విశాఖపట్నంలో రూ. 70 వేల కోట్లు పెట్టుబడి పెడతామని అదానీ కంపెనీ చెప్పలేదని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి నొక్కి చెప్పారు. ‘‘గత ప్రభుత్వం అడిగిందనందువల్ల అంత మొత్తం చెప్పామని, నిజానికి తమ డిపిఆర్ లో రూ. 3000 కోట్ల నుంచి రూ. 4000 కోట్ల వరకు మాత్రమే ప్రతిపాదించామని ఆదానీ కంపెనీ మాకు చెప్పింది’’ అని గౌతంరెడ్డి గురువారం విలేకరులతో చెప్పారు. తమకు 50 ఎకరాలు చాలని కూడా కంపెనీ చెప్పినట్టు మంత్రి పేర్కొన్నారు.

2020-02-20

బావగుత్తు రఘురాం శెట్టి (77)..కర్నాటక నుంచి అబుదాబి వెళ్లి బిలియన్లకు అధిపతి అయ్యారు. అమరావతిలో ఆసుపత్రి-పరిశోధనా కేంద్రం నిర్మాణానికి ముందుకొచ్చారు. సొంత విమానంలో మందీమార్భలంతో విజయవాడలో దిగిన అతికొద్ది మందిలో ఒకరు శెట్టి. ‘బుర్జ్ ఖలీఫా’లో రెండు ఫ్లోర్లు, కంటికి నచ్చిన వింటేజ్ కార్లు కొనడం సహా అత్యంత విలాసవంతమైన జీవితం అనుభవించారు. ఇప్పుడా సంపన్నుడు పతనం అంచున నిల్చున్నారు. శెట్టి స్థాపించిన ఎన్.ఎం.సి.పై ‘మడ్డీ వాటర్స్’ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో గత రెండు నెలల్లో షేర్ల విలువ 67 శాతం పడిపోయింది.

2020-02-20 Read More

రూపాయి మరింత బలహీనపడింది. బుధవారం మార్కెట్ల ప్రారంభంలో డాలరుకు రూ. 71.79 పలికింది. కిందటి సెషన్లో (మంగళవారం) రూపాయి విలువ 24 పైసలు తగ్గి డాలరుకు రూ. 71.56 వద్ద ముగియగా, బుధవారం మరో 23 పైసలు తగ్గింది. బుధవారం (ఫిబ్రవరి 19న) ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా బ్యాంకులకు సెలవు కావడంతో కరెన్సీ మార్కెట్లు మూసేశారు. గత మూడు నెలల్లో రూ. 70.59, రూ. 72.09 మధ్య ఈ విలువ దోబూచులాడుతోంది.

2020-02-20 Read More

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందు మోడీ ప్రభుత్వం మంచి బహుమతి ఇచ్చింది. భారత నౌకాదళం కోసం 24 అమెరికా ఎంహెచ్-60 రోమియో యాంటీ సబ్ మెరైన్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వాటి విలువ 2.6 బిలియన్ డాలర్లు (రూ. 18,720 కోట్లు). అంటే ఒక్కొక్క హెలికాప్టర్ రూ. 780 కోట్లు. బుధవారం కేబినెట్ సమావేశం సందర్భంగా సిసిఎస్ సమావేశమైంది. అయితే, ట్రంప్ పర్యటన (24-25)లో ఒప్పందంపై సంతకాలు చేస్తారా..లేదా అన్నది తెలియాల్సి ఉంది.

2020-02-19 Read More

మోడీ ప్రభుత్వం ‘పన్నుల సంస్కరణ’ పేరిట తెచ్చిన వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి)ని ‘21వ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి నిర్ణయం’గా అభివర్ణించారు బిజెపి ఎంపీ సుబ్రమణియన్ స్వామి. బుధవారం హైదరాబాద్ నగరంలో ‘ఇండియా- యాన్ ఎకనామిక్ సూపర్ పవర్’ అనే అంశంపై స్వామి మాట్లాడారు. దేశం ‘సూపర్ పవర్’ కావాలంటే వచ్చే పదేళ్ళూ సగటున 10 శాతం వృద్ధి సాధించాలన్నారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలకు గాను ఆయనకు ‘భారత రత్న’ ఇవ్వాలని స్వామి అభిప్రాయపడ్డారు.

2020-02-19 Read More

కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకం ‘స్వచ్ఛభారత్’ రెండో దశకోసం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను వినియోగించనున్నట్టు కేంద్రం పేర్కొంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1,40,881 కోట్లు కాగా రూ. 52,497 కోట్లు మాత్రమే బడ్జెట్ (తాగునీరు, పారిశుధ్య శాఖ) నుంచి కేటాయిస్తారు. మిగిలిన రూ. 88,384 కోట్లను 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) నుంచి సమీకరించాలని నిర్ణయించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులను ఈ పథకానికి మళ్లించడం గ్రామీణ స్థానిక సంస్థలకు నష్టదాయకం.

2020-02-19

జనాభాలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. బడ్జెట్ పరిమాణంలోనూ ఆ రాష్ట్రమే నెంబర్ 1. అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వ్యయంలో అధిక భాగాన్ని ఆ రాష్ట్రం సంపాదించడం లేదు. యూపీ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ ప్రకారం మొత్తం వ్యయంలో 32.37 శాతం (రూ. 1,66,021 కోట్లు) మాత్రమే సొంత పన్నుల ఆదాయం. దాదాపు దానికి సమానంగా రూ. 1,52,863.17 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా వస్తుందని అంచనా. రూ. 77,990.70 కోట్లు అప్పులతో సమకూరనుండగా మిగిలిన మొత్తంలో అధికభాగం కేంద్రం గ్రాంట్ల రూపంలో రానుంది.

2020-02-18

ప్రత్యేక ఆర్థిక మండళ్ళ ద్వారా ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం వెల్లడించింది. 2019-20లో సోమవారం (ఫిబ్రవరి 17) వరకు ఎస్.ఇ.జడ్.ల ద్వారా 100.59 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవలు ఎగుమతి అయ్యాయి. గత ఏడాది కంటే వస్తువుల ఎగుమతి విలువ కేవలం 2.97 శాతం పెరిగితే..సేవల ఎగుమతులు 22.61 శాతం పెరిగాయి. మొత్తంగా పెరుగుదల 13.42 శాతం. ఫిబ్రవరి 17 వరకు 42.7 బిలియన్ డాలర్ల వస్తువులు, 57.89 బిలియన్ డాలర్ల సేవలు ఎగుమతి అయ్యాయి.

2020-02-18 Read More

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మంగళవారం 57 డాలర్ల (బ్యారెల్) దిగువకు తగ్గింది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. 2020లో ఆయిల్ డిమాండ్ అంచనాలను అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ సహా పలు సంస్థలు తగ్గించాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర మంగళవారం 1.04 డాలర్లు తగ్గి 56.63 డాలర్లకు చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ క్రూడ్ ధర 83 సెంట్లు తగ్గి 51.22 డాలర్లకు చేరింది. మార్చిలో ఉత్పత్తిని తగ్గించే అవకాశాలున్నాయి.

2020-02-18

ఏపీ వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) చట్టం కింద తొలి అరెస్టు ఈ నెల 15న జరిగినట్టు రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. గాజువాక సర్కిల్ పరిధిలో పాత ఇనుము వ్యాపారం చేసే దుడ్డు శేఖర్ పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు ఆయన తెలిపారు. శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ యజమాని అయిన ఈ వ్యాపారి రూ. 14.40 కోట్ల టర్నోవరుపై రూ. 2.60 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. శేఖర్ ను ఆర్థిక నేరాల కోర్టులో 16న హాజరు పరచగా రిమాండ్ విధించారని, నిందితుడు విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లాడని వివరించారు.

2020-02-18
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page