తమ సబ్సిడరీ కంపెనీ ‘జియో ప్లాట్ ఫామ్స్’కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ నుంచి రూ. 33,737 కోట్లు వచ్చినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. ‘జియో ప్లాట్ ఫామ్స్’లో 7.73 శాతం వాటా కింద వచ్చిన ఈ మొత్తమే ఇండియాలో గూగుల్ పెట్టిన అతిపెద్ద పెట్టుబడి. కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తర్వాత లావాదేవీలు జరిగాయి. అందుబాటు ధరల్లో 4జి, 5జి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను అభివృద్ధి చేయడం ఈ సంస్థల ఉమ్మడి ప్రణాళికగా ఉంది. ఈ పెట్టుబడి కారణంగా మంగళవారం ఆర్ఐఎల్ షేరు ధర 0.7 శాతం పెరిగి రూ. 1,965.10 వద్ద ముగిసింది.
2020-11-24ఆసియా దిగ్గజాలతో కూడిన అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆర్.సి.ఇ.పి.లో చేరడానికి నిరాకరించిన ఇండియా.. ఇప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్లతో ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. ఆయా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టి.ఎ)పై మరుగునపడిన సంప్రదింపుల ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టబోతున్నట్టు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. 10 ‘ఆసియాన్’ దేశాలతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సభ్యులుగా ఏర్పాటైన ఆర్.సి.ఇ.పి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్.టి.ఎ.గా గణతికెక్కింది.
2020-11-21ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్ ప్రభావం నేపథ్యంలో.. భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గణనీయంగా తగ్గించింది. 2020-25 మధ్య ఇండియా సగటున 6.5 శాతం వృద్ధి చెందుతుందని ఇంతకు ముందు అంచనా వేసిన ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ బృందం, ఇప్పుడా అంచనాను 4.5 శాతానికి కుదించింది. కోవిడ్ అనంతర ప్రభావాలు అత్యంత అధ్వానంగా ఉండే దేశాల్లో భారతదేశం ఒకటని, కరోనాకు ముందు వేసిన అంచనా కంటే తలసరి జీడీపీ 12 శాతం తగ్గుతుందని ఈ సంస్థ పేర్కొంది.
2020-11-19ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రాతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్.సి.ఇ.పి) చైనా సహా 15 ఆసియా-పసిఫిక్ దేశాల ఆమోదంతో ఆదివారం ఉనికిలోకి వచ్చింది. ఇండియా గత ఏడాది ఈ భాగస్వామ్యం నుంచి తప్పుకోగా.. ‘క్వాడ్’ మిత్ర దేశాలు జపాన్, ఆస్ట్రేలియా భాగస్వాములయ్యాయి. ఆర్.సి.ఇ.పి. దేశాల్లో 220 కోట్ల జనాభా ఉండగా.. అవి ప్రపంచ జీడీపీలో 30 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 29 శాతం కలిగి ఉన్నాయి. చైనా కేంద్ర బిందువుగా జరిగిన ఈ ఒప్పందం ఆసియా దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంచనుంది.
2020-11-15చైనా కస్టమ్స్ విభాగం ఓ భారత కంపెనీకి చెందిన సముద్ర ఉత్పత్తులను నిలిపివేసింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఈ నిషేధం అమలు కానుంది. ఇండియా నుంచి ఎగుమతి అయిన నురుగు చేప ప్యాకేజింగ్ పైన కరోనా వైరస్ ను కనుగొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా అధికారులు ప్రకటించారు. వైరస్ సహిత ఆహారం టియాంజిన్ రేవు పట్టణం నుంచి తమకు వచ్చినట్టుగా లాంగ్జూ, గ్వాంగ్జూ అధికారులు తెలిపారు. చైనా దిగుమతుల్లో కరోనా వైరస్ ను కనుగొన్న ఉదంతాలు జూలై నుంచి ఇప్పటిదాకా కనీసం 30 వెల్లడయ్యాయి.
2020-11-13వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వ్యవస్థ విఫలమైందని, ఈ విషయాన్ని ముందుగా ప్రధానమంత్రి అంగీకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచించారు. పాత పన్నుల విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ‘ఒక దేశం.. ఒకటే పన్ను’ పేరిట కేంద్ర, రాష్ట్రాల పరోక్ష పన్నులను విలీనం చేసి జి.ఎస్.టి.ని ప్రవేశపెట్టారు. దీంతో ప్రజలపై పన్ను భారం పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిహారమూ చెల్లించకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే డిమాండ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
2020-10-25హురూన్ చైనా సంపన్నుల జాబితా తాజాగా విడుదలైంది. ‘అలీబాబా’ అధినేత జాక్ మా మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. 56 సంవత్సరాల జాక్ మా సంపద ఏకంగా 45 శాతం పెరిగి 58.8 బిలియన్ డాలర్లకు చేరింది. అలీబాబా మంచి ఫలితాలు సాధించడంతోపాటు మా ఫిన్ టెక్ సంస్థ ‘యాంట్’ ఐపిఒ ఈ అసాధారణ పెరుగుదలకు దోహదపడింది. మరో టెక్ దిగ్గజం పోనీ మా (49) తన సంపదను ఏకంగా 50 శాతం పెంచుకొని 57.4 బిలియన్ డాలర్లతో జాక్ మాకు అత్యంత సమీపంలో నిలిచారు. వై.ఎస్.టి. అధినేత జోంగ్ షన్షాన్ (66) తొలిసారి టాప్ 3లోకి ప్రవేశించారు. ఆయన సంపద 53.7 బిలయన్ డాలర్లు.
2020-10-202020లో భారత స్థూల దేశీయోత్పత్తి 10.3% తగ్గిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్’ తాజా సంచికను ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసింది. 2020లో ఒక్క చైనా మినహా మిగిలిన దేశాలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. చైనా కూడా నామమాత్రపు వృద్ధి రేటు (1.9%)ను నమోదు చేస్తుందని, అమెరికా జీడీపీ 4.3% తగ్గుతుందని అంచనా వేసింది. 2021లో ఇండియా 8.8%, చైనా 8.2%, అమెరికా 3.1% చొప్పున వృద్ధి సాధిస్తాయని, మొత్తంగా ప్రపంచ జీడీపీ ఈ ఏడాది 4.4% తగ్గి వచ్చే ఏడాది 5.2% పెరుగుతుందని అంచనా.
2020-10-132020-21 సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పతనం లోతెంత? పలు రేటింగ్, పరిశోధనా సంస్థలు జీడీపీ 10.5 శాతం నుంచి 14.8 శాతం వరకు తిరోగమిస్తుందని అంచనా వేశాయి. తాజాగా ‘క్రిసిల్’ దేశ స్థూల ఉత్పత్తి 9 శాతం క్షీణిస్తుందని అంచనా కట్టింది. మే నెలలో ఈ సంస్థ అంచనా - 5 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్ - జూన్) కాలానికి జీడీపీ 23.9 శాతం క్షీణించినట్లు ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించిన నేపథ్యంలో... పూర్తి ఆర్థిక సంవత్సరానికి అనేక సంస్థలు తమ అంచనాలను సవరించాయి. గోల్డ్ మన్ శాచ్ జీడీపీ 14.8 శాతం క్షీణిస్తుందని పేర్కొంది.
2020-09-10భారత ఆర్థిక వ్యవస్థలో చీకటి అధ్యాయమిది. 2020-21 తొలి త్రైమాసికం (ఏప్రిల్ - జూన్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అసాధారణ స్తాయిలో 23.9 శాతం దిగజారింది. గత ఏడాది ఇదే కాలానికి జీడీపీ రూ. 35.35 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది 26.90 లక్షల కోట్లకు పడిపోయింది. భారత ప్రభుత్వ జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారం అధికారిక సమాచారాన్ని విడుదల చేసింది. 1980 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమించడం ఇదే తొలిసారి. అసలే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ‘కరోనా’తో కకావికలమైనట్లు ఈ డేటా స్పష్టం చేస్తోంది.
2020-08-31