(అమెరికా-చైనా) వాణిజ్య యుద్ధపు గొలుసుకట్టు ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2020నాటికి 700 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కొత్త సారథి క్రిస్టలీనా జార్జీవా అంచనా వేశారు. ఈ మొత్తం ప్రపంచ జీడీపీలో 0.8 శాతానికి సమానమని, స్విట్జర్లాండ్ జీడీపీకి ఇది దాదాపు సమానమని ఆమె పేర్కొన్నారు. ఐఎంఎఫ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రపంచ జీడీపీ వృద్ధి రేటులో క్షీణత గతంలో అంచనా వేసిన మోతాదుకంటే ఎక్కువగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

2019-10-08 Read More

వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమవుతున్నాయని, గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ వృద్ధి రేటును ఈ సంవత్సరం చూడబోతున్నామని ఐఎంఎఫ్ కొత్త చీఫ్ క్రిస్టలీనా జార్జీవా ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య ఘర్షణల ప్రభావం చాలా విస్తృతంగా ఉన్నట్టు అధ్యయనం చెబుతోందని జార్జీవా ఐఎంఎఫ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించాక తొలి ప్రసంగంలో చెప్పారు. 2019లో ప్రపంచంలోని 90 శాతం భాగంలో తక్కువ వృద్ధి రేటు నమోదవుతుందని ఆమె అంచనా వేశారు.

2019-10-08 Read More

2016 నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పట్టణ గుజరాత్, మహారాష్ట్రలతో పాటు దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాలపై ఎక్కువగా ఉన్నట్టు అమెరికా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్.బి.ఇ.ఆర్) తేల్చింది. నగదు కొరతతో దేశవ్యాప్తంగా ఆ ఏడాది అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఆర్థిక కార్యకలాపాలు 3 శాతం లేదా అంతకంటే ఎక్కువే తగ్గాయని ఈ సంస్థ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. తర్వాత అనేక త్రైమాసికాల పాటు బ్యాంకు రుణాల డిమాండ్ తగ్గినట్టు ఎన్.బి.ఇ.ఆర్. తెలిపింది.

2019-10-07 Read More

ప్రధాని నరేంద్ర మోదీ 2016లో చేపట్టిన నోట్ల రద్దు తర్వాత జాతీయ ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాల్లో 2 నుంచి 3 శాతం క్షీణత నమోదైనట్టు అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ తేల్చింది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్.బి.ఇ.ఆర్) తాజా అధ్యయనం ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. నోట్ల రద్దుపై జిల్లాల స్థాయిలో చేపట్టిన తొలి అధ్యయనం ఇదే. ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో స్థూలంగా జరిగిన అధ్యయనాలు నోట్ల రద్దు ప్రభావాన్ని తక్కువగా అంచనా వేశాయని ఎన్.బి.ఇ.ఆర్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

2019-10-07 Read More

భారత్, బంగ్లాదేశ్ తాజాగా ఏడు ఒప్పందాలు కుదుర్చుకుని మూడు ప్రాజెక్టులను ప్రారంభించాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలపై చర్చించారు. త్రిపుర రాష్ట్రానికి బంగ్లాదేశ్ భూభాగం ద్వారా ఆ దేశ ట్రక్కులు ఉపయోగించి ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది. నీటి వనరులు, యువత వ్యవహారాలు, సంస్కృతి, విద్య, తీరప్రాంత నిఘా రంగాలలో సహకారంకోసం ఇతర ఒప్పందాలు కుదిరాయి.

2019-10-05 Read More

భారత ఆర్థిక వ్యవస్థకు ఇరుసువంటి సర్వీసుల రంగమూ తిరోగమనంలో ఉన్నట్టు తాజా రిపోర్టు ఒకటి సూచిస్తోంది. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) ఆగస్టులో ఉన్న 52.4 స్థాయి నుంచి సెప్టెంబరులో 48.7కు పడిపోయింది. 2018 ప్రారంభం నుంచి తొలిసారి కొత్త వ్యాపార ఆర్డర్లు పడిపోవడంతో పిఎంఐ పతనమైంది. పిఎంఐ 50 మార్కుకు తగ్గడం అంటే తిరోగమనమే! ఈ ఏడాది ఆ తిరోగమనం రెండు మాసాల్లో నమోదైంది. సెప్టెంబరు పిఎంఐ 19 నెలల కనిష్ఠ స్థాయిలో ఉంది.

2019-10-04 Read More

దేశ ఆర్థిక వృద్ధిరేటు అంచనాల్లో భారతీయ రిజర్వు బ్యాంకు భారీ కోత విధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.1 శాతమే వృద్ధి చెందుతుందని శుక్రవారం ద్వైమాస విధాన ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు అంచనా ప్రకారం జీడీపీ 6.9 శాతం వృద్ధి చెందవలసి ఉంది. అయితే, అనూహ్యంగా మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. రెండో త్రైమాసికంలో కూడా 5.3 శాతమే ఉంటుందని... 3,4 త్రైమాసికాల్లో 6.6 నుంచి 7.2 శాతం వరకు వృద్ధి నమోదు కావచ్చని తాజా అంచనా.

2019-10-04 Read More

దివాలా తీసిన భారతీయ రియల్ ఎస్టేట్ కంపెనీల సంఖ్య ఒక సంవత్సరంలోపు రెట్టింపు అయ్యింది. దివాలా కోర్టులోకి ప్రవేశించిన డెవెలపర్ల సంఖ్య 2018 సెప్టెంబర్ నాటికి 209 కాగా, 2019 జూన్ చివరి నాటికి 421కు పెరిగింది. కీలకమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్) పతనం తర్వాత సంక్షోభం తీవ్రతరమైంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభాన్ని దశాబ్దం క్రితం అమెరికాను, ఆ తర్వాత ప్రపంచాన్ని కుదిపేసిన లేమాన్ సంక్షోభంతో పోల్చుతున్నారు.

2019-10-03 Read More

అనిల్ అంబానీ గ్రూపు కంపెనీలపై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని ఓ వాటాదారుడు తీవ్రంగా హెచ్చరించాడు. సోమవారం జరిగిన రిలయన్స్ పవర్ వార్షిక సాధారణ సమావేశంలో ఓ వాటాదారు కోపంగా మాట్లాడాడు. అనిల్ అంబానీకి చెందిన ఏడు కంపెనీలలో మూడింట తాను రూ. 3 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టానని, అసమర్ధ నిర్వహణ కారణంగా అందులో 90 శాతం కోల్పోయానని ఆ వ్యక్తి చెప్పాడు. దేశ చరిత్రలోనే తొలి క్లాస్ యాక్షన్ దావా వేయడానికి తాను సిద్ధమని అనిల్ అంబానీని ఉద్ధేశించి బెదిరించినట్టు వార్తలు వచ్చాయి.

2019-10-01 Read More

సెప్టెంబరులో భారతదేశ ఉత్పాదక రంగంలో వృద్ధి బలహీనంగా ఉంది. ఒక ప్రైవేట్ వ్యాపార సర్వే ప్రకారం, చలనం లేని ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు కనపించడంలేదు. ‘ఐహెచ్ఎస్ మార్కిట్’ సంకలనం చేసిన నిక్కీ మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సెప్టెంబరులో 51.4 గా ఉంది, ఆగస్టు స్థాయి నుంచి మారలేదు. గత ఏడాది మే నుంచి ఇదే తక్కువ స్థాయి. ప్రభుత్వం, విధాన రూపకర్తలు చింతించాల్సిన అవసరం ఏమిటంటే, మొత్తం డిమాండ్ సెప్టెంబరులో స్వల్పంగా పెరిగింది.

2019-10-01 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page