2018-19, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించింది. జాతీయ గణాంకాల సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2018-19 జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం కాదు. 6.1 శాతం మాత్రమే! 2017-18లో 7.2 శాతం వృద్ధి నమోదైనట్లు ఇంతకు ముందు చెప్పగా ఇప్పుడా అంచనాను 7.0కు తగ్గించారు. ఆయా సంవత్సరాల్లో స్థిర ధరల ప్రకారం జీడీపీ వరుసగా రూ. 139.81 లక్షల కోట్లు, రూ. 131.75 లక్షల కోట్లు.
2020-01-31 Read Moreనరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ‘మేకిన్ ఇండియా’ నినాదమిచ్చారు. అధికార బిజెపి, దాని సోదర సంస్థలు చైనా ఉత్పత్తులపై ప్రచ్ఛన్న యుద్ధం చేశాయి. అయినా, చైనా నుంచి వస్తువుల దిగుమతులు వెల్లువెత్తాయి. మోడీ హయాంలో చైనాతో భారత వాణిజ్య లోటు మొత్తం 304.23 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 21.90 లక్షల కోట్లు)గా తేలింది. 2017-18లో పతాక స్థాయికి చేరిన లోటు 2018-19లో తగ్గింది. 2019-20లో నవంబర్ వరకు 35.32 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, మోడీ హయాంలో అమెరికాతో వాణిజ్య మిగులు 108.12 బిలియన్ డాలర్లుగా ఉంది.
2020-01-312020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతం వరకు ఉంటుందని ఆర్థిక సర్వే 2020 అంచనా వేసింది. ఈ (2019-20) ఆర్థిక సంవత్సరం నమోదయ్యే 5 శాతంతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది పుంజుకుంటుందని పేర్కొంది. 2020 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే పత్రాన్ని పార్లమెంటు ముందుంచారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని ఈ పత్రంలో విశ్లేషించారు.
2020-01-31ప్రభుత్వ రంగ బ్యాంకుల రెండు రోజుల సమ్మె శుక్రవారం ప్రారంభమైంది. బ్యాంకుల విలీనం సహా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వేతన సవరణ వంటి అంశాలపై 9 సంఘాల సమాఖ్య రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. సరిగ్గా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే (శుక్రవారం ) ఉద్యోగులు సమ్మెకు దిగారు. జనవరి 8న ఓ రోజు సమ్మె జరిగింది. ఉద్యోగ సంఘాలు, యాజమాన్యాల మధ్య చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు 2 రోజులు, మార్చిలో 3 రోజులు సమ్మె చేయాలని నిర్ణయించారు.
2020-01-31నవంబర్ వరకు పన్నుల వసూళ్లు గత ఏడాది కంటే తక్కువగా నమోదైన 6 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ తోపాటు మహారాష్ట్ర, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ కూడా పన్నుల వసూళ్ళలో తిరోగమనంలో ఉన్నాయి. తొలి ఎనిమిది నెలల్లో ఏపీలో 11.4 శాతం తగ్గితే పంజాబ్ రాష్ట్రంలో 10.4 శాతం తగ్గుదల నమోదైంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో 13.44 శాతం ఎక్కువ వసూలు కావడం విశేషం.
2020-01-30 Read Moreఏపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పన్ను రేట్లలో మార్పులు చేసింది. దీనివల్ల ధరలు కొద్దిగా పెరగవచ్చు. ఇప్పటిదాకా ‘వ్యాట్’ కింద పెట్రోలుపై ‘31 శాతం+2 రూపాయలు’ ఉంటే దాన్ని ‘35.20%’గా మార్చారు. డీజిల్ పైన ‘22.25% + 2 రూపాయలు’ స్థానంలో ‘27%’ అని మారుస్తూ బుధవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 19 జారీ చేసింది. తెలంగాణలో సరిగ్గా 35.20%, 27% ఉన్నాయి. పన్ను పూర్తిగా శాతంలోకి మార్చినందువల్ల...చమురు ధర పెరిగినప్పుడు ప్రభుత్వ ఆదాయమూ పెరుగుతుంది.
2020-01-29తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ‘మిషన్ భగీరథ’, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ప్రత్యేక గ్రాంటును సిఫారసు చేయాలని ఆ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. మంగళవారం ఢిల్లీలో కమిషన్ ఛైర్మన్ నందకిషోర్ సింగ్ ను కలసిన హరీష్ రావు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాసిన లేఖను అందజేశారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితుల కారణంగా... 80 నుంచి 610 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోయవలసి వచ్చిందని వివరించినట్టు హరీష్ రావు చెప్పారు.
2020-01-28ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ను 100 అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొనుగోలు చేసినవారికి ఎయిర్ ఇండియాలో 100 శాతం ఈక్విటీతో పాటు... ఆ సంస్థకు ఎ.ఐ.ఎక్స్.ఎల్.లో ఉన్న 100 శాతం, ఎ.ఐ.ఎస్.ఎ.టి.ఎస్.లో ఉన్న 50 శాతం వాటాలు కూడా దక్కుతాయి. బిడ్లు దాఖలు చేయడానికి మార్చి 17ను ‘డెడ్ లైన్’గా నిర్దేశించారు. బిడ్లు దాఖలు చేసే సంస్థల నికర విలువ రూ. 3,500 కోట్లు ఉండాలి.
2020-01-28ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్ళు 2019 ఏప్రిల్-2020 జనవరి 25 మధ్య 5.4 శాతం పడిపోయాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి రూ. 7.7 లక్షల కోట్లు వసూలు కాగా ఈ ఏడాది పెరగకపోగా రూ. 7.3 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. స్థూల వసూళ్ళు 1.27 శాతమే (రూ. 9.11 నుంచి రూ. 9 లక్షల కోట్లకు) తగ్గినా రిఫండ్స్ తర్వాత ఈ వ్యత్యాసం పెరిగింది. 2019-20 బడ్జెట్లో స్థూల వసూళ్ళ లక్ష్యం 13.35 లక్షల కోట్లుగా నిర్దేశించుకున్నారు.
2020-01-28‘‘అధిక పన్నులు ప్రభుత్వం ద్వారా ప్రజలకు జరిగే సామాజిక అన్యాయం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే వ్యాఖ్యానించారు. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ 79వ వార్షికోత్సవ సందర్భంగా జస్టిస్ బాబ్డే శుక్రవారం ఢిల్లీలో ఓ సభలో మాట్లాడారు. పన్ను ఎగవేతను సాటి పౌరుల పట్ల చేసే సామాజిక అన్యాయంగా ఆయన అభివర్ణించారు.
2020-01-25 Read More