ఆదాయ పన్ను శాఖ గత డైరెక్టర్ జనరల్ తనను తీవ్రంగా వేధించారని తప్పిపోయిన వ్యాపారవేత్త వి.జి. సిద్ధార్థ పేర్కొన్నారు. సోమవారం మంగళూరులో అదృశ్యమయ్యాక ఆయన రాసిన లేఖను కంపెనీ ఉద్యోగులు బయటపెట్టారు. రెండు సందర్భాల్లో తమ షేర్లను అటాచ్ చేయడంవల్ల తీవ్రమైన ద్రవ్య సమస్యను ఎదుర్కొన్నానని సిద్ధార్థ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మైండ్ ట్రీ’ ఒప్పందం విషయంలోనూ, ‘కాఫీ డే’ షేర్ల విషయంలోనూ ఆ అధికారి అడ్డుపడ్డారని ఆరోపించారు.

2019-07-29

ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి, ఇవి ఛార్జర్లపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆగస్టు 1వ తేదీనుంచి అమల్లోకి రానుంది. కౌన్సిల్ 36వ సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. స్థానిక సంస్థలు అద్దెకు తీసుకునే ఎలక్ట్రిక్ బస్సులను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

2019-07-27 Read More

2019 రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2.1 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదైంది. అమెరికా ప్రభుత్వ విభాగం బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలసిస్ (బిఇఎ) శుక్రవారం తాజా గణాంకాలను వెల్లడించింది. పెట్టుబడుల పతనం జీడీపీపై ప్రభావం చూపించిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. రెండో త్రైమాసికంలో ఈ మాత్రపు వృద్ధికి ప్రధానంగా దోహదం చేసింది వినియోగమే.

2019-07-26 Read More

పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం.. ఇండియా నుంచి రోజుకు 600 విమానాల రాకపోకలపై ప్రభావం చూపించిందని కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్ సభలో వెల్లడించింది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై (ఫిబ్రవరి 27న) ఇండియా వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయగా.. విమానాలన్నీ అరేబియా సముద్రంపై నుంచి నడపవలసి వచ్చింది. తమ గగనతలంపై నిషేధాన్ని పాకిస్తాన్ ఈ నెల 16న ఎత్తివేసింది.

2019-07-25

ప్రపంచ బ్యాంకు తర్వాత ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఎఐఐబి) కూడా అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుకు రుణాన్ని నిరాకరించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తమ పరిశీలనలో లేదని ఎఐఐబి అధికార ప్రతినిధి లారెల్ ఓస్ట్ ఫీల్డ్ మంగళవారం రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు $300 మిలియన్లు, ఎఐఐబి $200 బిలియన్లు రుణం ఇవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విరమించుకోవడంతో రెండు బ్యాంకులూ తప్పుకొన్నాయి.

2019-07-23

అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుకు రుణ సాయంకోసం చేసిన విన్నపాన్ని భారత ప్రభుత్వమే ఉపసంహరించుకుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అమరావతి ప్రాజెక్టును వదిలేసినట్టు గత వారం బ్యాంకు వెస్ సైట్లో పేర్కొన్నాక దుమారం రేగింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీకి తమ సహకారం కొనసాగుతుందని అందులో పేర్కొంది. వైద్య, వ్యవసాయ, ఇంథన, విపత్తు సహాయ రంగాల్లో $100 బిలియన్ మేరకు సాయం అందిస్తున్నట్టు పేర్కొంది.

2019-07-21

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నికర లాభం ఏకంగా రూ. 10 వేల కోట్లు దాటింది. ముఖేష్ అంబానీ కంపెనీ ఆదాయం మార్కెట్ నిపుణుల అంచనాలకు మించి 22.1 శాతం పెరిగింది. ఆదాయం రూ. 1.72 లక్షల కోట్లు రాగా దానిపైన నికర లాభం రూ. 10,104 కోట్లు సంపాదించింది. గత ఈ ఏడాది కంటే లాభం 6.8 శాతం పెరిగింది. 2019లో ఇదే కాలానికి ఆదాయం రూ. 1.41 లక్షల కోట్లుగా ఉంటే నికర లాభం రూ. 9,459 కోట్లు వచ్చింది.

2019-07-19 Read More

ఆంధ్రుల నూతన రాజధాని ‘అమరావతి’ నిర్మాణానికి రుణసాయం చేస్తుందనుకున్న ప్రపంచ బ్యాంకు మొండిచెయ్యి చూపించింది. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికోసం $300 మిలియన్ల (సుమారు రూ. 2100 కోట్లు) మేరకు కేంద్రం ద్వారా పంపిన రుణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ ప్రాజెక్టును వదిలేసినట్టు తన వెబ్ సైట్లో పేర్కొంది. రెండేళ్ళ క్రితమే ఆమోదించాల్సిన రుణ ప్రతిపాదనను కొందరి ఫిర్యాదుల కారణంగా పెండింగ్ లో పెట్టి..ఇప్పుడు నిర్ణయాన్ని వెల్లడించింది.

2019-07-18

ఇండియాకు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జి.ఎస్.పి) కింద ఇచ్చే ప్రయోజనాలను అమెరికా ఉపసంహరించుకోవడం.. ఆభరణాలు, రత్నాల ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2018 జూన్ ($727.3 మిలియన్ల)తో పోలిస్తే 2019 జూన్ లో ($608.06 మిలియన్లు) అమెరికాకు ఆభరణాల ఎగుమతులు 16.4 శాతం తగ్గిపోయాయి. జి.ఎస్.పి. ప్రయోజనాలను 2019 జూన్ 5వ తేదీనుంచి ఉపసంహరించుకోగా.. కార్మిక శక్తి ప్రధానమైన రంగాలపై ఆ ప్రభావం గణనీయంగా ఉంది.

2019-07-16

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) ఎం.డి.గా పని చేస్తున్న అన్షులా కాంత్ ప్రపంచ బ్యాంకు ఎం.డి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరుగా నియమితులయ్యారు. ఆమె నియామకాన్ని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రపంచ బ్యాంకుకు అన్షులా కాంత్ తొలి మహిళా ఎండీ. 35 సంవత్సరాల అనుభవం ఉన్న కాంత్, స్టేట్ బ్యాంకు సీ.ఎఫ్.ఒ.గా పని చేసినప్పుడు టెక్నాలజీని వినూత్న పద్ధతుల్లో వినియోగించారని డేవిడ్ పేర్కొన్నారు.

2019-07-12 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page