పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పిఎంసి) బ్యాంకులో రూ. 90 లక్షలు డిపాజిట్ చేసిన 51 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ముంబై సబర్బన్ ఓషివారా నివాసి గులాటి జెట్ ఎయిర్‌వేస్ గ్రౌండింగ్ తరువాత ఉద్యోగం కోల్పోయారు. ఈ స్థితిలో గులాటికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబం రూ. 90 లక్షల మేరకు డిపాజిట్ చేసిన పిఎంసి బ్యాంకుపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించింది. జీవిత కాలం కూడబెట్టిన రూ. 90 లక్షలను విత్ డ్రా చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఒత్తిడికి గురైన గులాటికి గుండె పోటు వచ్చింది.

2019-10-15

అమర్త్యసేన్ తర్వాత మరో భారతీయుడికి ఆర్థిక శాస్త్ర నోబెల్ లభించింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలనకోసం ప్రయోగాత్మక విధానాన్ని రూపొందించిన అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్ 2019 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. బెనర్జీ, డఫ్లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)లో, క్రెమెర్ హార్వార్డ్ యూనివర్శిటీలో పని చేస్తున్నారు. వారి ప్రయోగాత్మక పద్ధతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘‘ఆర్థిక అభివృద్ధి’’ నమూనాలుగా ఉన్నాయి.

2019-10-14 Read More

దేశంలో టాప్ 10లో 8 కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ. 80,943 కోట్ల మేరకు పెరిగింది. ముఖేష్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ విలువ ఏకంగా 28,494 కోట్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ముఖేష్ అంబానీ కంపెనీ మొత్తం విలువ రూ. 8,57,303 కోట్లకు చేరింది. టాప్ 10లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఐటిసి మినహా మిగిలిన 8 కంపెనీల మార్కెట్ విలువ పెరిగింది. టీసీఎస్ విలువ రూ. 34,372 కోట్లు తగ్గి రూ. 7,45,617 కోట్లకు చేరింది.

2019-10-13 Read More

ఆర్థిక మందగమనం ఇండియాను తీవ్రంగా ప్రభావితం చేయగా... పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ మనకంటే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘‘దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్’’ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ వృద్ధి కేవలం 6 శాతం కాగా, నేపాల్ 7.1 శాతం, బంగ్లాదేశ్ ఏకంగా 8.1 శాతం వృద్ధి చెందనున్నాయి. అంతే కాదు... వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఇండియా కంటే బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధి మెరుగ్గా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.

2019-10-13 Read More

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇండియా స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 6 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2017-18లో 7.2 శాతం నమోదు కాగా 2018-19లో 6.9 శాతానికి తగ్గి ఈ ఏడాది మరింతగా పడిపోతోంది. ఆదివారం విడుదలైన ‘‘దక్షిణాసియా ఎకనమిక్ ఫోకస్’’లో బ్యాంకు తాజా అంచనాలను వెల్లడించింది. 2020-21లో వృద్ధి రేటు 6.9 శాతానికి, 2021-22లో 7.2 శాతానికి పెరుగుతుందని ఆ పత్రం అంచనా వేసింది.

2019-10-13 Read More

గత 2000 సంవత్సరాల్లో అధిక కాలం ఇండియా, చైనా ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఫరిఢవిల్లాయని, మళ్లీ రెండు దేశాలూ ఆ స్థితికి ఎదుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా శనివారం తమిళనాడులోని కోవలం బీచ్ రిసార్టులో ఇరు దేశాల అధినేతలూ చర్చలు జరిపారు. ఈ అనధికార శిఖరాగ్ర సమావేశం (చెన్నై కనెక్ట్)తో చైనా-ఇండియా సంబంధాల్లో కొత్త యుగం మొదలవుతుందని మోదీ పేర్కొన్నారు.

2019-10-12 Read More

పారిశ్రామిక ఉత్పత్తి 81 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపి) ఆగస్టులో మైనస్ 1.1 శాతం నమోదైంది. గత ఏడాది ఆగస్టులో 4.8 శాతం వృద్ధి నమోదు కాగా ఈసారి రివర్స్ అయింది. జాతీయ గణాంక సంస్థ శుక్రవారం వెల్లడించిన వివరాలు ఆర్థిక వ్యవస్థపై ఆందోళనను మరింత పెంచాయి. ప్రధానంగా తయారీ రంగంలోని 23 గ్రూపుల్లో 15 తిరోగమనంలో పయనించాయి. వాహనాల తయారీ పరిశ్రమ ఏకంగా 23.1 శాతం తిరోగమించింది. మెషినరీ & ఎక్విప్ మెంట్ రంగం 21.7 శాతం క్షీణించింది.

2019-10-12 Read More

భారత కుబేరుల్లో ముఖేష్ అంబానీ నెంబర్ 1 స్థానం ఈసారీ పదిలం. ఫోర్బ్స్ మ్యాగజైన్ 2019 జాబితాలో విశేషం ఏమంటే... ప్రధాని మోదీకి సన్నిహితుడు గౌతమ్ అదానీ 2వ స్థానానికి ఎగబాకటం! 51.4 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ తొలి స్థానంలో ఉంటే అదానీ $15.7 బిలియన్లతో 2వ స్థానంలోకి వచ్చారు. హిందుజా సోదరులు ($15.6 బిలియన్), పల్లోంజీ మిస్త్రీ ($15 బి), ఉదయ్ కోటక్ ($14.8 బి), శివ్ నాడార్ ($14.4 బి), రాధాక్రిష్ణ దమాని ($14.3 బి), గోద్రెజ్ కుటుంబం ($12 బి), లక్ష్మీ మిట్టల్ ($10.5 బి), కుమారమంగళం బిర్లా ($9.6 బి) టాప్ 10లో ఉన్నారు.

2019-10-11 Read More

ఆటో సెక్టార్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు సెప్టెంబరులో 23.7 శాతం పడిపోయాయి. పాసెంజర్ కార్ల అమ్మకాలు ఏకంగా 33.4 శాతం పతనమయ్యాయి. అమ్మకాలు పడిపోవడం వరుసగా ఇది 11వ నెల. శుక్రవారం వెల్లడైన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం సెప్టెంబరులో మొత్తం ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 2,23,317. అందులో కార్లు 1,31,281. క్షీణత సుదీర్ఘ కాలం కొనసాగడంతో పరిశ్రమలు ఉత్పత్తిని, తద్వారా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి.

2019-10-11 Read More

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం భారతదేశానికి సంబంధించిన 2019-20 జిడిపి వృద్ధి అంచనాను 5.8 శాతానికి తగ్గించింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) అంచనా వేసిన 6.1 శాతం కంటే ఇది బాగా తక్కువ కావడం గమనార్హం. మూడీస్ గత అంచనా ప్రకారం జీడీపీ 6.2 శాతం పెరగాల్సి వుంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటున్నదని, ఇది కొంతవరకు దీర్ఘకాలిక కారకాలతో సంబంధం కలిగి ఉందని మూడీస్ పేర్కొంది. పెట్టుబడిలో మందగమనం వినియోగానికి విస్తరించిందని, గ్రామీణ గృహాల్లో ఆర్థిక ఒత్తిడి, బలహీనమైన ఉద్యోగ కల్పన ఈ పరిస్థితికి కారణమయ్యాయని విశ్లేషించింది.

2019-10-10 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page