ఈ నెల 15వ తేదీన చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. స్వేతసౌధంలో జరిగే ఈ ఒప్పందం ‘‘చాలా పెద్దది, సమగ్రమైనది’’ అని ట్రంప్ మంగళవారం ట్వీటారు. ఈ కార్యక్రమానికి చైనా నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. తొలి దశ ఒప్పందంపై సంతకాలు ముగిశాక తాను చైనాకు వెళ్తానని, అక్కడ రెండో దశ ఒప్పందంపై చర్చిస్తామని వెల్లడించారు.

2020-01-01 Read More

2019లో జీడీపీ వృద్ధి రేటు, వినిమయం తిరోగమించాయి. 2020లో ఈ స్థితి మరింత తీవరిస్తుందని ‘బిజినెస్ స్టాండర్డ్’ సర్వేలో మెజారిటీ సీఈవోలు అభిప్రాయపడ్డారు. 50 కంపెనీల సీఈవోలతో సర్వే నిర్వహించగా.. అందులో 52 శాతం 2020లో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని అంచనా వేశారు. అధ్వాన దశ ముగిసిందని 42 శాతం చెప్పారు. అయితే, కేంద్ర బడ్జెట్ తో పరిస్థితిని చక్కదిద్దవచ్చని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

2020-01-01 Read More

దేశ ప్రజలకు కొత్త సంవత్సర కానుకగా రైల్వే శాఖ ఛార్జీల షాక్ ఇచ్చింది. సాధారణ నాన్ ఎసి రైళ్ళలో ప్రయాణంపై కిలోమీటరుకు ఒక్క పైసా చొప్పున, మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణంపై కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, ఎసి భోగీల్లో ప్రయాణంపై కిలోమీటరుకు నాలుగు పైసల చొప్పున ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు జనవరి 1వ తేదీనుంచే అమల్లోకి రానున్నాయి. సబర్బన్ రైళ్లలో ఛార్జీలు పెరగవు.

2019-12-31

2019లో చివరి రోజు కూడా స్టాక్ మార్కెట్ తిరోగమించింది. 30-ప్యాక్ బి.ఎస్.ఇ. సెన్సెక్స్ 304.26 పాయింట్లు తగ్గి 41,253.74 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 87.40 పాయింట్లు (0.71 శాతం) తగ్గి 12,168.45 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్, రియాల్టీతో పాటు ఇతర రంగాల సూచీలు కూడా తిరోగమించాయి. మంగళవారం లాభపడిన కంపెనీల్లో కోల్ ఇండియా, ఎన్.టి.పి.సి, గెయిల్ ముందుండగా... జీ ఎంటర్టైన్మెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో బాగా నష్టపోయాయి.

2019-12-31 Read More

వచ్చే ఐదేళ్ళలో రూ. 102 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు. ఆయా ప్రాజెక్టుల్లో 39 శాతం చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 22 శాతం ప్రైవేటు రంగం చేపడతాయని పేర్కొన్నారు. ఐదేళ్ళలో రూ. 100 లక్షల కోట్లను మౌలిక రంగాలపై వెచ్చించనున్నట్టు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోడీ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రణాళికను రూపొందించారు.

2019-12-31 Read More

‘నీతి ఆయోగ్’ సోమవారం ప్రకటించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్’ ర్యాంకులలో కేరళ తొలి స్థానంలో నిలిస్తే బీహార్ అట్టడుగున ఉంది. 16 లక్ష్యాలను పరిశీలించిన నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకులు కేటాయించింది. స్థూల ర్యాంకుల్లో 70 పాయింట్లతో కేరళ రాష్ట్రంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ ముందుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ 67 పాయింట్లతో తర్వాత స్థానంలో నిలిచాయి.

2019-12-30

2020లో మరింత మంది సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ చెల్లింపుల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందట. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ, యాంటీ వైరస్ బ్రాండ్ ‘కాస్పర్‌స్కీ’ పరిశోధకులు ఈమేరకు హెచ్చరిక జారీ చేశారు. సైబర్ నేర ప్రపంచంలో గత కొన్ని సంవత్సరాలుగా జె.ఎస్- స్కిమ్మింగ్ (ఆన్‌లైన్ స్టోర్ల నుండి చెల్లింపు కార్డు డేటాను దొంగిలించే పద్ధతి) విపరీతంగా ఆదరణ పొందిందని ‘కాస్పర్‌స్కీ’ పేర్కొంది. తస్మాత్ జాగ్రత్త.

2019-12-30

2019లో భారతీయ కంపెనీలు దేశీయ, విదేశీ మార్కెట్లనుంచి రూ. 8.68 లక్షల కోట్ల మేరకు నిధులను సమీకరించాయి. ఇది గత సంవత్సరం కంటే 20 శాతం అధికం. భారతీయ రుణ మార్కెట్ నుంచే రూ. 6.2 లక్షల కోట్లు సేకరించగా, సుమారు 1.2 లక్షల కోట్లు విదేశీ బాండ్ల ద్వారా సేకరించాయి. అయితే, 2020లో రుణ సేకరణ... మార్కెట్ స్థితి, ఆర్థిక వృద్ధి, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

2019-12-29 Read More

ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న కాలం కంటే మరో రెండేళ్లు అదనంగా పడుతుందట! అంటే... 2026 వరకు ఆగాలన్నమాట. యు.కె.కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ (సిఇబిఆర్) ఈమేరకు అంచనా వేసింది. 2026లోనే జర్మనీని అధిగమించి ఇండియా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని సిఇబిఆర్ తెలిపింది. మూడో స్థానానికి చేరడానికి మాత్రం 2034వరకు ఆగాల్సిందే!

2019-12-29

370 అధికరణ రద్దు సమయంలో కాశ్మీర్ లోనూ, ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం తర్వాత అనేక రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీనివల్ల అంతర్జాలంపై ఆధారపడిన వ్యాపారాలకు.. గంటకు రూ. 2.45 కోట్ల చొప్పున నష్టం వాటిల్లినట్టు టెలికం కంపెనీల అసోసియేషన్ తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ ఆధారిత ‘ఓలా’, ‘ఉబర్’, ‘జోమాటో’, ‘స్విగ్గీ’ వంటి సేవలకు అంతరాయం కలిగింది.

2019-12-29
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page