కరోనా ప్రభావంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి తిరోగమించింది. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ కాలానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్రితం త్రైమాసికంతో పోలిస్తే 7.8 శాతం తగ్గినట్లు జపాన్ కేబినెట్ ఆఫీసు ప్రకటించింది. వార్షిక రేటుకు అన్వయిస్తే ఈ పతనం 27.8 శాతంగా ఉంది. ఆధునిక జపాన్ ఆర్థిక వ్యవస్థలో పోల్చదగిన డేటా అందుబాటులోకి వచ్చాక (1980 తర్వాత) ఇదే అత్యధిక పతనం. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి కంటే కరోనా దెబ్బకే జపాన్ ఎక్కువగా కుంచించుకుపోయింది. దేశీయ డిమాండ్ 4.8 శాతం పడిపోగా ఎగుమతులు 18.5 శాతం తగ్గాయి. దిగుమతుల తగ్గుదల మాత్రం 0.5 శాతానికి పరిమితమైంది. మార్చితో ముగిసిన ఏడాదికి జపాన్ జీడీపీ పెరుగుదల ‘జీరో’ (0.00) శ

2020-08-17

‘కరోనా’ ప్రభావంతో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు జూలైలోనూ తగ్గాయి. జూలైలో రూ. 87,422 కోట్లు వసూలయ్యాయి. ఇవి గత ఏడాది జూలై కంటే 14.6 శాతం తక్కువ. ఈ ఏడాది జూన్ మాసంలో వసూలైన రూ. 90,917 కోట్ల కంటే తగ్గడం గమనార్హం. వరుసగా ఐదో నెల లక్ష కోట్ల కంటే తక్కువ పన్ను వసూళ్ళు నమోదయ్యాయి. ‘లాక్ డౌన్’ కారణంగా ఏప్రిల్ మాసంలో కేవలం రూ. 32,172 కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ. 62,151 కోట్లు వచ్చాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే, జూలై మాసాల్లో లక్ష కోట్లకు పైగా వసూలయ్యాయి.

2020-08-01

‘కరోనా’ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపింది. జూన్ నెలలో 8 ప్రధాన పారిశ్రామిక రంగాల్లో వృద్ధి రేటు 15 శాతం క్షీణించింది. 2019 జూన్ మాసంలో కేవలం 1.2 శాతం వృద్ధి చెందిన ఈ రంగాలు.. ఈసారి కరోనా కారణంగా కుదేలయ్యాయి. ఉక్కు పరిశ్రమ ఏకంగా 33.8 శాతం క్షీణించింది. బొగ్గు ఉత్పత్తి 15.5 శాతం, సహజవాయు ఉత్పత్తి 12 శాతం, విద్యుదుత్పత్తి 11 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 8.9 శాతం, సిమెంట్ 6.9 శాతం, క్రూడాయిల్ 6 శాతం తగ్గాయి. దీంతో మొత్తంగా 2020 రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 24.6 శాతం క్షీణత నమోదైంది. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో ఈ 8 రంగాల వాటా 40.27 శాతం.

2020-08-01

అగ్రరాజ్యం అమెరికాను ‘కరోనా’ వణికిస్తోంది. ఆ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. 2020 రెండో త్రైమాసికంలో అమెరికా స్థూల దేశీయోత్పత్తి ఏకంగా 32.9 శాతం దిగజారింది. ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక ఆర్థిక పతనం. 1958లో అమెరికా ఆర్థిక వ్యవస్థలో నమోదైన 10 శాతం నెగెటివ్ గ్రోత్ కు మూడు రెట్లు పతనం కావడం ‘కరోనా’ తీవ్రతకు దర్పణం పడుతోంది. 2008 నాలుగో త్రైమాసికం (ఆర్థిక మాంద్యం)లో నమోదైన మైనస్ 8.4 కంటే ఇప్పుడు దాదాపు నాలుగు రెట్లు దిగజారడం గమనార్హం. 2020 మొదటి త్రైమాసికంలో కూడా అమెరికా జీడీపీ 5 శాతం తగ్గింది.

2020-07-30

ఇండియా ఆర్థిక వ్యవస్థలో మరో ప్రమాద ఘంటిక మోగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి అప్పులు రూ. 170 లక్షల కోట్లకు పెరగబోతున్నాయని ఎస్.బి.ఐ. రీసెర్చ్ అంచనా వేసింది. గత ఏడాది ఈ మొత్తం రూ. 146.9 లక్షల కోట్లు. ఏడాదిలో రూ. 23 లక్షల కోట్లకు పైగా అదనపు అప్పులు కావడం, జీడీపీలో అప్పులు అమాంతం 72.2% నుంచి 87.6%కి పెరగనుండటం ఆందోళనకర పరిణామం. దీంతో రుణ పరపతి రేటింగ్ తగ్గవచ్చని ఎస్.బి.ఐ. రీసెర్చ్ సోమవారం ఓ రిపోర్టులో పేర్కొంది. 2011-12లో ఇండియా అప్పులు- జీడీపీ నిష్ఫత్తి 67.4 శాతం ఉండగా, 8 సంవత్సరాలలో (2019-20కి) 4.8 పర్సంటేజ్ పాయింట్లు పెరిగింది. కానీ, ఈ ఒక్క సంవత్సరం ఏకంగా 15.4 పర్సంటేజ్ పాయింట్లు పెరగనుంది.

2020-07-21

‘కరోనా’ కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గోళ్ళూడగొట్టి పన్నులు వసూలు చేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 10 రూపాయలకు పైగా పెంచిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ తాజాగా పన్నులు పెంచింది. ఇప్పటిదాకా లీటరు పెట్రోలుపై ‘31%+ రూ. 2.76’గా ఉన్న పన్ను తాజాగా ‘31%+ రూ. 4’కి పెరిగింది. లీటరు డీజిల్ పైన ‘22.25%+ రూ. 3.07’గా ఉన్న పన్ను ఇప్పుడు ‘22.25%+ రూ. 4’కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను రేట్లను సవరించడం గత మూడు నెలల్లో ఇది మూడోసారి.

2020-07-20

‘కరోనా’ దెబ్బకు 2020 మొదటి త్రైమాసికంలో కుదేలైన చైనా ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో కొద్దిగా కోలుకుంది. చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జనవరి-మార్చి కాలంలో తిరోగమించగా (మైనస్ 6.8 శాతం).. ఏప్రిల్- జూన్ కాలానికి 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా తొలి అర్ధ సంవత్సరంలో జీడీపీ వృద్ధి మైనస్ 1.6గా నమోదైంది. ‘కరోనా’ వైరస్ బారిన పడిన తొలి దేశం చైనా. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆ దేశంలో కేసులు విపరీతంగా పెరిగాయి. మార్చినాటికి వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన చైనా ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా పునరుద్ధరించింది.

2020-07-16

‘కరోనా’ కాలంలో సాధారణ ప్రజలు ఆదాయాలు కోల్పోయి అల్లాడుతుంటే.. ముంబై మహా సంపన్నుడు ముఖేష్ అంబానీ మాత్రం ప్రపంచ కుబేరుల్లో రోజుకొక్కరిని వెనుకకు నెట్టి పైపైకి ఎగబాకుతున్నారు. అపర కుబేరుల్లో ఆయన తాజా ర్యాంకు 6. ముఖేష్ తన సంపదకు తాజాగా రూ. 16,300 కోట్లను జోడించి 72.4 బిలియన్ డాలర్ల (రూ. 5,43,000 కోట్ల)కు పెంచుకున్నారు. అదే సమయంలో గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ 1.12 బిలియన్ డాలర్లు కోల్పోయి 71.6 బిలియన్ డాలర్లతో 7వ స్థానానికి జారిపోయారు. లారీ పేజ్ కంటే ముందు ఎలోన్ ముస్క్, వారెన్ బఫెట్ లను ముఖేష్ అధిగమించారు.

2020-07-14

2020-21 ఆర్థిక సంవత్సరం తొలి రెండు మాసాల్లో ‘లాక్ డౌన్’ దెబ్బ ఆర్థిక వ్యవస్థపై చాలా బలంగా పడింది. ఫలితంగా ఏప్రిల్, మే లలో కేంద్రానికి కేవలం రూ. 45,498 కోట్లు ఆదాయం రాగా వ్యయం రూ. 5,11,841 కోట్లుగా లెక్క తేలింది. అంటే.. ఖర్చు చేసిన మొత్తంలో పదో వంతు కూడా రాబడి లేదు. కేవలం 8.89 శాతం ఆదాయం, 91.11 శాతం (రూ. 4,66,343 కోట్ల) అప్పులతో రెండు నెలలు భారంగా గడిచాయి. రెండు నెలలకే రూ. 4,11,968 కోట్ల రెవెన్యూ లోటు తేలింది. రూ. 4,66,343 కోట్ల ద్రవ్య లోటును పూడ్చుకోడానికి అధికంగా అప్పులు చేయడం తప్ప మరో గత్యంతరం లేకపోయింది.

2020-06-30

విజయవాడ, హైదరాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలంగాణ మంత్రి కె. తారకరామారావు చెప్పారు. సోమవారం హుజూర్ నగర్ పర్యటనలో భాగంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా విజయవాడ ఉందని, హైదరాబాద్ దేశంలోనే ముఖ్యమైన మెట్రో నగరాల్లో ఒకటి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారికి సమాంతరంగా హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణమైతే మధ్య ప్రాంతాలన్నీ మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

2020-06-29
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page