2025కి ఇండియా ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వార్షిక వృద్ధి రేటు 8 శాతం దాటాలని ఆర్థిక సర్వే 2019 పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్ పత్రాన్ని శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు గురువారం ఆర్థిక సర్వే 2019 పత్రాన్ని సభకు సమర్పించారు. అయితే.. ఆర్థిక మందగమనం, పన్ను వసూళ్ళు తగ్గడం వంటి సవాళ్లను సర్వే పత్రం ఎత్తిచూపింది.

2019-07-04

ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల సమస్యను ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) మరింత పెంచుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరం చివరికి బకాయిల మొత్తం రూ. 7,277 కోట్లు కాగా 2018-19 చివరికి రూ. 16,481 కోట్లకు పెరిగింది. ఎన్.పి.ఎ. జాబితాలో అకౌంట్ల సంఖ్య 2018 మార్చి 31 నాటికి 17.99 లక్షలు కాగా, 2019 మార్చి31కి 30.57 లక్షలకు పెరిగింది. అకౌంట్ల సంఖ్యలో పెరుగుదల 69.93 శాతం (12.58 లక్షల అకౌంట్లు)గా ఉంటే ఎన్.పి.ఎ.ల మొత్తం ఏకంగా 126.48 శాతం పెరిగింది.

2019-06-23 Read More

2019-20 ఆర్థిక సంవత్సరపు పూర్తి బడ్జెట్ సుమారు రూ. 2 లక్షల కోట్లతో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏర్పాటు చేసిన బడ్జెట్ ముందస్తు సమావేశం అనంతరం బుగ్గన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల రూ. 1.91 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

2019-06-21

‘‘కాళేశ్వరం’’ నిర్మాణం పూర్తయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాల్లో ఒకటిగా చెప్పవచ్చు. రూ. 80 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకోసం ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. 1531 కిలోమీటర్ల దూరం గ్రావిటీ కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వి 19 పంప్ హౌస్ లతో రోజుకు 3 టిఎంసిల చొప్పున ఎత్తిపోయాలన్నది ప్రణాళిక. ఎత్తిపోతలకే 4,992 మెగావాట్ల విద్యుత్ అవసరమంటే ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో అర్దం చేసుకోవచ్చు.

2019-06-21

2019-20లో ఇండియా స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) వృద్ధి రేటు అంచనాను డి.బి.ఎస్. బ్యాంకు తగ్గించింది. వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఇంతకు ముందు అంచనా వేయగా..6.8 శాతానికి పరిమితమవుతుందని తాజాగా గురువారం ఒక నివేదికలో పేర్కొంది. ఎగుమతులకు ఎదురవుతున్న ప్రతిబంధకాలను ఇందుకు ఓ కారణంగా చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గి 5.25 శాతానికి చేరుతుందని డిబిఎస్ గ్రూపు రీసెర్చ్ ఆర్థికవేత్త రాధికారావు అంచనా వేశారు.

2019-06-20 Read More

2024 నాటికి ఇండియా జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు పెరగాలంటే.. ప్రతి రాష్ట్ర జీడీపీ ఇప్పుడున్న స్థాయి నుంచి రెట్టింపు కావలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం ఢిల్లీలో ‘నీతిఆయోగ్’ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని ఈ అంశంపై ముఖ్యమంత్రులతో మాట్లాడారు. రాష్ట్రాల జీడీపీలు 2 నుంచి 2.5 రెట్లు పెరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధనకోసం జిల్లా స్థాయినుంచే కృషి చేయాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.

2019-06-15

మే నెలలో భారత విదేశీ వాణిజ్య లోటు 15.36 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.07 లక్షల కోట్ల)కు పెరిగింది. ఈ మాసంలో ఎగమతుల విలువ 30 బిలియన్ డాలర్లుగా ఉంటే దిగుమతులు 45.35 బిలియన్ డాలర్లకు చేరాయి. వృద్ధి రేటు ఎగుమతుల్లో 3.93 శాతంగా ఉంటే దిగుమతుల్లో 4.31 శాతం నమోదైంది. చమురు దిగుమతుల విలువ 8.23 శాతం పెరిగి 12.44 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర దిగుమతుల విలువలో వృద్ధి తక్కువ (2.9 శాతం)గానే ఉంది. అయితే, బంగారం దిగుమతుల విలువ ఏకంగా 37.43 శాతం పెరిగి 4.78 బిలియన్ డాలర్లకు పెరిగింది.

2019-06-14 Read More

దేశీయంగా ఉల్లి ధరలు పెరగడంతో ఎగుమతులను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఎగుమతి రాయితీ 10 శాతాన్ని ఉపసంహరించింది. తాజా ఉల్లిపాయలు, కోల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉన్న సరుకు ఎగుమతులపై ఉన్న రాయితీలను ఉపసంహరిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డి.జి.ఎఫ్.టి) మొన్న నోటీసు ఇచ్చింది. గతంలో ఈ రాయితీ 5 శాతంగా ఉండగా ఎగుమతులను పెంచడంకోసం గత ఏడాది డిసెంబర్ లోనే 10 శాతానికి పెంచారు. ఆ రాయితీ జూన్ 30వ తేదీవరకు అమలు కావలసి ఉంది.

2019-06-11 Read More

ప్రయాణ వాహనాల టోకు అమ్మకాలు మే నెలలో 20 శాతం తగ్గిపోయాయి. గత 18 సంవత్సరాల్లో ఇదే అత్యధిక పతనం. 2001 సెప్టెంబర్ మాసంలో అమ్మకాలు 21.91 శాతం తగ్గగా ఆ తర్వాత అంతటి స్థాయి తిరోగమనం ఇప్పుడే నమోదైంది. గత ఏడాది మే నెలలో 3,01,238 వాహనాలు అమ్ముడుపోగా ఈ ఏడాది మే నెలలో కేవలం 2,39,347 అమ్ముడయ్యాయి. గత 11 నెలల్లో 2018 అక్టోబర్ మాసాన్ని మినహాయిస్తే 10 నెలలూ అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. రిటైల్ అమ్మకాల్లో తగ్గుదలతో కార్ల తయారీదారులు ఉత్పత్తిని తగ్గించారు.

2019-06-11 Read More

భారత దేశ జీడీపీ వృద్ధి రేటును 2011-12 నుంచి 2016-17 వరకు అతిగా అంచనా వేశారని ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నిర్ధారించారు. అధికారిక అంచనాల్లో వృద్ధి రేటు సుమారు 7 శాతం ఉండగా వాస్తవ జీడీపీ వృద్ధి 4.5 శాతమేనని అరవింద్ 17 ఆర్థిక సూచీల ఆధారంగా లెక్కగట్టారు. వాస్తవ వృద్ధి కంటే 2.5 శాతం అదనంగా అధికారిక అంచనాలున్నాయని ఆయన ఇటీవల హార్వర్డ్ యూనివర్శిటీ ప్రచురించిన పరిశోధనా పత్రంలో నిర్ధారించారు.

2019-06-11 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page