రశీదులు లేకుండా బంగారాన్ని కొనుగోలు చేసినవారి కోసం ఓ సరికొత్త "క్షమాభిక్ష" పథకాన్ని కేంద్రం త్వరలో ప్రకటించబోతున్నట్టు సమాచారం. నల్ల ధనాన్ని చాలా మంది పెద్ద మొత్తంలో బంగారం రూపంలో దాచుకున్నట్టు చెబుతున్న ప్రభుత్వం, అలాంటి బంగారం నిల్వల విలువపై 30% పన్ను వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యా సుంకంతో కలిపి పన్ను మొత్తం 33% కావచ్చు. నల్ల ధనాన్ని బంగారంపై పెట్టుబడిగా పెట్టిన వాళ్లు ఈ పథకం ద్వారా పునీతులు కావాలని కేంద్రం సూచిస్తోంది.

2019-10-31 Read More

సెన్సెక్స్ మరోసారి 40,000 మార్కును దాటింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమయ్యాక సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 11,800 పైకి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లోని 11 రంగాల కొలమానాల్లో 8 పురోగమనంలో ఉండగా తిరోగమనంలో ఉన్న రంగాల్లో ఆటో ఇండెక్స్ ముందుంది. సెన్సెక్స్ పరుగులో భారతీ ఇన్ఫ్రాటెల్, ఇండియన్ ఆయిల్ గరిష్ఠంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు, ఎల్ అండ్ టి, ఐటిసి, భారతీ ఎయిర్ టెల్ కూడా లబ్దిదారుల జాబితాలో ఉన్నాయి.

2019-10-30 Read More

ఆంధ్రప్రదేశ్ రుణాలు, గ్యారంటీలపై గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ మరింత కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆరు విభాగాలు తిరిగి చెల్లించాల్సిన రుణ కిస్తీల గడువు దాటిపోయిందని ఆ లేఖలో హడ్కో పేర్కొంది. ఎపి టిడ్కో రూ. 134 కోట్లు, నెల్లూరు మునిసిపాలిటీ రూ. 40 కోట్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్పొరేషన్ రూ. 5.7 కోట్లు బకాయి పెట్టాయని ‘హడ్కో’ పేర్కొంది.

2019-10-30 Read More

జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విధించిన ఆంక్షలతో వ్యాపార వర్గాలు రూ. 10,000 కోట్లు నష్టపోయాయని ఆ రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు షేక్ ఆషిక్ చెప్పారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ఇందుకు ప్రధాన కారణంగా ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో ఆంక్షలు విధించి ఇప్పటికి మూడు నెలలవుతోందని, ఇప్పటికీ వ్యాపారం సాగడంలేదని, రాష్ట్రంలో అన్ని రంగాలూ తీవ్రంగా దెబ్బ తిన్నాయని ఆషిక్ చెప్పారు.

2019-10-27

దేశంలో ఆర్థిక మందగమనం ప్రభావం రైల్వేలను తీవ్రంగా ప్రభావితం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రవాణా చార్జీల్లో రూ. 3,901 కోట్లు, ప్రయాణీకుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయంలో రూ. 155 కోట్లు తగ్గింది. 2019 ఏప్రిల్-జూన్ కాలంలో సరుకు రవాణా ద్వారా రైల్వేలకు రూ. 29,067 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై-సెప్టెంబర్ కాలంలో అది రూ. 25,165 కోట్లకు తగ్గింది. ప్రయాణీకుల ద్వారా ఏప్రిల్-జూన్ కాలంలో రూ. 13,399 కోట్లు ఆదాయం రాగా, జూలై-సెప్టెంబర్ కాలంలో రూ. 13,244 కోట్లకు తగ్గింది.

2019-10-26 Read More

1991 విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సంక్షోభ సమయంలో భారతీయ రిజర్వు బ్యాంకు 67 టన్నుల బంగారాన్ని ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్’కు తాకట్టు పెట్టింది. మళ్లీ ఇంత కాలానికి రిజర్వు బ్యాంకు తన బంగారు నిల్వలనుంచి కొంత భాగాన్ని అమ్మేసింది. శుక్రవారం విడుదలైన రిజర్వు బ్యాంకు వారాంతపు గణాంకాల ప్రకారం... జూలై నెలనుంచి రిజర్వు బ్యాంకు 5.1 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసంది. అదే సమయంలో 1.15 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించింది.

2019-10-25 Read More

2019 ఆర్థిక సంవత్సరానికి అమెరికా బడ్జెట్ లోటు దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 71 లక్షల కోట్లు) పెరిగింది. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2012 నుండి ఇదే అతిపెద్ద లోటు. లోటును తగ్గిస్తానని, తొలగిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసినప్పటికీ అది మరింత పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన 12 నెలల కాలానికి బడ్జెట్ లోటు 26% పెరిగి 984 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2017 చివరిలో ఆమోదించిన రిపబ్లికన్ పన్ను తగ్గింపు ప్యాకేజీ ఈ లోటుకు కొంత వరకు కారణం.

2019-10-26

‘‘నాకు అన్నిచోట్లా బుడగలు కనిపిస్తున్నాయి’’.. నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ షిల్లర్ ప్రపంచ స్టాక్ మార్కెట్లపై వ్యక్తం చేసిన అభిప్రాయమిది. యేల్ యూనివర్శిటీ ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ షిల్లర్ బుధవారం లాస్ ఏంజెలిస్ నగరంలో ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ‘‘అహేతుక ఉత్సాహం’’ పేరిట ఇంతకు ముందే స్టాక్ మార్కెట్ల పతనంపై పుస్తకం రాసిన షిల్లర్, తాజాగా ‘‘నేరేటివ్ ఎకనామిక్స్’’ అనే పుస్తకాన్ని వెలువరించారు. 2000 సంవత్సరపు స్టాక్ మార్కెట్ల పతనాన్ని, 2007లో హౌసింగ్ మార్కెట్ పతనాన్ని షిల్లర్ ముందే అంచనా వేశారు.

2019-10-26 Read More

వాషింగ్టన్ నగరంలో శ్వేతసౌధానికి కూత వేటు దూరంలో ఉన్న ‘ట్రంప్ హోటల్’ను అమ్మబోతున్నారట! ఈ సంపన్న హోటల్ అమెరికా అధ్యక్షుడికి చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ చేతిలో ఉంది. ట్రంప్ దేశాధ్యక్షునిగా ఉండి ఈ ఆస్తినుంచి లాభం పొందుతున్నారని విమర్శలున్నాయి. నిజానికి ఈ హోటల్ భవనం ట్రంప్ సొంతం కాదు. అమెరికా ప్రభుత్వ భవనాన్ని ట్రంప్ సంస్థకు లీజుకిచ్చారు. ఈ లీజు హక్కులను ధారాదత్తం చేయడం ద్వారా ఇప్పుడు ట్రంప్ సంస్థకు 50 కోట్ల డాలర్లు (సుమారు రూ. 3,600 కోట్లు) వస్తాయని అంచనా.

2019-10-25 Read More

కార్పొరేట్ పన్నును సుమారు 10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడా కంపెనీలకు వరమైంది. దేశంలో అతిపెద్ద ఫండ్ హౌస్ అయిన హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లాభం ఏకంగా 79 శాతం పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభంలో వృద్ధి పన్ను చెల్లించక ముందు 44 శాతంగా ఉంటే, (తగ్గించిన) పన్ను చెల్లింపుల తర్వాత అది 79 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ రూ .3.6 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహించింది. ఇది ఏడాది క్రితం కంటే 25 శాతం ఎక్కువ.

2019-10-25 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page