2019-20లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2018-19 కంటే 10% తగ్గుతాయని ఆదాయ పన్ను శాఖ అంచనా వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుదేలైన తరుణంలో కార్పొరేట్ పన్ను రాయితీ ఇవ్వడం ఇందుకు కారణం. ఏటేటా పెరుగుతున్న ఆదాయం క్రితం ఏడాది కంటే తగ్గడం.. రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి! 2018-19లో ప్రత్యక్ష పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 11.5 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది రూ. 13.5 లక్షల కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా..జనవరి 23 వరకు కేవలం రూ. 7.3 లక్షల కోట్లు వచ్చాయి.
2020-01-24 Read Moreకేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని ఐదేళ్ళ క్రితం 14వ ఆర్థిక సంఘం సూచించింది. ఆమేరకు పెంచిన కేంద్ర ప్రభుత్వం, గ్రాంట్లలో కోత విధించింది. మొత్తంగా చూస్తే కేంద్రం నుంచి బదలాయింపులు పెద్దగా పెరగలేదు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం పన్నుల్లో వాటాను 42 శాతం నుంచి తగ్గించాలని సిఫారసు చేసినట్టు సమాచారం. కేంద్రానికి ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంకోసం రాష్ట్రాలకు కోత విధించింది. అయితే, ఫలితాల ఆధారిత ప్రోత్సాహకాలను నిర్ణయించిందట!
2020-01-23సౌర ఇంథన ఉత్పత్తి సంస్థల్లో 2025 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలన్న లక్ష్యాన్ని గుజరాతీ బిలియనీర్ గౌతమ్ అదానీ వెల్లడించారు. దాంతోపాటు.. 2030 నాటికి మొత్తం పునరుత్పాదక ఇంథన శక్తుల్లో నెంబర్ 1 కావాలన్న ఆకాంక్షనూ వ్యక్తీకరించారు. బుధవారం ‘లింక్డ్ ఇన్’ పోస్టులో ఈ అంశాలను ప్రస్తావించారు. 2019లో అదానీ గ్రూపు సౌర ఇంథనంలో ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచింది. ముందుగా ఇండియాలో అతి పెద్ద పునరుత్పాదక ఇంథన కంపెనీగా 2020లో అవతరిస్తామని అదానీ పేర్కొన్నారు.
2020-01-22ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో ఒక్క ముంబై నగరం వాటానే 37 శాతం. అది దేశ వాణిజ్య రాజధాని మరి! ఏటేటా పెరుగుతున్న ప్రత్యక్ష పన్నుల మొత్తం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. జనవరి మొదటి పక్షంలో పన్ను వసూళ్ళు 13 శాతం తగ్గాయి. డిసెంబరులో 4 శాతం తగ్గాయి. జనవరిలో ‘డబుల్ డిజిట్ పతనం’ అధికారులను కలవరపెడుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి దేశవ్యాప్తంగా వసూలైన ప్రత్యక్ష పన్నుల మొత్తం రూ. 9 లక్షల కోట్లను దాటలేదని తెలుస్తోంది.
2020-01-21 Read Moreప్రపంచ కుబేరులు, ఆర్థిక వ్యవస్థల వార్షిక సమావేశాలు రేపు స్విట్జర్లాండ్ లోని ‘దావోస్’లో పారంభం కాబోతున్నాయి. ఇవి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) 50వ వార్షిక సమావేశాలు. జనవరి 21-24 తేదీల్లో జరగనున్న సదస్సుకు ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరు కానున్నారు. ఇండియా నుంచి కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, 100 మంది సీఈవోలు హాజరవుతున్నారు.
2020-01-19 Read More2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,640 కోట్ల మేరకు లాభాలను ఆర్జించింది. ఇది గత ఏడాది మూడో త్రైమాసికం కంటే 13.5 శాతం అధికం. ఆర్ఐఎల్ ఒక థ్రైమాసికంలో ఇంత లాభం సాధించడం ఇదే తొలిసారి. రెవెన్యూ గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గినా లాభం అసాధారణంగా పెరగడం విశేషం. మూడో త్రైమాసికంలో రిలయన్స్ రెవెన్యూ రూ. 1,68,858 కోట్లుగా నమోదైంది.
2020-01-17తలసరి జీడీపీలో 10 వేల డాలర్ల మార్కును చైనా దాటేసింది. 2019లో చైనా తలసరి జీడీపీ $10,276గా నమోదైనట్టు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ నింగ్ జిఝె శుక్రవారం చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న చైనా 10 వేల డాలర్ల తలసరి ఉత్పత్తిని సాధించడం ప్రపంచ వ్యాప్త ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. చైనా ప్రగతి వేగం ఆపతరం కానిదని ఆయన వ్యాఖ్యానించారు. తలసరి జీడీపీ 10 వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న దేశాల జనాభా ఇప్పుడు అమాంతం 300 కోట్లకు పెరిగింది.
2020-01-17 Read Moreఇండియాలో 2025 నాటికి 10 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అమెజాన్.కాం ఇంక్ శుక్రవారం ప్రకటించింది. అమెజాన్ రూ. 7100 కోట్ల పెట్టుబడితో... ఇండియాకు ఒరగబెట్టేదేం లేదని నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని అమెజాన్ చెబుతోంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇండియా పర్యటనలో ఉన్నారు.
2020-01-17 Read Moreశుక్రవారం మార్కెట్ల ప్రారంభంలో రూపాయి విలువ 7 పైసలు తగ్గింది. డాలరు బిలువ 71 రూపాయలకు చేరింది. నిన్న 11 పైసలు తగ్గడంతో డాలరు విలువ రూ. 70.93 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్ పెరగడం, చమురు ధరలు స్థిరంగా ఉండటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కూడా డాలరు బలపడటానికి కారణమైంది.
2020-01-17మరో అమెరికన్ కంపెనీ ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించింది. గూగుల్ మాతృ సంస్థ ‘అల్ఫాబెట్’ గురువారం ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిన నాలుగో అమెరికన్ కంపెనీగా రికార్డులకెక్కింది. యాపిల్, అమెజాన్ 2018లో, మైక్రోసాఫ్ట్ 2019 ఏప్రిల్ మాసంలో ఈ ఘనత సాధించాయి. అయితే, అమెజాన్ విలువ ట్రిలియన్ డాలర్లపైన నిలబడలేదు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘అల్ఫాబెట్’ బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి షేర్ల విలువ బాగా పెరిగింది.
2020-01-17