2019-20 ఆర్థిక సంవత్సరం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ధరల్లో 7.53 శాతం పెరుగుతుందని అంచనా. 1975-76 తర్వాత నామినల్ జీడీపీ వృద్ధి రేటు ఇంత తక్కువ నమోదు కావడం తొలిసారి అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత ధరల్లో (నామినల్) జీడీపీ సింగిల్ డిజిట్లో నమోదు కావడం 2002-03 తర్వాత తొలిసారి. వాస్తవ జీడీపీ వృద్ధి రేటు (స్థిర ధరల్లో) కేవలం 5 శాతం ఉంటుందని అంచనా. ఇదీ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటితో పోల్చదగినది.
2020-01-08 Read Moreమోర్గాన్ స్టాన్లీ సేల్స్ అండ్ ట్రేడింగ్ సంస్థ (అమెరికా) ప్రకటించిన ప్రపంచ టాప్ 20 స్టాక్స్ లో ‘మారుతి సుజుకి ఇండియా’ చోటు దక్కించుకుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఈ దిగ్గజ కార్ల సంస్థ ముందుంటుందని మోర్గాన్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రగతి మార్గంలో ఉన్న కంపెనీల జాబితాలో మారుతికి మాత్రమే చోటు దక్కింది. ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ తిరోగమనంలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ... ఈ పరిస్థితి మారితే ‘మారుతి’ లాభపడుతుందని తెలిపింది.
2020-01-072008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపింది. ఆ ఏడాది స్థూల జాతీయోత్పత్తి కేవలం 3.1శాతం పెరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు దానితో పోల్చదగినంత తక్కువ స్థాయిలో వృద్ధి రేటు నమోదు కానుంది. కేంద్ర ప్రభుత్వ గణాంక శాఖ మంగళవారం వెల్లడించిన అంచనా ప్రకారం జీడీపీ వృద్ధి 5 శాతం ఉండొచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో ఉద్ధీపన చర్యలను ప్రకటించే అవకాశం ఉంది.
2020-01-072019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు 5 శాతం లోపేనని అనేక సంస్థలు అంచనా వేశాయి. ఇప్పుడు స్వయంగా భారత ప్రభుత్వం కూడా తన అంచనాను 5 శాతానికి తగ్గించింది. 11 సంవత్సరాల్లో ఇదే కనిష్టం కానుంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5 శాతం, రెండో త్రైమాసికంలో ఇంకా తగ్గి 4.5 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. 2018-19లో సవరించిన లెక్కల ప్రకారం వృద్ధి రేటు 6.8%.
2020-01-07 Read Moreస్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై జిల్లాకో వడ్డీ రేటు వద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాంకర్లతో చెప్పారు. 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో 12 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారని వారి దృష్టికి తెచ్చారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని మంగళవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్.ఎల్.బి.సి) 209వ సమావేశంలో సిఎం కోరారు. సంఘాలకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, వడ్డీకి ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు.
2020-01-07సోమవారం స్టాక్ మార్కెట్లలోనూ రక్తపాతం జరిగింది. యుద్ధ భయంతో అమ్మకాలు పెరిగి... ఎస్ అండ్ పి బి.ఎస్.ఇ. సెన్సెక్స్ 826 పాయింట్లు (2 శాతం) పతనమైంది. బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4 శాతం), ఏషియన్ పెయింట్స్ (3 శాతం) తగ్గాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 242 పాయింట్లు (1.9 శాతం) పతనమైంది. ఇరాక్ పైన ఆంక్షలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళన నెలకొంది.
2020-01-06 Read Moreటాటా సన్స్ ఛైర్మన్ పదవి లేదా టిసిఎస్ డైరెక్టర్ పదవి తీసుకోవడానికి తాను ప్రయత్నించడంలేదని సైరస్ మిస్త్రీ ఆదివారం ప్రకటించారు. మిస్త్రీ తొలగింపునకు వ్యతిరేకంగా జాతీయ కంపెనీల లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.ఎ.టి) ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ ఉత్తర్వులను టాటా సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హియరింగ్ జరగాల్సి ఉండగా... మిస్త్రీ ఈ ప్రకటన చేశారు. అయితే, మైనారిటీ వాటాదారుల హక్కుల పరిరక్షణకోసం పని చేస్తానని మిస్త్రీ పేర్కొన్నారు.
2020-01-05రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. ఫలితంగా అభివృద్ధిపై వ్యయాన్ని ప్రభుత్వం నిలిపేసింది. రాష్ట్ర ఆదాయం ఏటా పెరగవలసింది పోయి ఈసారి గత ఏడాది కంటే భారీగా తగ్గుదల నమోదైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో (నవంబర్ వరకు) వివిధ రూపాల్లో రాష్ట్ర ఖజానాలో పడిన సొమ్ములు రూ. 1,08,700 కోట్లు కాగా, 2019-20లో కేవలం రూ. 98,790 కోట్లు. గత ఏడాది కంటే ఇంత తగ్గడం ఆందోళనకరం.. ఆశ్చర్యం కూడా!
2020-01-05విభజన రాజకీయాలు భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాయని, ఇటువంటి విభజనలు దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు ఉద్ఘాటించారు. "ఇక్కడ రాజకీయ పరిస్థితి చాలా విభజించబడింది. అది (విభజన) ఆర్థిక వ్యవస్థకు ఏమి చేస్తుందోనని నేను భయపడుతున్నాను’’ అని కోల్ కతలో ఏర్పాటు చేసిన ఫిక్కీ కార్యక్రమంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
2020-01-04 Read Moreఆర్థిక వ్యవస్థపై అనేక చేదు వార్తల మధ్య ఓ మంచి వార్త ఇది. విదేశీ మారక నిల్వలు డిసెంబరు చివరి వారంలో గణనీయంగా పెరిగాయి. 27వ తేదీతో ముగిసిన వారంలో 2.52 బిలియన్ డాలర్లు పెరిగి 457.468 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ పెరుగుదల ప్రధానంగా కరెన్సీ ఆస్తుల్లోనే కనిపిస్తోంది. కరెన్సీ అసెట్స్ 2.203 బిలియన్ డాలర్లు పెరిగి 424.936 బిలియన్ డాలర్లకు చేరుకోగా... బంగారం నిల్వలు 260 మిలియన్ డాలర్ల మేరకు పెరిగి 27.392 బిలియన్ డాలర్లకు చేరాయి.
2020-01-03 Read More