సాఫ్ట్ వేర్ దిగ్గజం ‘విప్రో’ వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ జూలై 30వ తేదీన రిటైర్ కానున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ప్రేమ్ జీ ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుల్లో ఉన్నారు. అయితే, ఆయన కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మరో ఐదేళ్ళు కొనసాగనున్నారు. ఆయన తనయుడు రిషద్ ఎ ప్రేమ్ జీ ఇక విప్రోకు సారథ్యం వహిస్తారు. రిషద్ జూలై 31 నుంచి ఐదేళ్ళపాటు హోల్ టైమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.

2019-06-06 Read More

జీడీపీ వృద్ధి రేటు అంచనాను రిజర్వు బ్యాంకు 7.2 నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉంటుందని ఏప్రిల్ ద్రవ్యపరపతి విధాన పత్రంలో పేర్కొన్నారు. గురువారం వెల్లడించిన విధాన పత్రంలో ఈ అంచనా మారింది. 2018-19 చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 5.8 శాతంగా నమోదు కావడం.. పెట్టుబడులు, ఎగుమతుల తగ్గుదలను ప్రతిఫలించిందని రిజర్వు బ్యాంకు పేర్కొంది. ఇటీవలి నెలల్లో..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినిమయం తగ్గిందని తెలిపింది.

2019-06-06

వడ్డీ రేట్లను తగ్గిస్తూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకున్నా స్టాక్ మార్కెట్ పతనమైంది. ఎస్&పి బిఎస్ఇ సెన్సెక్స్ గురువారం ఏకంగా 554 పాయింట్లు తగ్గి 39,530 వద్ద ముగిసింది. ఒక్క రోజులో ఇంత మొత్తంలో తగ్గడం 2019లో తొలిసారి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఇండస్ ల్యాండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఎస్ బ్యాంకు, లార్సెన్ అండ్ టుబ్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టపోయిన సంస్థల్లో ఉన్నాయి. సెన్సెక్స్ ఈ ఒక్క రోజులో 1.38 శాతం తగ్గితే నిఫ్టీ 1.48 శాతం దిగజారింది.

2019-06-06

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) మానెటరీ పాలసీ కమిటీ (ఎం.పి.సి)లో వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా నిర్ణయించింది. గురువారం జరిగిన ఎంపిసి సమావేశంలో రెపో రేటును 5.75 శాతంగా (6 శాతం నుంచి తగ్గించి) నిర్ణయించింది. జీడీపీ వృద్ధి రేటు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటు ఈ స్థాయికి తగ్గడం గత తొమ్మిది సంవత్సరాల్లో తొలిసారి. దేశీయంగా మందగమనంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు తగ్గడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలను రిజర్వు బ్యాంకు విశ్లేషించింది.

2019-06-06 Read More

వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు మే నెలలోనూ లక్ష కోట్లు దాటాయి (రూ. 1,00,289 కోట్లు). అందులో కేంద్ర జి.ఎస్.టి. వాటా రూ. 17,811 కోట్లు కాగా, రాష్ట్ర జి.ఎస్.టి. రూ. 24,462 కోట్లు. దిగుమతి సుంకాలు రూ. 24,875 కోట్లు కలిపి ఇంటిగ్రేటెడ్ జి.ఎస్.టి. కింద మరో రూ. 49,891 కోట్లు వసూలయ్యాయి. సెస్ రూపంలో రూ. 8,125 కోట్లు (దిగుమతులపై రూ. 953 కోట్లు) వచ్చాయి. సెటిల్ మెంట్ల అనంతరం కేంద్రానికి రూ. 35,909 కోట్లు, రాష్ట్రాలకు రూ. 38,900 కోట్లు వస్తున్నాయి.

2019-06-01 Read More

ప్రాధాన్య వాణిజ్య కార్యక్రమం కింద ‘లబ్దిదారు దేశం’గా భారత దేశానికి ఇచ్చిన గుర్తింపును అమెరికా రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా చర్య అవాంఛనీయమని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిపిఎస్) లబ్దిదారులుగా గుర్తింపు ఇచ్చిన దేశాలనుంచి పన్ను లేకుండా వేలాది ఉత్పత్తుల దిగుమతులను అమెరికా అనుమతిస్తోంది. ఇండియానుంచి సుమారు 2000 ఉత్పత్తులు అమెరికాకు వెళ్తున్నాయి. ఇకపై ఆ అవకాశం ఉండదు.

2019-06-01 Read More

ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు దారి మళ్లిన వైనం తెలుసుకొని కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోయినట్టు అధికారవర్గాలు తెలిపాయి. జగన్ శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు అందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దడానికి సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన అధికారులను కోరారు.

2019-06-01

అమెరికా నుంచి దిగుమతి అయ్యే 60 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై పన్నులు పెంచుతూ చైనా తీసుకున్న నిర్ణయం శనివారం నుంచే అమలు కానుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఆహారం సహా మొత్తం 5,140 ఉత్పత్తులపై 25 శాతం వరకు పెంచిన పన్నులు అమల్లోకి రానున్నాయి. 200 బిలియన్ డాలర్లకు పైగా విలువైన చైనా ఉత్పత్తులపై పన్నును అమెరికా 10 శాతం నుంచి 25 శాతానికి పెంచిన నేపథ్యంలో రెండోవైపు నుంచి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి.

2019-05-31

ఇంతకు ముందు ప్రభుత్వం వెల్లడించడానికి, అంగీకరించడానికి నిరాకరించిన నిరుద్యోగ సమాచారం శుక్రవారం అధికారికంగానే వెల్లడైంది. దాని ప్రకారం 2017-18 నిరుద్యోగం రేటు 6.1 శాతంగా ఉంది. గత 45 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 7.8 శాతం యువత నిరుద్యోగులే. మోదీ 2.0 మొదటి మంత్రివర్గ సమావేశం జరిగిన రోజే కార్మిక శాఖ డేటా విడుదలైంది. నిరుద్యోగం రేటు గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం.. పురుషుల్లో 6.2 శాతం ఉండగా, మహిళల్లో 5.7 శాతం నిరుద్యోగులు.

2019-05-31 Read More

వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశమైన ఇండియా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటులో గత ఆర్థిక సంవత్సరం వెనుకబడింది. శుక్రవారం విడుదలైన సమాచారం ప్రకారం..గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇండియా జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.8 శాతం. ఇది చైనా (6.4శాతం) కంటే తక్కువ. చైనా జీడీపీ వృద్ధి రేటు మందగించిన తర్వాత ‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశం’’గా ఇండియాకు ఖ్యాతి దక్కింది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నేపథ్యంలో వృద్ధి రేటు ఒడిదుడుకులకు లోనైంది.

2019-05-31
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page