ఇక ప్రవాస భారతీయులు ఎయిర్ ఇండియాలో 100 శాతం ఈక్విటీని కొనుగోలు చేయవచ్చు. ఈమేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానానికి ప్రతిపాదించిన సవరణను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఎయిర్ ఇండియాలో పెట్టే పెట్టుబడిని కూడా ప్రభుత్వం దేశీయ పెట్టుబడిగానే పరిగణించనుంది. ఇంతకు ముందు ఎయిర్ ఇండియాలో 49 శాతం ఈక్విటీ కొనుగోలుకే ఎన్ఆర్ఐలకు అవకాశం ఉంది. విమాన యాన సంస్థల్లో ఎఫ్.డి.ఐ.కి కూడా 49 శాతం పరిమితి ఉంది.
2020-03-05 Read More10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4గా విలీనం చేసే ప్రక్రియకు కేంద్ర మంత్రివర్గం బుధవారం (మార్చి 4న) ఆమోదం తెలిపింది. ఈ విలీనం ఏప్రిల్ 1వ తేదీనుంచే అమల్లోకి రానుంది. 1. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం, 2. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు విలీనం, 3. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు విలీనం. 4. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనం...తో మొత్తం 7 మెగా బ్యాంకులు రూపొందుతాయని కేంద్రం ఘనంగా చెబుతోంది.
2020-03-05 Read Moreఇండియా జీడీపీ వృద్ధి 2020, 2021 సంవత్సరాల్లో (గత అంచనా కంటే) తగ్గుతుందని ఒఇసిడి పేర్కొంది. 2020లో 5.1 శాతం, 2021లో 5.6 శాతం వృద్ధి రేటు ఉంటుందని తాజా నివేదికలో అంచనా వేసింది. నవంబరు నాటి అంచనాల కంటే ఇవి వరుసగా 1.1 శాతం, 0.8 శాతం తక్కువ. 2021లో ఇండియా కంటే చైనా వృద్ధి రేటు (6.4) అధికంగా ఉంటుందని అంచనా వేసింది. నవంబర్ నాటి అంచనా కంటే చైనా వృద్ధి రేటును 0.9 శాతం పెంచి చూపింది. ‘కరోనా’ని నియంత్రిస్తేనే ఈ వృద్ధి సాధ్యం. వైరస్ మరింత వ్యాపిస్తే మాత్రం జీడీపీ వృద్ధి మరింత పడిపోతుంది.
2020-03-03గత వారం కుదేలైన అమెరికా అమెరికా స్టాక్ మార్కెట్ సోమవారం (మార్చి 2న) తిరిగి పుంజుకుంది. ‘డౌ’ ఒక్క రోజులో 1,294 పాయింట్లు (5.1 శాతం) పెరిగింది. పాయింట్లలో చూస్తే ఒక్క రోజులో ఇంత పెరగడం ఇదే మొదటిసారి. శాతంలో చూస్తే 2009 మార్చి తర్వాత ఇది తొలిసారి. ఎస్&పి సోమవారం 4.6 శాతం పెరిగింది. గత వారం డౌ (ఐ.ఎన్.డి.యు) 12.4 శాతం పతనమైంది. ఎస్&పి 500 (ఎస్.పి.ఎక్స్) 11.5 శాతం దిగజారింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక్క వారంలో ఇంత పతనం కావడం కూడా ఇదే తొలిసారి.
2020-03-03 Read More‘కరోనా వైరస్’ మరో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2020లో ప్రపంచ జీడీపీ వృద్ధి 2.4 శాతానికి పడిపోతుందని ఒఇసిడి అంచనా వేసింది. ‘కరోనావైరస్: ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ అనే శీర్షికన ఒఇసిడి ఆర్థిక నివేదిక సోమవారం (మార్చి2న) విడుదలైంది. 2019లో ప్రపంచ జీడీపీ 2.9 శాతమే పెరిగితే.. ఈ ఏడాది మరింత తగ్గనుంది. తొలి త్రైమాసికంలో నెగెటివ్ గ్రోత్ నమోదు కావచ్చని ఒఇసిడి అంచనా. చైనా వృద్ధి అంచనాను 4.9 శాతానికి (5.7 నుంచి), ఇండియా వృద్ధి అంచనాను 5.1 శాతానికి (6.2 నుంచి) తగ్గించింది.
2020-03-02ఫిబ్రవరిలో ఇండియా ఫ్యాక్టరీ కార్యకలాపాలు మందగించాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ ఇండెక్స్ (పిఎంఐ) జనవరిలో ఉన్న 55.3 స్థాయి నుంచి ఫిబ్రవరిలో 54.5కి తగ్గిపోయింది. అయితే, వరుసగా 31వ నెల కూడా 50 పాయింట్ల మార్కుపైనే ఉంది. అంతకంటే తక్కువకు దిగజారితే నెగెటివ్ గ్రోత్ నమోదవుతుంది. ఫిబ్రవరిలో ఆర్డర్లు బాగానే ఉన్నా ‘కరోనా’ భయం సెంటిమెంట్ ను దెబ్బ తీసినట్టు సర్వేలో వెల్లడైంది. ఎగుమతులపై ‘కరోనా’ ప్రభావం గట్టిగానే ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
2020-03-02 Read Moreగత మూడేళ్ళుగా ఇండియాలో నిరుద్యోగ సమస్య పెరిగింది. 2020 ఫిబ్రవరిలో నిరుద్యోగం రేటు ఏకంగా 7.78 శాతానికి పెరిగింది. 2019 అక్టోబర్ తర్వాత ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సి.ఎం.ఐ.ఇ) పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో జనవరిలో 5.97 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఫిబ్రవరిలో 7.37 శాతానికి పెరిగింది. అయితే, పట్టణ ప్రాంతాల్లో 9.70 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గిన ప్రభావం నిరుద్యోగంపై తీవ్రంగా ఉంది.
2020-03-02 Read Moreరూపాయి విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. సోమవారం మార్కెట్లు ముగిసేసరికి డాలరుకు 72.74 రూపాయలుగా నమోదైంది. క్రితం ముగింపు కంటే ఇది 50 పైసలు తక్కువ. ఇండియాలో కొత్తగా రెండు ‘కరోనా వైరస్’ కేసులు నమోదు కావడం దీనికి కారణంగా చెబుతున్నారు. గత శుక్రవారం రూపాయి విలువ 60 పైసలు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ ప్రభావం తీవరించడం స్టాక్ మార్కెట్లతో పాటు రూపాయి విలువపైనా ప్రభావం చూపిందన్నది విశ్లేషకుల కథనం.
2020-03-02ఏపీలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు ఫిబ్రవరి మాసంలో 23 శాతం పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 2,088 కోట్లు వసూలు కాగా ఈసారి రూ. 2,563 కోట్లు వసూలయ్యాయి. దేశవ్యాప్తంగా పెరుగుదల 12 శాతం (దిగుమతులను మినహాయిస్తే) ఉండగా కేరళలో 24 శాతం, అస్సాంలో 25 శాతం, ఏపీలో 23 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో పన్నులు తెలంగాణలో 6 శాతం (రూ. 3,460 కోట్ల నుంచి రూ. 3,667 కోట్లకు), మహారాష్ట్రలో 12 శాతం, గుజరాత్ లో 11 శాతం, తమిళనాట 8 శాతం పెరిగాయి.
2020-03-02ఫిబ్రవరి నెలలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్లు లక్ష కోట్లు దాటాయి (రూ. 1,05,366 కోట్లు). 2019 ఫిబ్రవరి వసూళ్ళ కంటే ఇది 8.35 శాతం అదనం (దిగుమతులపై పన్నులతో కలిపి). అయితే, ఈ ఏడాది జనవరి వసూళ్ళ (రూ. 1,10,828 కోట్లు) కంటే తక్కువే. 2020 ఫిబ్రవరిలో కేంద్ర జి.ఎస్.టి. రూపంలో రూ. 20,569 కోట్లు, రాష్ట్ర జి.ఎస్.టి. రూపంలో రూ.27,348 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జి.ఎస్.టి. రూపంలో రూ. 48,503 కోట్లు, సెస్ రూపంలో రూ.8,947 కోట్లు వసూలయ్యాయి.
2020-03-02 Read More