి పెద్దది. తాజాగా అదే గనిలో దానికంటే పెద్ద వజ్రం దొరికడం విశేషం. అయితే, ఈ వజ్రం మునుపటివాటికంటే తక్కువ నాణ్యతగలదని, ధర కూడా తక్కువే ఉంటుందని కంపెనీ తెలిపింది.
2019-04-25 Read Moreసాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తొలిసారిగా ట్రిలియన్ డాలర్ల (రూ. 70,25,000 కోట్లు) విలువను నమోదు చేసుకుంది. 2018-19 చివరి త్రైమాసికంలో కంపెనీ లాభాలు 19 శాతం పెరిగాయని నిన్న ప్రకటించిన నేపథ్యంలో, గురువారం షేర్ విలువ 5 శాతం పెరిగి 130.59 డాలర్లకు చేరింది. దీంతో ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిన మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. ట్రిలియన్ డాలర్ విలువను నమోదు చేసిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ మూడవది. యాపిల్, అమేజాన్ గతంలో అంత విలువకు పెరిగి తర్వాత కొద్దిగా తగ్గాయి.
2019-04-25 Read More2014 నుంచి వివిధ రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారంకోసం బీజేపీ, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమానాలు, హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. వాటి నిమిత్తం రెండు పార్టీలూ రూ. 496 కోట్లు చెల్లించాయి. అందులో బీజేపీ వాటా రూ. 327 కోట్లు. 2018లో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకోసం బీజేపీ రూ. 70 కోట్లు విమానాలపై వెచ్చించింది. ఒక్క మధ్య ప్రదేశ్ ప్రచారంకోసమే రూ. 40 కోట్లు చెల్లించింది. 2017లో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 73 కోట్లతో బీజేపీ విమానాలను, హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఎంత ఖర్చు చేశారన్నది ప్రక్రియ మొత్తం ముగిశాక సమర్పించే లెక్కల ద్వారా తెలుస్తుంది.
2019-04-22 Read Moreఇండియాతో రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిన ఆరు నెలల తర్వాత అనిల్ అంబానీకి ఫ్రాన్స్ ప్రభుత్వం 143.7 మిలియన్ యూరోల (సుమారు రూ. 1,125 కోట్ల) పన్ను రాయితీ ఇచ్చినట్టు వెల్లడైంది. ఫ్రాన్స్ పత్రిక ‘లీ మాండే’ వెలువరించిన తాజా కథనం సంచలనం సృష్టిస్తోంది. అనిల్ అంబానీకి చెందిన ఫ్రెంచ్ టెలికం కంపెనీ ‘రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్’ 151 మిలియన్ యూరోల (రూ. 1,182 కోట్ల) మేరకు పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా..కేవలం 7.6 మిలియన్ యూరోల (రూ. 59.50 కోట్ల)కు తగ్గించారు.
2019-04-13 Read Moreభారతీయ రిజర్వు బ్యాంకు మరోసారి వడ్డీ రేటు తగ్గించింది. రెపో రేటును 25 పాయింట్లు తగ్గించడంతో కీలక వడ్డీ రేటు 6 శాతం అయింది. రిజర్వు బ్యాంకు మానెటరీ పాలసీ కమిటీ (ఎంపిసి)లోని ఆరుగురు సభ్యులలో నలుగురు వడ్డీ రేటు తగ్గింపునకు అనుకూలంగా స్పందించారు. వడ్డీ రేటు తగ్గించడం వరుసగా ఇది రెండోసారి. దీంతో నెలవారీ రుణ వాయిదాల్లో కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.2 శాతం పెరుగుతుందని బ్యాంకు అంచనా వేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్భణం అంచనాను 2.4 శాతానికి తగ్గించింది.
2019-04-04 Read More’‘అన్నదాతా సుఖీభవ పథకం కింద తొలి విడతలో మిగిలిన రూ. 3000ను రైతుల ఖాతాల్లోకి ఈరోజు బదిలీ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1349.81 కోట్లు జమ చేశాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ట్విట్టర్ లో వెల్లడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, రైతులపట్ల టీడీపీ ప్రభుత్వానికి ఉన్న బాధ్యతకు ఇదే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.
2019-04-03