ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, వస్తువుల ఎగుమతిలో నెంబర్ 1 దేశం చైనాకు ‘కరోనా’ ఓ కాళరాత్రిలా మారింది. 2020 ఫిబ్రవరిలో చైనా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) అసాధారణంగా 35.7కి పడిపోయింది. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం కుదిపేసినప్పుడు 2008 నవంబరులో చైనా పిఎంఐ 38.8కి దిగజారింది. ఇప్పుడు అంతకంటే తగ్గడం గమనార్హం. జనవరిలో పిఎంఐ 50.0గా నమోదైంది. ఫిబ్రవరిలో 46.0కి పడిపోతుందని ‘రాయిటర్స్’ సర్వేలో విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, అనూహ్యంగా రికార్డు స్థాయికి చైనా ఉత్పత్తి సూచీ పడిపోయింది.
2020-02-29 Read Moreరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. శనివారం ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, మరో పారిశ్రామికవేత్త.. రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానితో కలసి సిఎం నివాసానికి వచ్చారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. అంబానీ, జగన్ భేటీకి చాలా ప్రాధాన్యత ఉంది. 2009లో సిఎం రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాక ఆయన అనుయాయులు కొందరు అంబానీపై ఆరోపణలు చేశారు. 4 నెలల తర్వాత ఓ టీవీ కథనం ఆధారంగా రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేశారు.
2020-02-29స్టాక్ మార్కెట్ పతనానికి సమాంతరంగా రూపాయి విలువ పడిపోయింది. శుక్రవారం (ఫిబ్రవరి 28) ఒక్క రోజే 60 పైసలు పతనమైంది. ఈక్విటీల అమ్మకం, విదేశీ నిధుల పలాయనంతో రూపాయి 72 మార్కు దాటింది. డాలరుకు రూ. 72.21 వద్ద ట్రేడింగ్ ముగిసింది. శుక్రవారం ఓ దశలో 72.29కి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లడంతో బిఎస్ఇ బెంచ్ మార్క్ సెన్సెక్స్ శుక్రవారం ఏకంగా 1,448.37 పాయింట్లు తగ్గింది. విదేశీ నిధులు గత కొద్ది రోజులుగా వెనక్కు మళ్లుతున్నాయి.
2020-02-28 Read More2019-20 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల వృద్ధి రేటు అంచనాలను కేంద్ర గణాంకాల సంస్థ సవరించింది. తొలి త్రైమాసికం వృద్ధి రేటు 5.1 శాతమని ఆర్నెల్ల క్రితం ప్రకటించగా.. ఇప్పుడా అంచనాను 5.6 శాతానికి పెంచింది. రెండో త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయి కేవలం 4.5 శాతం వృద్ధి నమోదు కాగా.. దాన్ని 5.1 శాతానికి పెంచింది. మొత్తంగా తొలి అర్దభాగంలో వృద్ధి రేటును 5.35 శాతంగా చూపుతున్నారు. మూడో త్రైమాసికంలో వృద్ధి 4.7 శాతంగా శుక్రవారం ప్రకటించారు. సవరించిన అంచనాలతో వార్షిక వృద్ధి రేటు అంచనా 5 శాతానికి పెరిగింది.
2020-02-28 Read More2019-20 మూడో త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.7 శాతం పెరిగినట్లు అంచనా. కేంద్ర గణాంకాల సంస్థ (సి.ఎస్.ఒ) శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం...గత అక్టోబర్-డిసెంబరు కాలంలో జీడీపీ మొత్తం రూ. 36.65 లక్షల కోట్లు. 2018-19లో ఇదే కాలానికి రూ. 35 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా 4.5 శాతానికి పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు ఇంకా కోలుకోలేదు. పూర్తి సంవత్సరానికి వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందన్న అంచనాను మాత్రం సిఎస్ఒ మార్చలేదు.
2020-02-28 Read Moreభారత స్టాక్ మార్కెట్లో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 28న) భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బిఎస్ఇ సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల వరకు పడిపోగా ముగింపు మరింత దారుణంగా ఉంది. శుక్రవారం ఒక్క రోజే బెంచ్ మార్క్ సెన్సెక్స్ 1,448.37 పాయింట్లు పతనమై 38,297కి దిగజారింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 414 పాయింట్లు పతనమై 11,219 వద్ద ముగిసింది. ఈ పరిణామాన్ని దలాల్ స్ట్రీట్ లో మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘కరోనా’ భయంతో ఈక్విటీల అమ్మకాలు వెల్లువెత్తడం దీనికి కారణంగా చెబుతున్నారు.
2020-02-28 Read Moreభారత స్టాక్ మార్కెట్లనూ ‘కరోనా’ భయం కమ్ముకుంది. శుక్రవారం మార్కెట్ల ప్రారంభంలో బిఎస్ఇ సెన్సెక్స్ తిరోగమించింది. ఉదయం 10.00 గంటల సమయానికి సెన్సెక్స్ 1156 పాయింట్లు (2.91 శాతం) పతనమై 38,590కి చేరింది. ఎన్.ఎస్.ఇ. నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు చేరింది. గత కొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ‘కరోనా వైరస్’ దెబ్బకు కుదేలయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ గత వారంతో పోలిస్తే 2500 పాయింట్లకు పైగా దిగజారింది. శుక్రవారం 11 ప్రధాన రంగాల సూచీలు, నిఫ్టీ బాస్కెట్ లోని 50 ముఖ్యమైన షేర్లు మొత్తం నష్టాల బాట పట్టాయి.
2020-02-28‘కరోనా వైరస్’ చైనాను దాటి పశ్చిమ దేశాలకూ వ్యాపించడంతో అమెరికా స్టాక్స్ పతనం దిశగానే సాగాయి. డౌ ఇండెక్స్ గురువారం ఒక్క రోజే 1,191 పాయింట్లు (4.4 శాతం) పతనమైంది. ‘డౌ’ ఒకే రోజు ఇంత పతనం కావడం అమెరికా స్టాక్స్ చరిత్రలో ఇదే తొలిసారి. ఎస్&పి 500ది కూడా అదే స్థితి. 4.4 శాతం తగ్గి 3,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. 2011 ఆగస్టు 18 తర్వాత అత్యధిక పతనం ఇప్పుడే. నాస్డాక్ కాంపొజిట్ 4.6 శాతం పతనమైంది. ఇటలీలో ‘కరోనా’ మరణాలు పెరుగుతుండటం, కేలిఫోర్నియాలో కొత్త కేసు నమోదు కావడం మార్కెట్లను వణికించాయి.
2020-02-28ఆర్థిక మందగమనం సామాన్యులను బాధిస్తున్న వేళ అంబానీ (ముఖేష్) మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి పోతున్నారు. చైనా సంస్థ ‘హురూన్’ తాజాగా వెలువరించిన మహా సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 9వ స్థానాన్ని సాధించారు. అంబానీ సంపద గత ఏడాది కంటే 24 శాతం పెరిగి 67 బిలియన్ డాలర్లకు (రూ. 4.8 లక్షల కోట్లకు) చేరింది. జెఫ్ బెజోస్ సంపద 5 శాతం తగ్గినా నెంబర్ 1 స్థానంలో ($140 బిలియన్) కొనసాగగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ($107 బిలియన్), బిల్ గేట్స్ ($106 బిలియన్), వారెన్ బఫెట్ ($106 బిలియన్)తో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
2020-02-26 Read Moreవస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) కింద 2019 మార్చిలో వసూలైన రూ. 1800 కోట్లకు అదనంగా ఈ ఏడాది మార్చిలో మరో రూ. 1000 కోట్లు వసూలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు ఏపీ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె. నారాయణస్వామి చెప్పారు. మరో రూ. 1000 కోట్ల పాత బకాయిలను, ఆ మొత్తంపై వడ్డీ కింద రూ. 377 కోట్లను వసూలు చేయాలన్నది మరో లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇతర మార్గాల్లో మరో 1520 కోట్లు సమీకరించాలని మంత్రి మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు చెప్పారు.
2020-02-25