ప్రస్తుత (2019-20) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకోసం రూ. 34,582 కోట్లను కేంద్రం కేటాయించింది. అయితే, తాజా బడ్జెట్లో పేర్కొన్న ‘సవరించిన అంచనాల’లో ఈ మొత్తం రూ. 28,314 కోట్లకు తగ్గింది. 2020-21 బడ్జెట్లో ఈ పద్దు కింద రూ. 30,000 కోట్లు కేటాయించారు. కేంద్ర పన్నుల్లో వాటాను బదిలీ చేశాక కూడా రెవెన్యూ లోటు ఏర్పడే పరిస్థితి ఉంటే ఈ గ్రాంటు ఇస్తారు. ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా భారీగా తగ్గిపోగా...రెవెన్యూ లోటు గ్రాంటు కూడా కేంద్రం తగ్గించడం గమనార్హం.

2020-02-02

బడ్జెట్ ప్రసంగాల నిడివిలో రికార్డు నెలకొల్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం ఆమె 2020 బడ్జెట్ ప్రసంగం ఏకంగా 2.40 గంటల పాటు సాగింది. అప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా కొన్ని పేజీలు మిగిలి ఉండగా.. అలసిపోయిన ఆర్థిక మంత్రికి చెమటలు పట్టాయి. ఆ సమయంలో తోటి మంత్రులు చక్కెర అందించారు. చెమట తుడుచుకున్న నిర్మల, ఇక ప్రసంగాన్ని కొనసాగించలేకపోయారు. సుదీర్ఘ ప్రసంగాల్లో గత ఏడాది తానే నెలకొల్పిన రికార్డును (2.17 గంటలు) ఈసారి చెరిపేశారు.

2020-02-02

చైనా సహా మెజారిటీ ఆసియా దేశాల కంటే ఇండియాలో కార్పొరేట్ పన్ను తక్కువని బడ్జెట్ చెబుతోంది. ప్రామాణికంగా తీసుకున్న 8 దేశాల్లో థాయ్ లాండ్ మినహా అన్నిచోట్లా ఇండియా కంటే కార్పొరేట్ పన్ను ఎక్కువే. నెంబర్ 2 ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో 25 శాతం, మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్లో 23.2 శాతం, శ్రీలంకలో 28 శాతం, ఫిలిప్పీన్స్ లో 30 శాతం పన్ను అమల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. సంపద సృష్టికర్తలను తాము గౌరవిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు.

2020-02-02

విభజించదగిన కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గుతోంది. 2020-21 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు ప్రకారం రాష్ట్రాల వాటా 42 శాతం నుంచి 41కి తగ్గనుంది. ఇంతకు ముందు రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021-22 నుంచి 2025-26 వరకు ఉన్న కాలానికి 15వ ఆర్థిక సంఘం రెండో నివేదికను వచ్చే అక్టోబరులో సమర్పించనుంది.

2020-02-01 Read More

కేంద్ర పన్నుల్లో వాటా కింద ఈ ఏడాది రాష్ట్రాలకు రావలసిన మొత్తంలో భారీగా కోత పడింది. 2018-19లో బదిలీ అయిన మొత్తం కంటే ఈ ఏడాది రాష్ట్రాలకు రూ. 1,05,408 కోట్లు (13.84 శాతం) తగ్గుతోంది. 2020-21 బడ్జెట్ పత్రం ప్రకారం... ఈ ఏడాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాగా వస్తున్న మొత్తం రూ. 6,56,046 కోట్లు. ఇది గత ఏడాది రూ. 7,61,454 కోట్లుగా ఉంది. 2020-21లో ఈ వాటా రూ. 7,84,181 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అంటే.. రెండేళ్ళ పాటు రాష్ట్రాల వాటాలో స్తబ్ధత నెలకొన్నట్లు.

2020-02-01

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకానికి 2020-21 బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం రూ. 75,000 కోట్లు కేటాయించింది. ప్రస్తుత సంవత్సరం బడ్జెట్లో అంతే మొత్తాన్ని కేటాయించిన ప్రభుత్వం, వ్యయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసింది. వ్యయం మొత్తం రూ. 54,370 కోట్లు ఉండొచ్చని సవరించిన అంచనాల్లో పేర్కొంది. అయితే, వాస్తవంలో ఇంతకంటే తక్కువ ఉండొచ్చు. సుమారు 48 శాతం మంది రైతులకు ఒక్క కిస్తీ (రూ. 2000) కూడా చెల్లించలేదని వార్తలు వచ్చాయి.

2020-02-01

2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయం రూ. 30,42,230 కోట్లు ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. అందులో రూ. 20,20,926 కోట్లు పన్నులు, పన్నేతర ఆదాయం రూపంలో వస్తుందని కేంద్రం ఆశిస్తోంది. మిగిలిన రూ. 10,21,304 కోట్లలో రూ. 7,96,337 కోట్ల మేరకు అప్పులు, ఇతర రుణ రూపాల్లో రాబట్టుకోవలసి ఉంది. రుణాల రికవరీ ద్వారా రూ. 14,967 కోట్లు వస్తాయని, ఇతర రశీదులు మరో రూ. 2,10,000 కోట్లు ఉంటాయిని కేంద్రం ఆశాభావం.

2020-02-01

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ పన్నును తగ్గించిన ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి మద్యతరగతి వర్గాల పన్నుల్లో కొద్దిపాటి మార్పులు చేసింది. కొత్త పన్నులివి. * రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను 10 శాతం. * రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం. * రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం (గతంలో 30 శాతం). * రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం (గతంలో 30 శాతం).

2020-02-01

అతి పెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్.ఐ.సి)లో కొంత వాటాను అమ్మనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎల్.ఐ.సి.ని స్టాక్ ఎక్సేంజీలలో నమోదు చేసి ఐపిఒ ద్వారా వాటాల అమ్మకాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. శనివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి ఎల్.ఐ.సి. జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ.

2020-02-01

*వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.60 లక్షల కోట్లు, *గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్ కు రూ. 1.23 లక్షల కోట్లు, *విద్యకు రూ. 99,300 కోట్లు, *ఆరోగ్య రంగానికి రూ. 69,000 కోట్లు, *స్వచ్ఛ భారత్ కు రూ. 12,300 కోట్లు, *నైపుణ్య శిక్షణకు రూ. 3000 కోట్లు, *ఎస్సీల సంక్షేమానికి రూ. 85,000 కోట్లు, *ఎస్టీలకు 53,700 కోట్లు, *మహిళలకోసం రూ. 28,600 కోట్లు, *సీనియర్ సిటిజన్లకు రూ. 9,500 కోట్లు, *పరిశ్రమలకు రూ. 27,000 కోట్లు, * ఇంథన, పునరుత్పాదక ఇంథన రంగాలకు రూ. 22 వేల కోట్లు.

2020-02-01
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page