సోమవారం మార్కెట్లో ఓ గుడ్ న్యూస్. రూపాయి విలువ అమెరికన్ డాలరుతో పోలిస్తే కొద్దిగా పెరిగింది. డాలరు విలువ రూ. 70.79 వద్ద సోమవారం ఉదయం వాణిజ్యం ప్రారంభమైంది. అది గత వారాంతం కంటే 14 పైసలు తక్కువ. జనవరి 3న డాలరుకు రూ. 71.80 వద్ద ముగిసిన రూపాయి విలువ గత 10 రోజుల్లో క్రమంగా పెరిగింది.

2020-01-13

ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కావాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని ఆర్థికవేత్తలు చెబుతుంటే.. హోంమంత్రి అమిత్ షా మాత్రం 2024 నాటికి అయి తీరుతుందని చెబుతున్నారు. శనివారం గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జిటియు) స్నాతకోత్సవంలో షా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితి (మందగమనం) తాత్కాలికమేనని షా అభిప్రాయపడ్డారు. ఇండియా తొలి 70 సంవత్సరాలలో $2 ట్రిలియన్లకు మాత్రమే చేరిందని పేర్కొన్నారు.

2020-01-11

జమ్మూ-కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీస్తూ.. కేంద్రం విధించిన ఆంక్షలతో ప్రజలు కష్టాల పాలయ్యారు. ఆగస్టు 5 నుంచి 120 రోజుల్లో కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు రూ. 17,878 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కెసిసిఐ) అధ్యయనంలో తేలింది. ఇంకా బాధాకరమైన విషయం ఏమంటే... 4.96 లక్షల మంది కశ్మీరీలు ఉద్యోగాలు కోల్పోయారు.

2020-01-11

లగ్జరీ కారు లంబోర్గినిని దక్షిణాది సంపన్నులు బాగా ప్రేమిస్తున్నారు! దేశం మొత్తం మీద జరిగిన అమ్మకాల్లో దక్షిణాది వాటా 50 శాతం పైనే ఉందని కంపెనీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ శనివారం చెప్పారు. ఉత్తరాదిన ముంబై, ఢిల్లీలలో కంపెనీ షోరూంలు ఉన్నాయి. దక్షిణాదిన ఒక్క బెంగళూరులోనే ఉంది. దక్షిణాది మార్కెట్ మిగిలిన దేశంకంటే వేగంగా పెరుగుతోందని అగర్వాల్ చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఐటి హబ్స్ పెట్టుబడులు ఇందుకు కారణంగా చెప్పారు.

2020-01-11 Read More

రూ. 1.4 లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ పన్ను రాయితీ ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు లోటు భర్తీ కోసం మరోసారి రిజర్వు బ్యాంకుపై పడుతోంది. చివరి త్రైమాసికంలో ప్రభుత్వం వ్యయంపై 25 శాతం పరిమితి పెట్టుకుంది. దీనివల్ల వ్యయం రూ. 2.2 లక్షల కోట్లు తగ్గుతుంది. అయినా చాలదు. అందుకే... బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని ఆర్.బి.ఐ.ని కోరబోతోంది. ఇప్పటికే రిజర్వు బ్యాంకు మిగులు నిధులు రూ. 1.48 లక్షల కోట్లను ప్రభుత్వానికి ఇచ్చింది.

2020-01-11

కేంద్ర బడ్జెట్ వేళ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆర్థికవేత్తలు, పరిశ్రమ నిపుణులతో సమావేశమయ్యారు. $5 ట్రిలియన్ ఎకానమీపై చర్చించారు. ఈ సమావేశంలో హోం, వాణిజ్యం, రహదారుల శాఖల మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ ఉన్నారు. అయితే, అసలు (ఆర్థిక) మంత్రి నిర్మలా సీతారామన్ లేరు. కాంగ్రెస్ ఎం.పి. శశి థరూర్ సరిగ్గా ఈ ప్రశ్నే లేవనెత్తారు. ‘‘ఆర్థిక మంత్రి ఎక్కడ? ఆ మంత్రి ఉన్నారని ఈ ఇద్దరూ (మోడీ, షా) మరచిపోయారా’’ అని థరూర్ ప్రశ్నించారు.

2020-01-09

మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల ప్రజలను మరింత బాధించే అంశం. రిటైల్ ద్రవ్యోల్భణం 4 శాతానికి పరిమితం కావాలన్నది రిజర్వు బ్యాంకు మధ్యంతర లక్ష్యం కాగా వాస్తవంలో 6.2 శాతానికి పెరిగినట్టు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గత ఐదేళ్ళలో ఇదే అత్యధికం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కూరగాయల ధరలు. జనవరి 3-8 తేదీల్లో ‘రాయిటర్స్’ 50 మంది ఆర్థికవేత్తల అంచనాలను సేకరించింది. ద్రవ్యోల్భణం 7.01 శాతం ఉండొచ్చని కొందరి అంచనా.

2020-01-09 Read More

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొద్దిగా తగ్గిన సూచనలు స్టాక్ మార్కెట్లలో ప్రతిబింబించాయి. గురువారం ఉదయం బి.ఎస్.ఇ. సెన్సెక్స్ 1.1 శాతం పెరుగుదలతో ప్రారంభమైంది. ఎస్&పి బి.ఎస్.ఇ. సెన్సెక్స్ 448 పాయింట్లు పెరిగి 41,250కి చేరింది. నిఫ్టీ 50 కూడా 133 పాయింట్లు పెరిగి 12,150 స్థాయికి చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ల్యాండ్, భారతీ ఎయిర్ టెల్ 2 శాతం చొప్పున పెరిగాయి.

2020-01-09 Read More

భారత ఆర్థిక వృద్ధి మందగిస్తున్న వేళ బంగ్లాదేశ్ జీడీపీ 7 శాతం పైగా పెరగనుండటం విశేషమే. ఆ దేశ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 2019-20లో 7.2 శాతం, తర్వాత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల్లో పేర్కొంది. గత జూన్ నాటి అంచనా కంటే కొంచెం తగ్గినా ఇండియాతో పోలిక మాత్రం లేదు. దక్షిణాసియాలో బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంటే.. పాకిస్తాన్ అధ్వానంగా ఉంది. పాక్ ఆర్థిక వృద్ధి ఈ రెండేళ్లలో కేవలం 2.4, 3.0 శాతమే ఉంటుందని అంచనా.

2020-01-09

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు సవరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధి కేవలం 5 శాతం ఉంటుందని తాజా ‘‘వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్’’లో పేర్కొంది. ఈ మందగమనాన్ని ఇప్పటికే చాలా మంది ఊహించారు. అయితే, 2020-21లో జీడీపీ 5.8 శాతమే పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు చెప్పడం గమనించదగ్గ అంశం. వచ్చే ఏడాదన్నా మెరుగుపడుతుందని ఆశిస్తున్న ఇండియన్లకు ఈ అంచనా ఆందోళన కలిగిస్తోంది.

2020-01-09
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page