ప్రభుత్వ రంగ సంస్థ ఎల్.ఐ.సి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,610.74 కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఎల్.ఐ.సి. ఛైర్మన్ ఎం.ఆర్. కుమార్ శుక్రవారం ఈ మొత్తాన్ని చెక్ రూపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అందించారు. ఆ సంవత్సరంలో ఎల్.ఐ.సి. రూ. 53,214 కోట్ల మిగులు విలువను సాధించింది. జీవిత బీమా మార్కెట్లో ఎల్.ఐ.సి. వాటా 76.28 శాతంగా ఉంది. తొలి ఏడాది ప్రీమియంలో ఈ వాటా 71 శాతం.

2019-12-27

భారతీయ ఉక్కు పరిశ్రమ మరోసారి ధరలు పెంచనుంది. జనవరిలో టన్నుకు రూ. 700 నుంచి రూ. 1000 వరకు ధరలు పెరుగుతాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు చెప్పారు. అంతర్జాతీయంగా ధర 60 నుంచి 70 డాలర్లకు పెరగడం, దేశీయ మార్కెట్లలో డిమాండ్ స్థిరంగా ఉండటంతో ధరలు పెంచనున్నారు. ఉత్పత్తిదారులు నవంబరులో టన్నుకు రూ. 500 నుంచి రూ. 750 వరకు, డిసెంబరులో రూ. 750 నుంచి 1000 వరకు ధరలు పెంచారు.

2019-12-25

ఇండియాలో జీడీపీ వృద్ధిని గణించడానికి అనుసరిస్తున్న పద్ధతులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బలమైన సందేహలను వ్యక్తం చేసింది. గత సిరీస్ కు భారీ సవరణలు, తక్కువ వ్యవధిలో సిరీస్ మార్చడం, ఉత్పత్తి కార్యకలాపాల జీడీపీకి.. వ్యయానికి మధ్య అంతరాలు ఉండటం వంటి అంశాలను ఐఎంఎఫ్ ఎత్తిచూపింది. 2011-11 ప్రామాణిక సంవత్సరంగా విడుదల చేసిన పూర్వపు సిరీస్ డేటాపై దేశీయంగా కూడా పెద్ద దుమారమే చెలరేగింది.

2019-12-25

పాత బకాయిల కింద తమకు రూ. 1,72,655 కోట్లు చెల్లించాలంటూ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు కేంద్ర టెలికం శాఖ లేఖ రాసింది. ‘గెయిల్’ కంపెనీ నికర విలువకు ఈ మొత్తం మూడున్నర రెట్లు ఉండటం విశేషం. 2002లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐపిఎస్) లైసెన్సు పొందిన గెయిల్, తాము ఆ లైసెన్సుతో ఏ వ్యాపారమూ చేయలేదంటోంది. అయితే, టెలికం శాఖ కేటాయించిన స్పెక్ట్రంను ఉపయోగించి నాన్ టెలికం రెవెన్యూ సంపాదించినా ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

2019-12-22

‘‘స్పష్టంగా... ఇది సాధారణ మందగమనం కాదు. ఇది ఇండియా మహా మందగమనం. ఆర్థిక వ్యవస్థ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్తోంది’’- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభిప్రాయం ఇది. హార్వార్డ్ యూనివర్శిటీలోని ‘సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్’ విశ్లేషణా పత్రంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పోగుబడ్డ నగదు బ్యాంకేతర ఆర్థిక సంస్థలకు, అక్కడినుంచి రియల్ ఎస్టేట్ సంస్థలకు చేరడాన్ని ఆయన విపులీకరించారు.

2019-12-14 Read More

భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి వంటి వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేవీ ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని కలిగించలేకపోయాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. వినియోగంలో డిమాండ్ బాగా బలహీనంగా ఉండగా... కార్పొరేట్ పన్ను తగ్గింపులు, బ్యాంకులకు ఉద్దీపన, మౌలిక సదుపాయాలపై వ్యయ ప్రణాళికలు, ఆటోమొబైల్ రంగానికి మద్ధతు వంటి చర్యలు సమస్యను పరిష్కరించలేకపోయాయని తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

2019-12-13

2019 కేలండర్ సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5.6 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సంస్థ తాజాగా అంచనా వేసింది. 2018లో వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంది. ఉపాధి వృద్ధి బాగా తక్కువగా ఉండటంతో వినియోగం బాగా మందగించిందని మూడీస్ తాజా నివేదికలో పేర్కొంది. 2020, 2021లలో జీడీపీ వృద్ధి రేటు మెరుగుపడుతుందని, ఆయా సంవత్సరాల్లో వరుసగా 6.6 శాతం, 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

2019-12-13

దేశ ఆర్థిక వ్యవస్థలో రోజూ చేదు వార్తలే... గురువారం మరో రెండు... అక్టోబరు మాసంలో పారిశ్రామికోత్పత్తి 3.8 శాతం తగ్గింది. నవంబరుకు సంబంధించిన వినిమయ ధరల సూచీ 5.54 శాతానికి పెరిగింది. ఇది అక్టోబరులో 4.62 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గత ఏడాది అక్టోబరులో 8.4 శాతం పెరిగితే ఈసారి పురోగమించకపోగా తిరోగమించడం గమనార్హం. అందులో తయారీ రంగం 8.2 శాతం దిగజారింది. విద్యుదుత్పత్తి ఏకంగా 12.2 శాతం తగ్గడం అసాధారణం. గత ఏడాది అక్టోబరులో విద్యుదుత్పత్తి 10.8 శాతం పెరిగింది.

2019-12-12

విభజిత రాష్ట్రాలు రెంటిలోనూ వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ. 50 కోట్ల చొప్పున నిధులు ఇస్తామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధానిని, దాంతో పాటే ఆదాయాన్ని కోల్పోయిన... అప్పుల్లో ఎక్కువ వాటాను మూటగట్టుకున్న బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో 7 జిల్లాల అభివృద్ధికోసం ఏటా రూ. 350 కోట్ల చొప్పున మూడేళ్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది. అదే సమయంలో తెలంగాణలో 9 జిల్లాలకు ఏటా రూ. 450 కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు నిధులు ఇచ్చింది.

2019-12-10

నవంబర్ మాసంలో ఆటోమొబైల్ అమ్మకాలు (టోకున) 12 శాతం పడిపోయాయి. పాసెంజర్ కార్లు, స్కూటర్లు, మోటార్ బైకుల సెగ్మెంట్లలో పతనం రేటు రెండంకెల్లో ఉంది. అయితే, కియా మోటార్స్ ‘సెల్టోస్’, మారుతి సుజుకి ‘విటారా బ్రెజ్జా’, ‘ఎర్టిగా’, హుండాయ్ మోటార్స్ ‘వెన్యూ’ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. తయారీదారుల సంఘం ‘సియామ్’ తాజా సమాచారం ప్రకారం ఈ నవంబరులో అన్ని కేటగిరిలలో కలిపి 17,92,415 వాహనాలు అమ్ముడయ్యాయి. 2018 నవంబరులో 20,38,007 వాహనాలు అమ్ముడయ్యాయి.

2019-12-10
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page