కేంద్రం ప్రభుత్వ ఆర్థిక, కార్మిక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యలు జనవరి 8న జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ రోజు 20 కోట్లకు పైగా కార్మికులు సమ్మె చేయనున్నట్లు యూనియన్లు సోమవారం తెలిపాయి. మోడీ ప్రభుత్వ విధానాలను "కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక" విధానాలుగా ఆయా సంఘాలు పేర్కొన్నాయి. ఆర్థిక మందగమనం ప్రతికూల ప్రభావాలను అసంఘటిత, వ్యవస్థీకృత రంగాలలోని కార్మికులు పెద్ద ఎత్తున అనుభవిస్తున్నారని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

2019-10-01 Read More

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నిజమైన జిడిపి వృద్ధి రేటు 5.2 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. వ్యాపార విశ్వాసంలో క్షీణత, అణగారిన డిమాండ్, ఆర్థిక రంగంలో ఆందోళనలు పెట్టుబడులను దెబ్బతీస్తున్నట్టు పేర్కొంది. ‘‘వినియోగదారుల, వ్యాపారుల విశ్వాసం తక్కువగా ఉంది. జూలైలో కార్ల అమ్మకాలు 30 శాతం పడిపోయాయి. ఆర్థిక రంగంలో సమస్యల వల్ల రుణాల వృద్ధి రేటు కుంటుపడింది’’ అని ఇఐయు తన తాజా నివేదికలో తెలిపింది.

2019-09-30 Read More

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణం బడ్జెట్లో నిర్దేశించుకున్న ప్రకారం రూ. 7.1 లక్షల కోట్ల పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. సెప్టెంబరు 30 వరకు గడచిన ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 4.42 లక్షల కోట్ల (62 శాతం) మేరకు రుణాలు తీసుకుంది. బడ్జెట్ లక్ష్యంలో మిగిలిన రూ .2.68 లక్షల కోట్లు వచ్చే ఆరు నెలల్లో తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తెలిపారు. కార్పొరేట్ పన్ను తగ్గించిన కారణంగా ప్రభుత్వానికి తగ్గనున్న రూ. 1.45 లక్షల కోట్ల ఆదాయంపై స్పష్టత రావలసి ఉంది.

2019-09-30 Read More

ఆగస్టు చివరి నాటికి (ఐదు నెలల్లో) దేశ ఆర్థిక లోటు రూ .5.54 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది 2019-20 బడ్జెట్ అంచనాలో 78.7 శాతంగా ఉంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆగస్టు 31 నాటికి ఆర్థిక లోటు లేదా వ్యయం, ఆదాయాల మధ్య అంతరం రూ .5,53,840 కోట్లు. 2018-19 బడ్జెట్ అంచనా (బీఈ) లో ఆగస్టు చివరికి నమోదైన లోటు 86.5 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును రూ. 7.03 లక్షల కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించుకుంది.

2019-09-30 Read More

బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఎనిమిది ప్రధాన పరిశ్రమల వృద్ధి రేటు నాలుగున్నర సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. 8 రంగాలు ఆగస్టులో తిరోగమించి మైనస్ 0.5 శాతం రేటును నమోదు చేశాయి. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం... బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు శుద్ధి, ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ అనే ఎనిమిది ప్రధాన రంగ పరిశ్రమలు గత ఏడాది ఆగస్టులో 4.7 శాతం విస్తరించాయి.

2019-09-30 Read More

పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నవయుగ కంపెనీ బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకులను కోరింది. బ్యాంకులు దీనికి కొంత సమయం కోరినట్టు సమాచారం. మరోవైపు... జప్తును అడ్డుకోవడానికి నవయుగ కంపెనీ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ‘నవయుగ’ను ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం, తాజాగా ‘ఏపీ జెన్ కో’ జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలోనూ కంపెనీపై చర్యలకు దిగడం గమనార్హం.

2019-08-14 Read More

రూపాయి విలువ 6 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికన్ డాలరుతో పోలిస్తే మంగళవారం 62 పైసలు తగ్గి రూ. 71.40 వద్ద ముగిసింది. మార్కెట్ల పతనం, అర్జెంటినా కరెన్సీ కుప్పకూలడం ఇన్వెస్టర్లను సురక్షిత మార్గాలవైపు మళ్లించాయి. గత శుక్రవారం ఒక డాలరుకు రూ. 70.78 వద్ద మార్కెట్ ముగిసింది. బక్రీద్ పండుగ కారణంగా సోమవారం మార్కెట్లకు సెలవు. మంగళవారం ఇంటర్ బ్యాంకు ఫారెన్ ఎక్సేంజ్ వద్ద రూ. 71.15గా ప్రారంభమైన డాలర్ విలువ ఒక దశలో రూ. 71.02కు చేరుకొని చివరికి రూ. 71.40గా ముగిసింది.

2019-08-13 Read More

నిమిషానికి రూ. 50 లక్షలు. రోజుకు సుమారు రూ. 700 కోట్లు. వాల్ మార్ట్ వెనుక ఉన్న వాల్టన్ కుటుంబ సంపద పెరుగుతున్న తీరు ఇది. బ్లూంబెర్గ్ ర్యాంకుల్లోని సంపన్నులు గత ఏడాది నుంచి కూడాబెట్టిన మొత్తాలు చూస్తే కళ్లు తిరగడం ఖాయం. వాల్టన్ కుటుంబ ఆస్తి 2018 జూన్ కంటే ఇప్పటికి 39 బిలియన్ డాలర్లు పెరిగి 191 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర అమెరికన్ సంపన్న కుటుంబాల్లో ‘మార్స్’ ఆస్తి గత ఏడాదికంటే 37 బిలియన్ డాలర్లు పెరిగింది. పారిశ్రామిక, రాజకీయ దిగ్గజం ‘కోచ్స్’ సంపద 26 బిలియన్ డాలర్లు పెరిగింది.

2019-08-11 Read More

ఇండియాతో వాణిజ్య సంబంధాలను అధికారికంగా నిలిపివేసింది పాకిస్తాన్. జమ్మూ -కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని (370వ అధికరణను) రద్దు చేసినందుకు ప్రతిగా.. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ, పార్లమెంటు ఇదివరకే కొన్ని నిర్ణయాలను ప్రకటించాయి. వాటిని శనివారం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ ట్రాన్సిట్ ఒప్పందం కింద వచ్చే దిగుమతులను సైతం నిలిపివేసినట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సమాచార సహాయకుడు ఫిర్దౌస్ ఆషిక్ అవాన్ చెప్పారు.

2019-08-10 Read More

జాతీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు పడకేసింది. శుక్రవారం వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం.. 2019 జూన్ నెలలో దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు కేవలం 2 శాతం. 2018లో ఇదే నెలలో వృద్ధి రేటు 7 శాతం. ఉప రంగాల వారీగా చూస్తే.. మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ బాగా వెనుకబడ్డాయి. 2018 జూన్ నెలలో తయారీ రంం 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తే ఈ ఏడాది అది 1.2 శాతానికి పడిపోయింది. మైనింగ్ గత ఏడాది జూన్ నెలలో 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తే ఈసారి 1.6 శాతానికి పడిపోయింది.

2019-08-09 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page