బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తాజాగా రూ. 233 లక్షల కోట్లు దాటింది. బుధవారం వాణిజ్యం ముగిసే సమయానికి మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 2,33,06,440.17 కోట్లకు చేరింది. ఇది జీవిత కాల గరిష్టం. భారత జీడీపీ కంటే ఎక్కువ. నిజ ఆర్థిక వ్యవస్థ క్షీణించినా స్టాక్ మార్కెట్ అసాధారణంగా పెరిగింది. ఆశావహ సెంటిమెంట్లు దీనికి కారణమంటున్నారు. తాజాగా బుధవారం బిఎస్ఇ సెన్సెక్స్ 134.32 పాయింట్లు పెరిగి 52,904.05 వద్ద ముగిసింది. మంగళ, బుధవారాల్లో మదుపరుల సంపద రూ. 1,42,806.24 కోట్లు పెరిగింది.

2021-07-14

జూన్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ళు రూ. 92,849 కోట్లకు పరిమితమయ్యాయి. గత 10 నెలల్లో ఇదే అత్యల్పం. ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ. 1.41 లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ. 1.02 లక్షల కోట్లకు తగ్గాయి. కరోనా రెండో వేవ్ ప్రభావంతో జూన్ నెలలో వసూళ్ళు మరింతగా తగ్గాయి. అయితే, ఊహించిన తగ్గుదల కంటే ఇది మెరుగేనని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది జూన్ నెలతో పోల్చితే, ఈ ఏడాది జూన్ 5 నుంచి జూలై 5 వరకు వసూలైన మొత్తం 2 శాతం ఎక్కువ.

2021-07-06

కరోనా సెకండ్ వేవ్ వల్ల కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ. ‘‘6,28,993 కోట్ల ప్యాకేజీ’’ని ప్రకటించింది. అందులో రుణ గ్యారెంటీ పథకాలే ప్రధానంగా ఉన్నాయి. ఇంతకు ముందే ప్రకటించిన బియ్యం పంపిణీ కొనసాగింపు, ఎరువుల సబ్సిడీ పెంపు వ్యయాలను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా చూపించారు. అయితే, ఈ ప్యాకేజీతో ప్రత్యక్షంగా ఒనగూరే ప్రయోజనాలు, ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు పరిమితమని ఆర్థికవేత్తలు అంటున్నారు. మరిన్ని ఉద్దీపన చర్యలు అవసరమని గట్టిగా చెబుతున్నారు.

2021-06-28

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 8 కొత్త పథకాలను ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికంటూ రూ. లక్షా 10 వేల కోట్లతో కొత్త రుణ గ్యారంటీ పథకాన్ని, గతంలో ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఉన్న ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకానికి అదనంగా రూ. లక్షన్నర కోట్లను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకోసం రూ. 50 వేల కోట్ల మేరకు రుణ సదుపాయం కల్పిస్తారు. దీనిపై వడ్డీ 7.95 శాతం. ఇతర రంగాలకు ఇచ్చే మరో రూ. 60 వేల కోట్ల రుణాలపై 8.25 శాతం వడ్డీ ఉంటుంది.

2021-06-28 Read More

‘స్టాట్యూ ఆఫ్ లిబరేషన్’ వద్దకు పర్యాటకాన్ని పెంపొందించడానికి గుజరాత్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ట్రావెల్ ఏజెన్సీలకు టూరిజం కార్పొరేషన్ ఆఫ్ గుజరాత్ లిమిటెడ్ (టిసిజిఎల్) 15 శాతం కమిషన్ ఆఫర్ చేస్తోంది. కార్పొరేషన్ అధికారి అజిత్ కుమార్ శర్మ సోమవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా ఏజెంట్లతో కాకినాడలో సమావేశమయ్యారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పర్యాటకాన్ని పెపొందిస్తే, అందుకు ప్రతిగా ఏపీలోని ద్రాక్షారామం, పిఠాపురం శక్తి పీఠాలకు తమ వైపు నుంచి సహకరిస్తామని శర్మ చెప్పారు.

2021-03-30 Read More

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద పెంపులో సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్... ఇలా అన్నిటినీ ఆక్రమిస్తున్న ఈ అభినవ కుబేరుడు 2021లో ఇప్పటిదాకా $ 16.2 బిలియన్ అదనంగా సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఈ ఏడాది అత్యధికంగా లాభపడిన వ్యక్తి అదానీ కావడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన జెఫ్ బెజోస్, ఎలోన్ ముస్క్ ఈ విషయంలో అదానీ ముందు దిగదుడుపే. తాజా లాభంతో అదానీ సంపద 50 బిలియన్ డాలర్లు దాటింది.

2021-03-12

దేశంలో కోట్లాది మందిని కరోనా దారిద్య్రంలోకి నెట్టిందనే అధ్యయనాల మధ్య స్టాక్ మార్కెట్ అసాధారణంగా పెరగడం, సెన్సెక్స్ 50,000 పాయింట్లకు చేరువ కావడం ఆశ్చర్యకరమే. దానిపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ‘ఇటి నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరికొత్త హెచ్చరిక చేశారు. సెన్సెక్స్ పెరుగుదలను చూస్తే సమస్యలు సమసిపోయినట్టు ఎవరైనా భావిస్తారని, కానీ అవి ఇప్పుడే ప్రారంభమయ్యాయని రాజన్ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ కోవిడ్ పూర్వ స్థితికి రావడానికి 2022 చివరి వరకు సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేశారు.

2021-01-14 Read More

దేశంలో విద్యుత్ ఉత్పత్తిదారులకు పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిలు నవంబరులో రూ. 1,41,621 కోట్లకు పెరిగాయి. 2019 నవంబరు నాటికి ఉన్న బకాయిలు రూ. 1,04,426 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 35 శాతం అధికం. ఎక్కువ బకాయి పడిన పంపిణీ సంస్థల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్ము&కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, జార్ఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల సంస్థలు ఉన్నాయి. విద్యుత్ సరఫరా చేసిన 45 రోజుల్లోపు డిస్కంలు ఉత్పత్తిదారులకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ గడువు దాటాక అపరాద వడ్డీని విధిస్తారు.

2021-01-03 Read More

కోవిడ్ నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన 6 నెలల మారటోరియం కాలానికి అన్ని రకాల రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే రూ. 6 లక్షల కోట్లు కోల్పోవలసి వస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మొత్తాన్ని బ్యాంకులు భరించవలసి వస్తుందని, దీంతో వాటి నికర విలువలో గణనీయమైన భాగం తుడిచిపెట్టుకుపోతుందని, వాటి మనుగడే ప్రశ్నార్ధకమవుతుందని కేంద్రం పేర్కొంది. వడ్డీ మాఫీ కోరుతూ వివిధ రంగాలకు చెందిన సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది.

2020-12-08 Read More

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూలై- సెప్టెంబర్ కాలంలో 7.5 శాతం క్షీణించింది. దీంతో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయింది. ఏప్రిల్- జూన్ కాలంలో ఏకంగా 23.9 శాతం పతనమైన జీడీపీ తర్వాత కొంత కోలుకుంది. జీడీపీ త్రైమాసిక రికార్డులు (1996లో) ప్రారంభమయ్యాక భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండుసార్లు తిరోగమించడం ఇదే తొలిసారి. రెండో త్రైమాసికం వృద్ధి రేటు ఇంతకు ముందు ఊహించిన మొత్తం (-8.8%) కంటే కొద్దిగా మెరుగ్గు నమోదైనా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి 8.7% క్షీణత ఖాయమని అంచనా.

2020-11-27
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page