ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 నివేదికలో ఇండియా 63 వ స్థానానికి మెరుగుపడింది. 2019 నివేదికలో ఇండియాది 77వ స్థానం. ఈ ఏడాది 14 స్థానాలు మెరుగైనా, ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టుగా టాప్ 50లోకి వెళ్ళలేకపోయింది. పది పరామితుల ఆధారంగా 190 దేశాలకు ర్యాంకులు కేటాయించారు. ఇందులో వ్యాపారం ప్రారంభించడం, నిర్మాణ అనుమతులు, విద్యుత్ పొందడం, క్రెడిట్ పొందడం, పన్నులు చెల్లించడం, సరిహద్దుల్లో వ్యాపారం, ఒప్పందాలను అమలు చేయడం, దివాలా తీయడం వంటివి ఉన్నాయి.

2019-10-24

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు మంగళవారం 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. సుమారు 2 లక్షల బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. విలీన విధానంతోపాటు డిపాజిట్ల రేట్లు తగ్గింపు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఇఎఫ్ఐ) సమ్మెకు పిలుపునిచ్చాయి.

2019-10-21

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ చేసిన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆర్థికశాస్త్ర నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సూచించారు. భూమిలేని పేదలను కూడా ‘‘పిఎం కిసాన్’’ పథకంలో చేర్చాలని హితవు పలికారు. బెనర్జీ, ఆయన సహచరి ఎస్తేర్ డఫ్లో కలసి రచించిన ‘‘గుడ్ ఎకనామిక్స్ ఫర్ హెరాల్డ్ టైమ్స్’’ అనే పుస్తకం విడుదలకోసం ఆయన ఇండియా వచ్చారు. ‘‘నేనైతే కార్పొరేట్ పన్ను తగ్గించేవాడిని కాను. ఇప్పుడు రివర్స్ చేసినా కొంత నష్టం తప్పదు. అయినా... ఖజానాపై భారం పడేదాన్ని రద్దు చేయడమే మంచిది’’ అని అభిజిత్ చెప్పారు.

2019-10-21

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సెంటిమెంట్ ఇండెక్స్ భారీగా పతనమై నోట్ల రద్దు నాటి స్థితికి చేరినట్టు ఓ సర్వే నివేదిక తెలిపింది. పరిశ్రమల సంస్థలు ‘ఫిక్కి’, ‘నారెడ్కో), ప్రాపర్టీ కన్సల్టెంట్ ‘నైట్ ఫ్రాంక్’ సంయుక్తంగా చేసిన సర్వే ప్రకారం... జూలై-సెప్టెంబర్ కాలంలో ఇండెక్స్ 42 పాయింట్లకు పడిపోయింది. గత రెండు త్రైమాసికాలలో ఇండెక్స్ 47, 62 పాయింట్ల వద్ద ఉంది. పాత రూ. 1000, 500 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో 2016 జూలై-సెప్టెంబరులో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ 41గా నమోదైంది.

2019-10-17 Read More

దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం క్షీణించి 65,799 యూనిట్లకు చేరుకున్నాయి. వినియోగదారుల విశ్వాసం, డిమాండ్ తగ్గడంతో కొత్త ప్రారంభాలు ఏకంగా 45 శాతం పడిపోయినట్టు ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ ‘ప్రాప్‌టైగర్’ తెలిపింది. 2018 జూలై-సెప్టెంబర్ కాలంలో 88,078 యూనిట్లు అమ్ముడుపోగా 2019లో 65,799 యూనిట్లకు తగ్గాయని, కొత్త ప్రారంభాలు 61,679 యూనిట్ల నుంచి 33,883 యూనిట్లకు పడిపోయాయని ‘ప్రాప్ టైగర్’ నివేదిక తెలిపింది.

2019-10-17 Read More

2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతీయుల వ్యక్తిగత సంపద మొత్తం రూ. 799 లక్షల కోట్లకు చేరుకుంటుందని కార్వీ సంస్థ అంచనా వేసింది. ‘‘ఇండియా వెల్త్ రిపోర్టు 2019’’ని ఆ సంస్థ బుధవారం విడుదల చేసింది. వచ్చే నాలుగేళ్ళలో ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీగా మారితే ఇండియన్ల వ్యక్తిగత సంపద సగటున 13.2 శాతం పెరుగుతుందని కార్వీ అంచనా వేసింది. ప్రస్తుతం వ్యక్తిగత సంపద మొత్తం రూ. 430 లక్షల కోట్లుగా, ఈ ఏడాది వృద్ధి రేటు 9.6 శాతంగా పేర్కొంది.

2019-10-16 Read More

భారతీయుల వ్యక్తిగత సంపద మొత్తం రూ. 430 లక్షల కోట్లకు చేరిందని ‘కార్వీ ప్రైవేట్ వెల్త్’ అంచనా వేసింది. సంస్థ ‘ఇండియా వెల్త్ రిపోర్టు 2019’ బుధవారం విడుదలైంది. దాని ప్రకారం 2019లో ఇండియన్ల వ్యక్తిగత సంపద మొత్తం 9.62 శాతం పెరిగింది. భౌతిక ఆస్తుల పెరుగుదల 7.59 శాతంగా ఉంటే, ఫైనాన్షియల్ ఆస్తులు 10.96 శాతం పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. రూ. 167 లక్షల కోట్ల భౌతిక సంపదలో రియల్ ఎస్టేట్ ఆస్తులు, బంగారం వాటా 92.57 శాతంగా ఉన్నట్టు తెలిపింది.

2019-10-16 Read More

2019 ప్రథమార్దంలో ప్రపంచ వాణిజ్య పరిమాణం కేవలం 1 శాతం వృద్ధి చెందిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. 2012 నుంచి ఇదే బలహీనమైన స్థాయి అని మంగళవారం విడుదల చేసిన ద్వైవార్షిక ‘‘వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్’’లో పేర్కొంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 0.8 శాతం తగ్గుతోందని అంచనా వేసింది. తయారీ రంగం, ప్రపంచ వాణిజ్యంలో క్షీణత మొత్తంగా ప్రపంచ జీడీపీపై ప్రభావం చూపుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది.

2019-10-15

2019 కేలండర్ సంవత్సరంలో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు కేవలం 3 శాతమేనని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, అనేక దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొంది. ఐఎంఎఫ్ తన ద్వివార్షిక ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికను మంగళవారం విడుదల చేసింది. 2018లో ప్రపంచ జీడీపీ 3.6 శాతం వృద్ధి చెందగా ఈ ఏడాది మందగించి 2020లో మళ్ళీ కొంత పుంజుకుంటుందని ఆ నివేదికలో అంచనా వేసింది.

2019-10-15

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.1 శాతానికి తగ్గించింది. జూలైలో అంచనా 7 శాతం నుంచి బాగా తగ్గించింది. దేశీయ డిమాండ్ గత అంచనా కంటే చాలా బలహీనంగా ఉందని మంగళవారం విడుదల చేసిన "వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్"లో పేర్కొంది. గత వారం ప్రపంచ బ్యాంకు కూడా.. 2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.1%కి తగ్గించింది. 2020-21లో జిడిపి వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 7.2 శాతానికి తగ్గించింది.

2019-10-15 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page