ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అప్పులు ఈ ఏడాది బాగా పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్.పి.సి.ఎల్)ల అప్పులు 2019 మార్చినాటికి రూ. 1.62 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాదికంటే ఈ మొత్తం 30 శాతం అదనం. కేపిటల్ వ్యయం పెరగడం, ప్రభుత్వం నుంచి రావలసిన రూ. 33,900 కోట్ల సబ్సిడీ మొత్తం ఆలస్యం కావడం కంపెనీలపై అప్పుల భారం పెరగడానికి కారణాలు.
2019-05-29 Read Moreవాణిజ్య యుద్ధానికి తెర తీసిన అమెరికాకు చైనా ‘అరుదైన’ హెచ్చరిక చేసింది. సెల్ ఫోన్లనుంచి అణు విద్యుత్ కేంద్రాలవరకు అవసరమైన అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో సింహభాగం (70 శాతం) చైనాలోనే జరుగుతోంది. అమెరికా 2014 నుంచి 2017 వరకు దిగుమతి చేసుకున్న అరుదైన ఖనిజాల్లో 80 శాతం చైనానుంచే వెళ్ళాయి. అవసరమైతే చైనా ఈ ఎగుమతులను నియంత్రిస్తుందని ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక ‘పీపుల్స్ డైలీ‘ బుధవారం ఓ సంపాదకీయంలో పేర్కొంది.
2019-05-29 Read Moreపోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇకపైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) ఛైర్మన్ ఆర్.కె. జైన్ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో పీపీఎ సమావేశం జరిగింది. త్వరలో డిపిఆర్-2కు ఆమోదం లభిస్తుందని, వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీతో నీళ్ళు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాల్సింది రూ. 2 వేల కోట్లేనని, ప్రభుత్వం చెప్పినట్టు రూ. 4,800 కోట్ల పెండింగ్ నిధులతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
2019-05-28 Read More‘హువావీ’పై అమెరికా నిషేధం చైనాలో ‘యాపిల్’ కష్టాలను పెంచుతోంది. ఇప్పటికే తగ్గుతున్న యాపిల్ ఫోన్ల మార్కెట్ మరింత పతనం అవుతుందనే ఆందోళన ఆ కంపెనీ వర్గాలలో వ్యక్తమవుతోంది. గత ఏడాది చైనా ఫోన్ మార్కెట్లో యాపిల్ వాటా 9.1 శాతం కాగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అది 7 శాతానికి పడిపోయింది. హువావీ కంపెనీ తక్కువ రేట్లకే మెరుగైన నాణ్యతతో ఫోన్లను అందించడం అందుకు కారణం అంటున్నారు. అమెరికా తాజా చర్యతో దేశభక్తి భావన తోడై చాలామంది ‘యాపిల్’కు బదులు ‘హువావీ’ ఫోన్లు కొంటున్నారట!
2019-05-22 Read Moreతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఐదేళ్ళలో లక్ష కోట్ల రూపాయల అప్పు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ఏర్పాటునాటికి ఉన్న రూ. 82 వేల కోట్లతో కలిపి ఇప్పటిదాకా మొత్తం అప్పు రూ. 1.82 లక్షల కోట్లు ఉన్నట్టు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆర్థిక వృద్ధిరేటు, సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని రామకృష్ణారావు తెలిపారు.
2019-05-21 Read Moreప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) ట్రస్టీల బోర్డులో సింగపూర్ సీనియర్ మంత్రి తర్మాన్ షణ్ముగరత్నం నియమితులయ్యారు. 2011 నుంచి ఎనిమిది సంవత్సరాలు సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రిగా పని చేసిన షణ్ముగరత్నం ఈ నెల 1న సీనియర్ మంత్రిగా నియమితులయ్యారు. సామాజిక విధానాల సమన్వయం, ప్రధానమంత్రికి ఆర్థికాంశాల్లో సలహాలు షణ్ముగరత్నం బాధ్యతలు. సింగపూర్ మానెటరీ అథారిటీ, సెంట్రల్ బ్యాంకులకు ఛైర్మన్ గా, సింగపూర్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
2019-05-21 Read Moreప్రభుత్వం మారినా కీలక విధానాలు రివర్స్ కావని, అలాగే అమరావతి నగర నిర్మాణమూ ముందుకు సాగుతుందని సెఫాలజిస్టు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఇంద్రప్రస్థ నగరాన్ని (ఢిల్లీని) మించిన రాజధాని నిర్మాణానికి ఇక్కడ మంచి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఐదేళ్ళలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యమని, రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలపై ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉంటే మంచిదని పేర్కొన్నారు. గత ఐదేళ్ళలో రాయలసీమలో పరిశ్రమలు వచ్చాయని, ఈసారి అమరావతి ప్రాంతంలోనూ వస్తాయని ఆకాంక్షించారు.
2019-05-18అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇండియాలాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ‘‘ఇండియా రేటింగ్స్ (ఇండ్-ర)’’ సంస్థ అంచనా వేసింది. అమెరికా ఆంక్షలతో ఆ దేశానికి వెళ్ళవలసిన ఎగుమతులను ఇండియాకు, ఇతర వర్ధమాన దేశాలకు చైనా మళ్లించవచ్చని శుక్రవారం పేర్కొంది. చైనా డంప్ చేసే చౌక వస్తువులు భారత మార్కెట్లలో డిమాండ్-సరఫరాను ప్రభావితం చేస్తాయని హెచ్చరించింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుము, ఉక్కు, ఆర్గానిక్ కెమికల్స్ పెద్ద ఎత్తున వస్తాయని అంచనా.
2019-05-18 Read Moreచైనా సంస్థలపై ఇతర దేశాలు ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆ దేశ వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ గురువారం స్పష్టం చేశారు. చైనా టెలికం దిగ్గజం ‘హవావీ’ని అమెరికా బ్లాక్ లిస్టులో చేర్చిన నేపథ్యంలో చైనా స్పందించింది. చైనాతో వాణిజ్యాన్ని మరింతగా ప్రభావితం చేసే చర్యలను అమెరికా నివారించాలని ఫెంగ్ సూచించారు.
2019-05-16 Read Moreచైనా టెలికం దిగ్గజం హువావీ టెక్నాలజీస్, దానికి అనుబంధంగా ఉన్న 70 సంస్థలను అమెరికా బ్లాక్ లిస్టులో చేర్చిది. దీంతో... ఇక ముందు హవావీ అమెరికా ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ దేశ కంపెనీలనుంచి పరికరాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాలంటే హువావీ అమెరికా ప్రభుత్వం వద్ద లైసెన్సు పొందవలసి ఉంటుంది. హవావీ ప్రపంచంలోనే అతి పెద్ద టెలికం పరికరాల తాయారీదారు. ఆ తయారీకి అవసరమైన కొంత సామాగ్రిని అమెరికా కంపెనీల వద్ద కొనుగోలు చేస్తుంటుంది.
2019-05-16 Read More