విమాన సర్వీసుల ఆలస్యం, దారి మళ్ళింపు, రద్దు, వాయిదాలలో ‘ఇండిగో’ను మించిన ఎయిర్ లైన్స్ లేదు. 2019 చివరి మూడు నెలల్లో ఈ సంస్థ ఏకంగా 2,963 విమాన సర్వీసులను ఆలస్యంగా నడపడమో లేక రద్దు చేయడమో జరిగింది. తర్వాత స్థానాల్లో ‘గో ఎయిర్’ సంస్థ (1289 సర్వీసులు), ఎయిర్ ఇండియా (676), విస్తారా (559), స్పైస్ జెట్ (495), ఎయిర్ ఆసియా (322) ఉన్నాయి. ట్రూజెట్ విమానాలు ఒక్కటి కూడా ఆలస్యం కాలేదు. ఈ వివరాలను కేంద్ర విమానయాన శాఖ గురువారం లోక్ సభలో వెల్లడించింది.
2020-02-06వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చివరి ద్వైమాస ద్రవ్య పరపతి విధానాన్ని గురువారం ప్రకటించింది. దాని ప్రకారం రెపో రేటు 5.15 శాతంగా, రివర్స్ రెపో రేటు 4.90 శాతం వద్ద యధాతథంగా ఉన్నాయి. గత డిసెంబరులో ప్రకటించిన ఈ రేట్లు...గత దశాబ్దంలోనే కనిష్ఠం. మానెటరీ పాలసీ కమిటీ (ఎంపిసి)లోని సభ్యులు 6-0తో యధాతథ స్థితికి ఓటు వేశారు.
2020-02-06తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి నివాసంలో ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. కడప ద్వారకా నగర్ లోని నివాసంతో పాటు హైదరాబాద్ పంజాగుట్టలోని ఆర్.కె. ఇన్ఫ్రా కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్ అయిన శ్రీనివాసులురెడ్డి పన్ను ఎగవేశారన్న సమాచారంతోనే ఈ సోదాలు చేపట్టినట్లు ఓ కథనం. తెలుగు రాష్ట్రాలతో పాటు జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో శ్రీనివాసులు రెడ్డి కంపెనీ కాంట్రాక్టులు చేస్తోంది.
2020-02-06చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ‘అన్హుయి’ ప్రావిన్సు ఒకటి. వైరస్ భయంతో చాలాచోట్ల మానవ సంచారం పరిమితమైంది. ఈ నేపథ్యంలో ‘అన్హుయి’ ప్రావిన్సులోని ‘చుజౌ పవర్ గ్రిడ్’ మనుషులకు బదులు ‘తెలివైన రోబో’లను వినియోగించింది. నగరంలోని 60 విద్యుత్ సబ్ స్టేషన్లకు కాపలాగా ఈ రోబోట్లను పంపింది.
2020-02-06ఇండియాలో రెండో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు హ్యూండాయ్ మోటార్స్. ‘కియా’ సోదర సంస్థ అయిన హ్యూండాయ్ మోటార్స్ ఉత్పత్తి కేంద్రాలన్నీ తమిళనాడులో ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలోనే ‘కియా’ తరలింపు చర్చలు ప్రారంభమైనట్లు ‘రాయిటర్స్’ కథనం. ఆటో స్పేర్ పార్ట్స్ పరిశ్రమలు కూడా తమిళనాడులోనే ఎక్కువ. అక్కడికే తరలిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గుతుందని ‘కియా’ భావిస్తున్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.
2020-02-06కార్ల పరిశ్రమను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి తరలించే ప్రణాళికేమీ లేదని ‘కియా’ ఓ ప్రకటనలో తెలిపింది. ‘విస్తరణ’ను పరిశీలించే ముందు ప్రస్తుత ప్లాంటు పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొంది. అనంతపురంలో ఉన్న ‘కియా’ ప్లాంటును తమిళనాడుకు తరలించే అంశంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని, వచ్చే వారం కార్యదర్శి స్థాయిలో చర్చలు జరగబోతున్నాయని ‘రాయిటర్స్’ రాసింది.
2020-02-06అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా మోటార్స్ కార్ల ప్లాంటును పొరుగున ఉన్న తమిళనాడుకు తరలించేందుకు చర్చలు జరుగుతున్నాయా?! ఆ రాష్ట్ర అధికారులను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ రాసిన వార్త కలకలం రేపింది. ఏపీ విభజన తర్వాత వచ్చిన అతి పెద్ద విదేశీ పెట్టుబడి ‘కియా’. పారిశ్రామిక వృద్ధికి పెద్ద పరిశ్రమలు తప్పనిసరి అని భావించి గత ప్రభుత్వం అదనపు రాయితీలు కల్పించి మరీ రాష్ట్రానికి తెచ్చింది. ‘కియా’ 3 లక్షల యూనిట్ల సామర్ధ్యంతో కొద్ది నెలల క్రితమే ఉత్పత్తిని ప్రారంభించింది.
2020-02-06 Read Moreబొమ్మలు, పిల్లలు ఆడుకునే ట్రైసైకిళ్ళు, స్కూటర్లపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటిదాకా 20 శాతంగా ఉన్న సుంకం ఏకంగా 60 శాతానికి పెరిగింది. ఈ పిల్లల సామాగ్రి సింహభాగం చైనా నుంచే వస్తుంది. దేశీయ కంపెనీలకోసం కొన్ని కేటగిరిల వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచినట్టు శనివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వాల్ నట్స్ పైన సుంకాన్ని 30 శాతం నుంచి 100 శాతానికి పెంచారు.
2020-02-02శనివారం 2020-21 కేంద్ర బడ్జెట్ వెలువడ్డాక స్టాక్ మార్కెట్లలో భారీ పతనం నమోదైంది. ఎస్ అండ్ పి బి.ఎస్.ఇ. సెన్సెక్స్ ఓ దశలో 1,274 పాయింట్లు పతనమైంది. చివరికి 987.96 పాయింట్లు (2.43 శాతం) తగ్గి 40 వేల మార్కు కంటే దిగువన (39,735.53 వద్ద) ముగిసింది. ఎన్.ఎస్.ఇ.లో నిఫ్టీ50 కూడా 392 పాయింట్ల (3.26 శాతం) పతనంతో 11,643.80 వద్ద ముగిసింది. హెచ్.డి.ఎఫ్.సి. ద్వయం, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టి, ఎస్.బి.ఐ. షేర్లు 7 శాతం వరకు పడిపోయాయి.
2020-02-02 Read Moreకేంద్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు తొలిసారిగా రూ. 6 లక్షల కోట్లు దాటుతోంది. 2020-21లో లోటు రూ. 6,09,219 కోట్లు ఉండొచ్చని కేంద్రం తాజా బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.7 శాతం. 2018-19లో రెవెన్యూ లోటు రూ. 4,54,483 కోట్లు (జీడీపీలో 2.4 శాతం)గా తేలింది. 2019-20లో రూ. 4,85,019 కోట్లు ఉంటుందని పోయిన బడ్జెట్ సమయంలో అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ. 4,99,544 కోట్లకు పెరిగింది. వచ్చే ఏడాది లక్షా 10 వేల కోట్లు అదనపు లోటు ఉంటుందని అంచనా.
2020-02-02