గత ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా పంట నష్టానికి కారణమైన ఫాల్ ఆర్మీ వార్మ్ (కత్తెర పురుగు) ఈ ఏడాది (2019-20లో) ఉత్తరాదిలోనూ బీభత్సం చేస్తోంది. దేశం మొత్తంగా 7,18,226 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 2018-19లో దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో 5,06,107 హెక్టార్లలో పంట దెబ్బ తిన్నది. అప్పుడు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావాన్ని చూపింది. ఈసారి తమిళనాడు ఈ మహమ్మారి నుంచి తప్పించుకోగా మహారాష్ట్రకు ముప్పు పెరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు కొత్తగా ముంచుకొచ్చింది.
2019-12-10కేంద్ర ప్రభుత్వ ప్రధాన నినాదం ‘‘మేకిన్ ఇండియా’’. ఆచరణలో అడుగులు ముందుకు పడటంలేదు. రాజకీయంగా ప్రత్యర్ధిగా భావించే చైనా నుంచి అనేక ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఉదాహరణకు... 2018లో ఇండియా దిగుమతి చేసుకున్న ‘బల్క్ డ్రగ్స్’లో 66.53 శాతం చైనా నుంచే వచ్చాయి. 2016 దిగుమతుల్లో చైనా వాటా 56.62 శాతంగా ఉంటే తర్వాత సంవత్సరమే 68.62 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే మంగళవారం లోక్ సభలో వెల్లడించింది.
2019-12-102019-20 ఆర్థిక సంవత్సరం వస్తు సేవల పన్ను వసూళ్ల లక్ష్యానికి భారీగా గండి పడిండి. ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో నికరంగా రూ. 5,26,000 కోట్లు వస్తాయని బడ్జెట్ సమయంలో అంచనా వేయగా, వాస్తవంలో రూ. 3,28,365 కోట్లు మాత్రమే వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్ సభలో వెల్లడించారు. అంటే, లక్ష్యంలో 62.43 శాతం మాత్రమే వసూలయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ. 6,03,900 కోట్లు వస్తాయన్నది బడ్జెట్ అంచనా కాగా, వాస్తవంలో రూ. 4,57,534 కోట్లు (75.76%) వచ్చాయి.
2019-12-09పెద్ద నోట్ల రద్దు తర్వాత నకిలీ కరెన్సీ నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎంత చెప్పినా.. ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది. కొత్త రూ. 2000, రూ. 500 నోట్లకు పెద్ద మొత్తంలో నకిలీలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. 2017-18లో రూ. 500 నోట్లు 9,892, రూ. 2000 నోట్లు 17,929... 2018-19లో రూ. 500 నోట్లు 21,865, రూ. 2000 నోట్లు 21,847 పట్టుబడ్డాయి. 2019-20లో ఇప్పటిదాకా రూ. 500 నోట్లు 13,959... రూ. 2000 నోట్లు 7,435 పట్టుకున్నారు. పట్టుబడిన నకిలీ కరెన్సీ ఎంత ఉందో?!
2019-12-092019-20 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు 5 శాతానికి లోపే ఉంటుందని ‘ఐహెచ్ఎస్ మార్కిట్’ అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం తొలి అర్ద భాగంలో వృద్ధి రేటు కేవలం 4.75 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో 5 శాతం నమోదు కాగా... రెండో త్రైమాసికంలో మరింత దిగజారి 4.5 శాతానికి పరిమితమైంది. కొద్ది రోజుల క్రితమే రిజర్వు బ్యాంకు కూడా వృద్ధి రేటు అంచనాను 6.1 నుంచి 5 శాతానికి తగ్గించింది.
2019-12-08 Read Moreమార్కెట్ అంచనాలకు భిన్నంగా భారతీయ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతం వద్ద కొనసాగనున్నాయి. రెపో రేటు అంటే... వాణిజ్య బ్యాంకుల వద్ద నగదు తక్కువైనప్పుడు రిజర్వు బ్యాంకు ఇచ్చే నిధులపై వడ్డీ. గత సంవత్సర కాలంగా పలుమార్లు వడ్డీ రేట్లను తగ్గించినా... జీడీపీ వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. దీంతో మరోసారి వడ్డీ రేట్లు తగ్గుతాయని అంతా అంచనా వేశారు. అయితే, ఇటీవల ద్రవ్యోల్భణం 4.62 శాతానికి పెరగడాన్ని రిజర్వు బ్యాంకు పరిగణించింది.
2019-12-052019-20 ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి తగ్గనుందని సాక్షాత్తు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) అంచనా వేసింది. ఈమేరకు గతంలో తానే వేసిన అంచనా (6.1 శాతం)ను తగ్గించింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5 శాతానికి, రెండో త్రైమాసికంలో 4.5 శాతానికి వృద్ధి రేటు పడిపోయిన నేపథ్యంలో... గురువారం రిజర్వు బ్యాంకు తాజా అంచనాలను విడుదల చేసింది.
2019-12-05కేరళలోని 5 ప్రధాన నగరాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అధారిటీ (ఎదిఐఎ) ఆసక్తి చూపిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. కొచ్చి మెట్రో బ్లిస్ సిటీలో రూ. 1500 కోట్లు, మారిటైమ్ క్లస్టర్ లో రూ. 3500 కోట్లు, కన్నూరు ఏరోట్రోపోలిస్ లో రూ. 1000 కోట్లు, లాజిస్టిక్స్ పార్కులో రూ. 400 కోట్లు మేరకు పెట్టుబడి ప్రతిపాదనలపై జనవరినాటికి నిర్ణయం తీసుకోనున్నట్టు ఐడిఐఎ తెలిపిందని విజయన్ శుక్రవారం పేర్కొన్నారు.
2019-11-222019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) మరింత దారుణంగా ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) రీసెర్చ్ పేర్కొంది. ఆ కాలంలో వృద్ధి రేటు కేవలం 4.2 శాతంగా ఎస్.బి.ఐ. అంచనా వేసింది. తాము పరిగణించిన అంశాల్లో 33 ప్రధాన సూచీల వృద్ధి వేగం తొలి త్రైమాసికంలో 65 శాతంగా ఉంటే రెండో త్రైమాసికంలో అది 27 శాతానికి పడిపోయిందని రీసెర్చ్ సంస్థ తెలిపింది.
2019-11-12ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని సరిదిద్దే స్థితిలో ప్రభుత్వం లేకపోవడంతో ఇండియా క్రెడిట్ రేటింగ్ ప్రమాదంలో పడింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సంస్థ ఇండియా ‘క్రెడిట్ రేటింగ్’ను ‘స్టేబుల్ (స్థిరం)’ నుంచి ‘నెగెటివ్ (నిరాశపూరిత)’ స్థితికి తగ్గించింది. పెట్టుబడి గ్రేడులో మూడీస్ రేటింగ్ స్కేలులో ఉన్న 10 స్థాయిలలో చివరి నుంచి రెండవదైన Baa2కు ఇండియా పడిపోయింది. అప్పుల భారం పెరగడంతోపాటు బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడటాన్ని ‘మూడీస్’ ఎత్తి చూపించింది.
2019-11-08 Read More