కేంద్రం నుంచి పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో 95,904.70 కోట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా (34,833.18 కోట్ల)లో మారేదేం ఉండదు. అయితే, గ్రాంట్ల రూపంలో 61,071.52 కోట్లు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆశ మాత్రమే. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం గ్రాంట్లు, పన్నుల్లో వాటా కలిపి కేంద్రంనుంచి వచ్చిన మొత్తం రూ. 52,167.43 కోట్లు. ఈ ఏడాది దానికంటే రూ. 43,737.27 కోట్లు (83.84 శాతం) అదనంగా వస్తాయన్నది సిఎం ఆశ! కాదు కల!!

2019-07-12

2018-19 సవరించిన అంచనాలకంటే 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పరిమాణం రూ. 65,840.77 కోట్ల మేరకు పెరిగింది. ఒక్క ఏడాదిలో 40.61 శాతం పెరుగుదలకు తగినట్టుగా ఆదాయం ఎక్కడినుంచి వస్తుంది?! కేంద్ర గ్రాంట్ల రూపంలో గత ఏడాది (రూ. 19,456.72 కోట్లు) కంటే రూ. 41,614.8 కోట్లు అధికంగా వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అంటే గ్రాంట్ల రూపంలోనే ఈ ఏడాది రూ. 61,071.52 కోట్లు వస్తాయన్నది రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఇది 214 శాతం పెరుగుదల. ఇది ఆశ కాదు.. కలే!!

2019-07-12

సిఎం జగన్ ప్రధాన ఎన్నికల హామీలలో ‘‘దశలవారీ మద్య నిషేధం’’ ఒకటి. అయితే, 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ. 8,517.99 కోట్లు వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. 2018-19 సవరించిన అంచనాలకంటే ఇది రూ. 2,298 కోట్లు (36.94 శాతం) అదనం. మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఇదెలా సాధ్యం?! 2017-18లో ఎక్సైజ్ ఆదాయం రూ. 5,460 కోట్లు కాగా 2018-19లో బడ్జెట్ అంచనా (రూ. 7,357 కోట్లు) కంటే తగ్గింది (రూ. 6,220.20 కోట్లు).

2019-07-12

2018-19లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల ప్రకారం) రూ. 1,64,025కి పెరిగిందని సామాజికార్థిక సర్వే వెల్లడించింది. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ పత్రంతోపాటే ఆర్థిక సర్వేనూ అసెంబ్లీకి సమర్పించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 1,43,935 ఉండగా గత ఏడాది 13.96 శాతం పెరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం రూ. 1,14,958 నుంచి రూ. 1,26,699కి పెరిగిందని ఏపీ ఆర్థిక సర్వే పత్రం పేర్కొంది.

2019-07-12

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వ్యయాలకు సొమ్ము ఎలా వస్తుంది? 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బదలాయింపులతో కలిపి రూ. 1,78,697.42 కోట్లు రెవెన్యూ పద్దుల రూపంలో వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మిగిలిన మొత్తంలో మెజారిటీ.. అంటే రూ. 46,921 కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకోవలసిందే. ఖర్చుల్లో రూ. 1,80,475.94 కోట్లు రెవెన్యూ వ్యయం కాగా అప్పులు, వడ్డీల చెల్లింపులకు రూ. 13,417 కోట్లు పోతుంది.

2019-07-12

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తొలి వార్షిక పద్దు (బడ్జెట్)ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యయం రూ. 2,27,974.99 కోట్లుగా అంచనా వేశారు. 2018-19 బడ్జెట్ అంచనాల కంటే ఇది 19.32 శాతం అధికం కాగా, సవరించిన అంచనాలతో పోలిస్తే ఏకంగా 40.61 శాతం ఎక్కువ. 2018-19 బడ్జెట్ అంచనా వ్యయం రూ. 1,91,063.61 కోట్లు అయితే సవరించిన అంచనాల్లో రూ. 1,62,134.22 కోట్లకు తగ్గింది.

2019-07-12

అమెజాన్.కామ్ మార్కెట్ విలువ మరోసారి ట్రిలియన్ డాలర్లకు చేరువైంది. బుధవారం ఓ దశలో ట్రిలియన్ డాలర్లు దాటినా మార్కెట్లు ముగిసే సమయానికి $993 బిలియన్లుగా ఉంది. మే నెల చివరినుంచి ఇప్పటికి అమెజాన్ విలువ 128 బిలియన్ డాలర్లు పెరిగింది. అందులో సగం గత వారం రోజుల్లో పెరిగినదే..! గత సెప్టెంబర్లో ఓసారి ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఒక్కటే ట్రిలియన్ డాలర్ల క్లబ్ లో ఉంది. ఆ కంపెనీ ప్రస్తుత విలువ $1.061 ట్రిలియన్లు. అక్టోబర్లో $1.121 బిలియన్ దాటిన యాపిల్ ఇప్పడు $937 బిలియన్లుగా ఉంది.

2019-07-11 Read More

చంద్రబాబు హయాంలో ప్రగతిపై సందేహాలు.. వైఎస్ హయాంలో ప్రగతిపై ప్రశంసలు.. బుధవారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రం సారాంశమిదే! 2014-19 (చంద్రబాబు ప్రభుత్వ) కాలంలో సగటున 10.36 శాతం వృద్ధిరేటు సాధించినట్టు పేర్కొంటూనే...దాని వాస్తవికతపై బుగ్గన తీవ్రస్థాయిలో సందేహాలు వ్యక్తం చేశారు. 2004-09 (వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ) కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ సగటున 9.56 శాతం పెరిగినట్టు పేర్కొంటూ.. అదే అత్యధిక వృద్ధిరేటుగా స్పష్టం చేశారు.

2019-07-10

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో 2014-19 బ్యాడ్ పీరియడ్ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు రాష్ట్ర విభజన, చంద్రబాబు పాలన కారణాలుగా పేర్కొన్నారు. బుధవారం బుగ్గన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ళలో ఫిషరీస్ రంగంలో గ్రోత్ బాగుందని చూపిస్తూ మొత్తం వ్యవసాయ రంగం బాగా పెరిగినట్టు చూపించారని, నిజానికి ఆ కాలంలో వ్యవసాయ రంగం దెబ్బ తిన్నదని బుగ్గన చెప్పారు. అదే సమయంలో అప్పులు, ద్రవ్యోల్భణం బాగా పెరిగాయని పేర్కొన్నారు.

2019-07-10

ఈసారి కేంద్ర బడ్జెట్ తోనూ ఏపీకి నిరాశే ఎదురైంది. రాష్ట్ర విభజన హామీల్లో ప్రధానమైన అంశాలకు కేటాయింపులు లేవు. కేంద్రీయ విశ్వ విద్యాలయానికి రూ. 13 కోట్లు... ఏపీ, తెలంగాణలలో గిరిజన విశ్వ విద్యాలయాలకు కలిపి రూ. 8 కోట్లు కేటాయించారు. గత ఏడాది రెండు గిరిజన విశ్వ విద్యాలయాలకు రూ. 20 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో ఆ మొత్తం కేవలం కోటి రూపాయలకు పరిమితమైంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచాయి.

2019-07-05
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page