2019లో చైనా జీడీపీ 6.1 శాతం పెరిగిట్టు ఆ దేశ గణాంకాల బ్యూరో శుక్రవారం ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇండియా వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమవుతుందన్న అంచనాల మధ్య చైనా జీడీపీ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. అయితే, గత 29 సంవత్సరాల్లో చైనాలో ఇదే అతి తక్కువ వృద్ధి రేటు. జీడీపీ 6-6.5 శాతంగా ఉండాలని చైనా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగానే ఉంది.
2020-01-17విదేశీ పెట్టుబడుల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు రానుంది. దీనికి సంబంధించి 40 పేజీల ముసాయిదా సిద్ధమైంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పునరుత్పాదక ఇంథన ప్రాజెక్టుల పీపీఎలను రద్దు చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో అవిశ్వాసాన్ని తొలగించడం అనివార్యంగా కేంద్రం భావించింది. వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా వృద్ధి రేటును పెంచుకోవడం లక్ష్యాలుగా కొత్త బిల్లు రూపొందింది.
2020-01-15 Read Moreఆర్థిక మందగమనం ప్రజల ఆదాయాలను దెబ్బ తీస్తుంటే.. ధరల పోటు మరింత బాధిస్తోంది. 2019 డిసెంబరులో రిటైల్ ధరల సూచీ జాతీయ సగటు 7.35 శాతం ఉంటే... ఒడిషా, తెలంగాణలలో ఏకంగా 9.4 శాతం ఉంది. 2018 డిసెంబరులో తెలంగాణలో ధరల పెరుగుదల దాదాపు శూన్యం. ఇక సోదర తెలుగు రాష్ట్రం ఏపీ తక్కువేం కాదు. ధరల సూచీ 2018లో ‘మైనస్’లో ఉంటే 2019 డిసెంబరులో ప్లస్ 8 శాతంగా నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్భణం బీహార్లో మాత్రమే గత ఏడాదితో దాదాపు సమానంగా ఉంది.
2020-01-152019-20 తొలి 9 నెలల్లో ఇండియా సరుకుల ఎగుమతులు తగ్గాయి. ఏప్రిల్- డిసెంబర్ కాలంలో 239.29 బిలియన్ డాలర్ల విలువైన సరుకు ఎగుమతులు జరిగాయి. ఇది గత ఏడాది కంటే 1.96 శాతం తక్కువ. అయితే, దిగుమతులు 8.90 శాతం తగ్గాయి. వాణిజ్యం తగ్గుదల ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తోంది. సర్వీసుల ఎగుమతులు 5.66 శాతం, దిగుమతులు 7.49 శాతం పెరిగాయి. సరుకు వాణిజ్యంలో 118.10 బిలియన్ డాలర్ల లోటు నెలకొంటే...సర్వీసులలో 60.44 బిలియన్ డాలర్ల మిగులు వచ్చింది.
2020-01-15జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యు.ఎఫ్.బి.యు), ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ (ఐబిఎ) మధ్య వేతన సవరణ చర్చలు విఫలమయ్యాయి. ఫోరం 15 శాతం పెంపు అడిగితే ఐబిఎ 12.25 శాతానికి పరిమితం చేసినట్టు సమాచారం. సమస్యలు పరిష్కారం కాకపోతే మార్చి 11-13 తేదీల్లోనూ, ఏప్రిల్ 1 నుంచి నిరవధికంగానూ సమ్మె చేస్తామని ఫోరం నేత ఒకరు తెలిపారు.
2020-01-15 Read More‘మేకిన్ ఇండియా’ అని మైకులో చెప్పి... చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని వాట్సాప్ లో ఎంత మొత్తుకున్నా... ఎగుమతులు పెరగలేదు. 2019 ఆర్థిక సంవత్సరం చైనాతో మన వాణిజ్య లోటు 56.77 బిలియన్ డాలర్లు (రూ. 4.08 లక్షల కోట్లు). ఇండియా ఎగుమతులు కేవలం 17.95 బిలియన్ డాలర్లు కాగా దిగుమతులు 74.72 బిలియన్ డాలర్లు. ద్వైపాక్షిక వాణిజ్యం 2018లో 95.7 బిలియన్ డాలర్లు కాగా... రెండు దేశాల్లో ఆర్థిక వృద్ధి మందగించడంవల్ల 2019లో 92.68 బిలియన్ డాలర్లకు తగ్గింది.
2020-01-14ఆర్థిక మాంద్యంతో దేశంలో ఉద్యోగాలకు భారీగా కోత పడుతోంది. 2018-19లో కంటే ఈ ఏడాది కొత్త ఉద్యోగాల సంఖ్య 16 లక్షలు తగ్గుతోందని ఎస్.బి.ఐ. రిసెర్చ్ సోమవారం తెలిపింది. ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ) గణాంకాల ప్రకారం గత ఏడాది 89.7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది. ఇ.పి.ఎఫ్.ఒ. డేటా ప్రధానంగా... నెల జీతం రూ. 15,000 మించని ఉద్యోగాలను చూపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, ఎన్.పి.ఎస్. పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగాలు ఈ డేటాలో ఉండవు.
2020-01-13 Read Moreరిటైల్ ధరల సూచీ అమాంతం 7.35 శాతానికి పెరగడంలో ప్రధాన పాత్ర కూరగాయలదేనని జాతీయ గణాంక సంస్థ పేర్కొంది. 2018 డిసెంబరుతో పోలిస్తే 2019 డిసెంబరులో కూరగాయల విభాగంలో ద్రవ్యోల్భణం 60.5 శాతం పెరిగింది. అందులో ప్రధానంగా ఉల్లిపాయల వాటా ఎక్కువ. గత నెలలో ఉల్లి ధర రూ. 100 దాటిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం ఆహార విభాగంలో ద్రవ్యోల్భణం మార్పు 2018 డిసెంబరులో మైనస్ 2.65 శాతం కాగా, గత డిసెంబరులో 14.12 శాతం పెరిగింది.
2020-01-13ఆర్థిక మాంద్యం ప్రభావంతో గిలగిలలాడుతున్న ప్రజలకు ధరల భారం అధికమైంది. జాతీయ గణాంక సంస్థ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం... డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్భణం 7.35 శాతానికి పెరిగింది. గత ఐదున్నరేళ్ళలో ఇదే అత్యధికం. 2018 డిసెంబరులో వినిమయ ధరల సూచీ (సిపిఐ) కేవలం 2.11 శాతం ఉంటే 2019 నవంబరులో 5.54 శాతంగా ఉంది. డిసెంబరుకు రిజర్వు బ్యాంకు లక్షిత స్థాయినే కాకుండా ఆర్థికవేత్తల అంచనాలను కూడా దాటిపోయింది.
2020-01-13పెట్రోలు లీటరుకు 10 పైసలు, డీజిల్ లీటరుకు 5 పైసలు చొప్పున ధర తగ్గింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు సడలడంతో నిన్న కూడా స్వల్పంగా ధరలు తగ్గాయి. ధరలు తగ్గాక పెట్రోలు ఢిల్లీలో రూ. 75.80 ఉంది. ముంబయిలో రూ. 81.39, కోల్ కతలో రూ. 78.38, చెన్నైలో రూ. 78.76గా ఉంది. డీజిల్ ధర ఢిల్లీలో 69.06, ముంబైలో రూ.72.42, కోల్ కతలో రూ. 71.43, చెన్నైలో రూ. 72.99గా ఉంది.
2020-01-13