2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పరిమాణం రూ. 5,12,860 కోట్లుగా ఉంది. నూతన బడ్జెట్ ను ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సురేష్ ఖన్నా మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఇది నాలుగో బడ్జెట్. 2022లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు ప్రజాకర్షక నిర్ణయాలకు నిధులు కేటాయిస్తోంది.
2020-02-182020 కేలండర్ సంవత్సరంలో ఇండియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాను ‘మూడీస్’ ఇన్వెస్టర్ సర్వీసెస్ బాగా తగ్గించింది. ఈ ఏడాది జీడీపీ 6.6 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసిన ‘మూడీస్’, తాజాగా దాన్ని 5.4 శాతానికి తగ్గించింది. ఆర్థిక మందగమనం నుంచి ‘రికవరీ’ కూడా నెమ్మదిగానే జరుగుతుందని తాజాగా వెలువరించిన ‘గ్లోబల్ మేక్రో ఔట్ లుక్’లో పేర్కొంది. 2021లోనూ జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతం దాటదని పేర్కొనడం గమనార్హం. ఆ ఏడాది 6.7 శాతం ఉంటుందని గతంలో అంచనా వేసింది.
2020-02-17 Read More‘ఆధార్’తో అనుసంధానించని ‘పాన్’ కార్డులు మార్చి 31 తర్వాత పనికిరావని ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. జనవరి 27 వరకు దేశంలో 30.75 కోట్ల పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) కార్డులు ‘ఆధార్’తో అనుసంధానమయ్యాయి. ఇంకా 17.58 కోట్ల పాన్ కార్డులు మిగిలాయి. పాన్, ఆధార్ అనుసంధానంకోసం పలుమార్లు డెడ్ లైన్ పొడిగించిన అధికారులు, 2020 మార్చి 31 చివరిదని చెబుతున్నారు. 12 అంకెల బయోమెట్రిక్ ఐడీ కార్డు ‘ఆధార్’ రాజ్యాంగబద్ధమేనని 2018 సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
2020-02-15ఆదాయ పన్ను శాఖ ఈ నెల 6వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణెలలో నిర్వహించిన సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలకు భాగం ఉన్న బోగస్ కాంట్రాక్టుల రాకెట్లో రూ. 2000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లాయని ఆ ప్రకటనలో పేర్కొంది. మాజీ సిఎం చంద్రబాబు మాజీ పి.ఎస్. శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తదితరుల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.
2020-02-13రాష్ట్ర విభజన నాటి హామీ ‘ప్రత్యేక కేటగిరి హోదా’కు బదులు ‘ప్రత్యేక సాయం’ ప్రకటించిన కేంద్రం ఈ మూడేళ్లలో ఏపీకి ఇచ్చిందెంత? అక్షరాలా రూ. 16 కోట్లు కూడా లేదు. 2017-18లో సున్నా.. 2019-20లో నవంబరు 7వ తేదీవరకు ఇచ్చింది సున్నా. మధ్యలో 2018-19లో మాత్రం రూ. 15.81 కోట్లు విదిలించింది. ఈ మూడేళ్ళలో వివిధ రాష్ట్రాలకు కేంద్రం చేసిన ‘ప్రత్యేక సాయం’ రూ. 12,195 కోట్లు. అందులో ఏపీ వాటా 0.0129 శాతం. దీన్ని ఏమంటారు?
2020-02-10కేంద్ర ప్రభుత్వ అప్పు ఈ ఏడాది కోటి కోట్లు దాటనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా ప్రకారం... రూ. 100,18,421 కోట్ల అప్పు ఉంటుందని, దానిపై రూ. 6,63,297 కోట్లు వడ్డీకి పోతుందని కేంద్రం సోమవారం లోక్ సభకు తెలిపింది. అందులో రూ. 78,97,497 కోట్లు అంతర్గత అప్పు, విదేశీ అప్పు రూ. 2,92,867 కోట్లు కాగా... ఇతర రూపాల్లో మరో రూ. 18,28,057 కోట్లు అవుతుందని కేంద్రం వివరించింది. అంతర్గత అప్పుపై వడ్డీ రూ. 5,92,645 కోట్లకు పెరుగుతోంది.
2020-02-102019-20లో ఫిబ్రవరి 5 వరకు తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కేంద్రం సోమవారం లోక్ సభలో వెల్లడించింది. స్థానిక సంస్థలకు వచ్చే గ్రాంట్లు మినహా మిగిలిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా తగ్గాయి. కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ. 13,009 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఏడాది 12 నెలలకు రూ. 18,560.88 కోట్లను కేంద్రం పంపిణీ చేసింది. స్థానిక సంస్థలకు గత ఏడాది కంటే ఎక్కువగా రూ. 1,953 కోట్లు రాగా... కేంద్ర పథకాలకింద వచ్చే గ్రాంట్లు రూ. 5,737 కోట్లకు తగ్గిపోయాయి.
2020-02-10నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఒక్క ఏడాది కూడా పంచాయతీరాజ్ సంస్థలకు 100 శాతం నిధులు ఇవ్వలేదు. ఇందుకు.. రాష్ట్రాలు యు.సి.లు సమర్పించకపోవడం, ఎన్నికలు నిర్వహించకపోవడం వంటి కారణాలు చెబుతున్నారు. అయితే, 2013-14లో కేటాయించిన మొత్తానికి 106.63 శాతం నిధులు విడుదల కావడం గమనార్హం. ఆ తర్వాత 2014-15లో కేటాయింపుల్లో 89.85%, 2015-16లో 99.47%, 2016-17లో 98.07%, 2017-18లో 90.98%, 2018-19లో మరీ తక్కువగా 84.09% నిధులు విడుదలయ్యాయి.
2020-02-10హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో కారిడార్ శుక్రవారం ప్రారంభమైంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు నిర్మాణమైన సరికొత్త లైనును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. 11 కి.మీ. పొడవైన ఈ లైన్లో రెండు ప్రాంతాల మధ్య 9 స్టేషన్లు ఉంటాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలనుంచి వచ్చే ప్రజలకు జె.బి.ఎస్. నుంచి నిర్మితమైన కారిడార్ బాగా ఉపయోగపడుతుంది.
2020-02-072020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,201 కోట్ల మేరకు రెవెన్యూ లోటు ఉంటుందని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. బడ్జెట్ పత్రాలను కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది రెవెన్యూ రశీదులు రూ. 1,14,636 కోట్లుగా అంచనా. వ్యయం మాత్రం రూ. 1,29,837 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 17,474 కోట్లు.
2020-02-07