ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సొంత వనరుల ద్వారా సమకూరే ఆదాయం గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి 7 (ఏప్రిల్ -అక్టోబర్) మాసాల్లో అన్ని శాఖల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 34,669.96 కోట్లు. గత ఏడాది ఇదే సమయానికి రూ. 35,411.23 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే పెరగవలసిన ఆదాయం నికరంగా 2.10 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల రూపంలో రూ. 75,438 కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ. 7,355 కోట్లు వస్తాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.

2019-11-07

ప్రపంచం అప్పు రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం పబ్లిక్, ప్రైవేటు మొత్తం అప్పు 188 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ. 13,350 లక్షల కోట్లు)గా ఉందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా చెప్పారు. ప్రపంచం మొత్తం చేస్తున్న ఉత్పత్తి విలువకు ఇది 230 శాతం. 2016లో 164 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ అప్పు కొద్ది కాలంలోనే అసాధారణంగా పెరిగింది. మొత్తం అప్పుల్లో ప్రైవేటు రంగం రుణాల వాటా ఎక్కువ. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తోందని క్రిస్టలినా చెప్పారు.

2019-11-07 Read More

ఊహించినట్టుగానే ఉల్లిపాయ ధర రూ. 100ను తాకింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలోని కొన్ని మార్కెట్లలో ఈ వారం ఉల్లి రిటైల్ ధర కేజీకి రూ. 100 పలికింది. దక్షిణ భారతంలోని చాలా మార్కెట్లలో కేజీకి రూ. 80 నుంచి 90 వరకు పలికింది. మహారాష్ట్రలోని హోల్ సేల్ మార్కెట్లలో కేజీ రూ. 55 చొప్పున అమ్ముడైనట్టు వ్యాపార వర్గాల సమాచారం. అయితే, వచ్చే 15 రోజుల్లో 3000 టన్నుల ఉల్లిపాయలు దిగుమతి అవుతున్నందున ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.

2019-11-07 Read More

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనల మధ్య... గురువారం ఓ సానుకూల పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో పరస్పరం విధించుకున్న దిగుమతి సుంకాలను దశలవారీగా ఎత్తివేయడానికి ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్టు చైనా వాణిజ్య శాఖ గురువారం తెలిపింది. అయితే, ఎప్పటిలోగా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంకోసం జరుగుతున్న చర్చల్లో సుంకాల రద్దు ప్రధానంగా ఉంది.

2019-11-07 Read More

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5 శాతానికి క్షీణించిన నేపథ్యంలో... జీడీపీ గణనకు ప్రామాణిక సంవత్సరాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జీడీపీ కొత్త సిరీస్ ప్రామాణిక సంవత్సరాన్ని 2011-12 నుంచి 2017-18కి మార్చే అంశంపై కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కొద్ది నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. 2017-18ను కొత్త బేస్ ఇయర్‌గా ప్రభుత్వం పరిశీలిస్తున్నా, నిపుణుల కమిటీలు తమ అభిప్రాయాన్ని ఖరారు చేయడానికి ముందు మరికొంత డేటా కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

2019-11-05 Read More

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఒబి) 2019-20 ద్వితీయ త్రైమాసికంలో రూ. 2,254 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వాటిల్లిన నష్టానికి (రూ. 487 కోట్లకు) ఇది సుమారు 5 రెట్లు. మొండి బకాయిలు అధికం కావడం ఇందుకు ప్రధాన కారణంగా బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2, 3 త్రైమాసికాల్లో ఈ మొండి బకాయిల తాత్కాలిక భారాన్ని చూపిస్తే మార్చి నాటికి మెరుగైన పరిస్థితి వస్తుందని బ్యాంకు ఎండి&సిఇఒ కర్ణం శేఖర్ చెబుతున్నారు.

2019-11-04 Read More

దేశీయ పరిశ్రమలు, రైతులు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో... ప్రాంతీయ సహకార ఆర్థిక భాగస్వామ్య (ఆర్.సి.ఇ.పి) ఒప్పందంలో చేరరాదని ఇండియా నిర్ణయించింది. చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లతో పాటు ‘ఆసియాన్’ దేశాలు భాగస్వాములుగా ఉన్న ఆర్.సి.ఇ.పి.లో చేరడానికి ఇండియా ఇప్పటిదాకా చర్చలు జరిపింది. అయితే, భారత ప్రయోజనాలకు అవసరమైన సవరణలు చేయకపోవడంతో ఒప్పందానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది.

2019-11-04 Read More

‘‘టాటా ట్రస్ట్స్’’ నిర్వహణలో ఉన్న 6 ట్రస్టుల గుర్తింపును ఆదాయ పన్ను శాఖ రద్దు చేసింది. ట్రస్టుల కార్యకలాపాలు ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’కు అనుగుణంగా లేనందున ఈ చర్య తీసుకున్నట్టు ఐటీ శాఖ రద్దు ఉత్తర్వులలో తెలిపింది. దీంతో.. టాటా సంస్థలు రూ. 12 వేల కోట్ల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుందని అంచనా. రద్దయిన సంస్థలలో... జంషెడ్జీ టాటా ట్రస్టు, ఆర్.డి. టాటా ట్రస్టు, టాటా ఎడ్యుకేషన్ ట్రస్టు, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్టు, సార్వజనిక్ సేవా ట్రస్టు, నవాజ్ బాయి రతన్ టాటా ట్రస్టు ఉన్నాయి.

2019-11-02

వచ్చే ఐదేళ్లలో ఇండియాలో పర్యావరణ అనుకూల పట్టణ రవాణాపై 1 బిలియన్ యూరోల మేరకు పెట్టుబడి పెట్టనున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు. భారతీయ కరెన్సీలో శనివారం నాటి మారకం విలువ ప్రకారం ఆ మొత్తం రూ. 7,914 కోట్లు. అందులో ఐదో వంతు (200 మిలియన్ యూరోలు) తమిళనాడులో బస్సులను సంస్కరించడానికి వినియోగించనున్నట్టు ఏంజెలా శనివారం చెప్పారు. ఢిల్లీ కాలుష్యంపై మాట్లాడుతూ...డీజిల్ బస్సులను మార్చి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని చెప్పారు.

2019-11-02

2024 నాటికి 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ‘కోల్ ఇండియా’ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. కోల్ ఇండియా సంస్థ 45వ వ్యవస్థాపక దినోత్సవాన మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం కోల్ ఇండియా వార్షిక ఉత్పత్తి లక్ష్యం 66 కోట్ల టన్నులని, దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బొగ్గులో అది 82 శాతంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కోల్ ఇండియా 2020-21 నాటికి 75 కోట్ల టన్నులు, 2023-24 నాటికి 100 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుందని మంత్రి వివరించారు.

2019-11-02 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page