ఇరాన్ కమాండర్ హత్య తర్వాత యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అమెరికా స్టాక్ మార్కెట్ తిరోగమించింది. డౌ జోన్స్ 234 పాయింట్లు తగ్గింది. అయితే, ఒకే ఒక్క రంగంలోని స్టాక్స్ పెరిగాయి. ఆయుధ కంపెనీల్లో... నార్త్ కార్ప్ గ్రుమ్మాన్ స్టాక్స్ 5.5 శాతం పెరిగితే, లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ షేర్లు 3.69 శాతం పెరిగాయి. యుద్ధం వస్తే ఈ కంపెనీల అమ్మకాలు విపరీతంగా ఉంటాయి.
2020-01-04 Read Moreఇరాన్ టాప్ మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన ఘటన ఇండియా ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది. శుక్రవారం సులేమానీ హత్య తర్వాత ముడి చమురు ధరలు పెరిగాయి. రూపాయి విలువ డాలరుకు 71.61కి పడిపోయింది. గత నెల రోజుల్లో ఇదే కనిష్ఠం. ఇండియాలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల షేరు ధరలు తగ్గాయి. హెచ్.పి.సి.ఎల్. షేరు 2.5 శాతం, బి.పి.సి.ఎల్. ధర 1.6 శాతం తగ్గాయి. బి.ఎస్.ఇ. సెన్సెక్స్ శుక్రవారం 118 పాయింట్లు పడిపోయింది.
2020-01-04 Read Moreఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను తాము కొనుగోలు చేయనున్నట్టు అదానీ పోర్టుల కంపెనీ శుక్రవారం ప్రకటించింది. గౌతమ్ అదానీకి చెందిన ఈ కంపెనీ 75 శాతం వాటా కోసం రూ. 13,572 కోట్లు చెల్లించనుంది. కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ (కె.పి.సి.ఎల్)లో సివిఆర్ గ్రూపు చేతిలో మెజారిటీ వాటా ఉండగా, లండన్ కేంద్రంగా ఉన్న ప్రైవేటు ఈక్విటీ సంస్థ ‘3ఐ’ మైనారటీ వాటా కలిగి ఉంది. ఈ పోర్టును కలిపితే అదానీ పోర్టుల గ్రూపు మార్కెట్ వాటా 27 శాతానికి పెరుగుతుంది.
2020-01-04 Read More2020 ప్రారంభంలో వాల్ స్ట్రీట్లో స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. గురువారం మూడు ప్రధాన ఇండెక్స్ రికార్డు స్థాయికి చేరాయి. తన ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు చైనా తీసుకుంటున్న ఉద్ధీపన చర్యలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం పరిష్కార దిశగా సాగడం వంటి పరిణామాలు ఈ సానుకూలతకు కారణాలు. చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందం 15న కుదురుతుందని, తర్వాత తాను చైనా వెళ్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
2020-01-02 Read Moreమూడు రాష్ట్రాల్లోని 7 కొత్త ఆయిల్, గ్యాస్ క్షేత్రాల కాంట్రాక్టులపై ప్రభుత్వ రంగ సంస్థ ఒ.ఎన్.జి.సి. గురువారం సంతకాలు చేసింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో 5 క్షేత్రాలకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక క్షేత్రానికి ఎవరూ పోటీ బిడ్ దాఖలు చేయలేదు. రాజస్థాన్ లోని ఒక బ్లాకుకు ఒకే బిడ్డర్ పోటీ రాగా అది కూడా ఒ.ఎన్.జి.సి.కే దక్కింది. ఈ 7 బ్లాకులతో మరో 18,510 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూమి కంపెనీ పరిధిలోకి వచ్చింది.
2020-01-02 Read Moreదేశంలో అనేక రంగాల తరహాలోనే ఇంథన సరఫరా కూడా తిరోగమనంలో ఉంది. డిసెంబరులో సరఫరా గత ఏడాది కంటే 1.1 శాతం తగ్గింది. 2018 డిసెంబరులో 103.04 బిలియన్ యూనిట్లు సరఫరా చేయగా 2019 డిసెంబరులో 101.92 బిలియన్ యూనిట్లు సరఫరా అయింది. వరుసగా ఐదో నెల తిరోగమనం నమోదైంది. పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అక్టోబరులో 12.8 శాతం, నవంబరులో 4.2 శాతం తగ్గింది.
2020-01-02 Read Moreగురువారం ఉదయం మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. 117.44 పాయింట్ల పెరుగుదలతో స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో అమెరికన్ డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గింది. 11 పైసలు పడిపోయి డాలరుకు రూ. 71.33 వద్ద వాణిజ్యం ప్రారంభమైంది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 3 శాతం పడిపోగా, బెంచ్ మార్కు సెన్సెక్స్ 6.81 శాతం పెరిగింది.
2020-01-02హ్యూండాయ్ మోటార్ ఇండియా కంపెనీ కార్ల అమ్మకాలు డిసెంబరులో 9.9 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే మాసంలో 55,638 యూనిట్లు అమ్ముడుపోగా ఈసారి ఆ సంఖ్య 50,135కు తగ్గింది. దేశీయంగా గత డిసెంబరులో 42,093 యూనిట్లు అమ్ముడైతే ఈసారి 37,953కు తగ్గాయి. దేశీయ అమ్మకాలు 9.8 శాతం తగ్గితే.. ఎగుమతులు 10.06 శాతం తగ్గాయి. 2018 డిసెంబరులో ఎగుమతులు 13,545 యూనిట్లు కాగా ఈసారి 12,182కి పడిపోయాయి.
2020-01-01 Read Moreవస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళ వృద్ధి రేటు జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. 2018 డిసెంబరు కంటే 2019 డిసెంబరులో అధికంగా వసూలైన మొత్తం తెలంగాణలో 13 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 శాతం. అదే సమయంలో జాతీయ సగటు వృద్ధి 16 శాతంగానూ మహారాష్ట్రలో 22 శాతంగానూ, గుజరాత్ రాష్ట్రంలో 18 శాతంగానూ ఉంది. దక్షిణాదిన కర్నాటక మాత్రమే తక్కువ (ఏపీతో సమానంగా 11 శాతం) వృద్ధిని నమోదు చేసింది. కేరళలో 17 శాతం, తమిళనాట 19 శాతం వృద్ధి నమోదైంది.
2020-01-012019 చివరి మాసంలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు లక్ష కోట్లు దాటాయి. 2018 డిసెంబరులో రూ. 94,726 కోట్లు రాగా, ఈసారి 1,03,184 కోట్లు వసూలయ్యాయి. అందులో సి.జి.ఎస్.టి. 19,962 కోట్లు, ఎస్.జి.ఎస్.టి. 26,792 కోట్లు కాగా, ఐ.జి.ఎస్.టి. 48,099 కోట్లు. మరో రూ. 8,331 కోట్లు సెస్ రూపంలో వచ్చాయి. వృద్ధి రేటు 8.93 శాతం. 2019-20లో నెలకు లక్ష కోట్లు దాటడం ఇది ఆరోసారి. ఏప్రిల్ మాసంలో అత్యధికంగా రూ. 1,13,865 కోట్లు వసూలయ్యాయి.
2020-01-01 Read More