ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒ.ఎన్.జి.సి) షేర్ల విలువ 15 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. సోమవారం 12 శాతం దిగజారి రూ. 78.05కి చేరింది. ఫలితంగా ఒ.ఎన్.జి.సి. మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. 2004 ఆగస్టు తర్వాత ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం విలువ లక్ష కోట్ల కంటే తగ్గడం ఇదే తొలిసారి. సోమవారం ఉదయం 10.01కి కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 98,818 కోట్లుగా ఉన్నట్టు బిఎస్ఇ డేటా చూపిస్తోంది. ముడి చమురు ధర పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కోల్ ఇండియా, ఎన్.టి.పి.సి.ల కంటే ఒ.ఎన్.జి.సి.విలువ తక్కువ.

2020-03-09 Read More

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర సుమారు 30 శాతం తగ్గింది. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 31 డాలర్ల చొప్పున పడిపోయింది. చమురు ఉత్పత్తిని తగ్గించే విషయంలో ప్రధాన ఉత్పత్తిదారులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం ధరల పతనానికి దారి తీసింది. ఏప్రిల్ సరఫరాపై సౌదీ అరేబియా అసియా దేశాలకు బ్యారెల్ కు 4 నుంచి 6 డాలర్లు, అమెరికాకు 7 డాలర్ల చొప్పున ధరలను తగ్గించింది. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల మధ్య ధరల యుద్ధానికి ఇది ప్రారంభంగా భావిస్తున్నారు.

2020-03-09 Read More

బిఎస్ఇ సెన్సెక్స్ సోమవారం 1,634 పాయింట్లు (4.35%) పతనమైంది. ‘కరోనా వైరస్’, ఎస్ బ్యాంకు ప్రభావంతో 35,942 పాయింట్లకు దిగజారింది. నిఫ్టీ 50 కూడా 444 పాయింట్లు (4.05%) తగ్గి 10,550కు చేరింది. బిఎస్ఇ 500లోని 125 స్టాక్స్52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ 9.14 శాతం దిగజారింది. 11 సంవత్సరాలలో ఇదే అతి పెద్ద పతనం. ప్రభుత్వ రంగ సంస్థ ఒ.ఎన్.జి.సి. అత్యధికంగా (11%) నష్టపోయింది. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లు తగ్గిపోయింది.

2020-03-09 Read More

2020-21 ఆర్థిక సంవత్సరం చివరికి తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. 2,29,205 కోట్లకు పెరుగుతుందని తాజా బడ్జెట్ అంచనా. 2017-18లో రూ. 1,52,190 కోట్లుగా ఉన్న అప్పులు ఈ నెలాఖరుకు 1,99,215 కోట్లకు పెరుగుతున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పులు 2017-18లో 20.21%గా ఉంటే 2020-21కి 20.74%కి పెరగనున్నాయి. ఇంతవరకు చూస్తే బాగున్నట్టే అనిపిస్తుంది. ప్రభుత్వ అప్పులకు.. వివిధ శాఖల పరిధిలోని కార్పొరేషన్లు, సంస్థల రుణాలకు ఇచ్చిన గ్యారంటీలు కలిపితే మొత్తం బాధ్యతలు రూ. 3 లక్షల కోట్లు దాటుతున్నాయి.

2020-03-08

తెలంగాణ బడ్జెట్లో సొంత (పన్నులు+పన్నేతర) ఆదాయాన్ని రూ. 83,602 కోట్ల నుంచి రూ. 1,15,900 కోట్లకు పెంచి చూపించారు. ఒక్క ఏడాదిలో 38.63 శాతం పెరగడం సాధ్యమా? 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పెరుగుదల రిజిస్ట్రేషన్లు (55.13%), ఎక్సైజ్ (26.98%) ఆదాయంలో చూపించారు. సొంత పన్నుల ఆదాయంలో ఎక్సైజ్ (రూ. 16 వేల కోట్లు) ద్వారానే 18.75% సమకూరుతుందని అంచనా. 2018-19లో ఎక్సైజ్ వాటా 16,45% ఉండగా, 2019-20 సవరించిన అంచనాల్లో 17.66%కి పెరుగుతోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 10 వేల కోట్లు (11.76%) వస్తుందని అంచనా.

2020-03-08

ఆర్థికంగా బలమైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 2020-21లో మొత్తం రాబడి (రెవెన్యూ+కేపిటల్)లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 63.44 శాతంగా అంచనా వేశారు. రుణాల వాటా 21.65 శాతం కాగా కేంద్రం నుంచి వచ్చేది కేవలం 14.92 శాతం. 2018-19లో నిర్ధారించిన లెక్కల ప్రకారం సొంత వనరుల వాటా కేవలం 47.57 శాతం. 2019-20లో బడ్జెట్ అంచనాల ప్రకారం అది 58.14 శాతంగా ఉంటే సవరించిన అంచనాల్లో 58.35 శాతంగా మార్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు కూడా తగ్గిపోతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వ పన్నేతర ఆదాయాన్ని అసాధారణంగా అంచనా వేస్తున్నారు.

2020-03-08

2020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ వ్యయం 1,82,914.42 కోట్లుగా అంచనా వేశారు. 2019-20 సవరించిన అంచనాల కంటే ఇది 28.67 శాతం అదనం. రాష్ట్ర బడ్జెట్ పత్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరే మొత్తం రూ. 1,82,701.94 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ రశీదులు రూ. 1,43,151.94 కోట్లుగా పేర్కొన్నారు. అందులో సొంత పన్నుల ఆదాయం రూ. 85,300 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 30,600 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ. 16,726 కోట్లు, గ్రాంట్లు రూ. 10,525 కోట్లు చూపించారు.

2020-03-08

బిపిసిఎల్ లోని వాటా మొత్తం అమ్మకానికి ‘ఆసక్తి వ్యక్తీకరణ (ఇఒఐ)’ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కంపెనీలో ప్రభుత్వానికి 52.98 శాతం (114.91 కోట్ల షేర్లు) వాటా ఉంది. ఆ మేరకు పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకొని కొనుగోలుదారుకు యాజమాన్యాన్ని అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇఒఐల సమర్పణకు మే 2వరకు గడువు ఇచ్చింది. బి.పి.సి.ఎల్. గ్రూపులో 10 సబ్సిడరీలు, 12 అనుబంధ కంపెనీలు, 24 జాయింట్ వెంచర్లు ఉన్నాయి. అయితే, ఎన్.ఆర్.ఎల్.లో ఉన్న 61.65 శాతం ఈక్విటీ హోల్డింగ్ ఈ బిడ్ల పరిధిలోకి రాదు.

2020-03-07

‘కరోనా’ ప్రభావం మన కరెన్సీపై బాగానే కనిపిస్తోంది. గురువారం మార్కెట్లు ప్రారంభమవుతూనే రూపాయి విలువ 20 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరుకు 73.42 రూపాయల వద్ద ట్రేడింగ్ నడుస్తోంది. ఈ రోజు డాలరుకు 73.25 - 73.90 రేంజ్ లో రూపాయి ఊగిసలాడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. ఇండియాలో కరోనా కేసులు నిన్న (మార్చి 4న) 29కి పెరగడం, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించబోతున్నట్టు సంకేతాలు వెలువడటం... రూపాయి విలువపై ప్రభావం చూపినట్టు విశ్లేషిస్తున్నారు.

2020-03-05 Read More

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దయ్యాక... ఆ రాష్ట్రంలో రూ. 13,120 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు ఆసక్తి చూపించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2019 ఆగస్టు 5 నుంచి డిసెంబర్ 31 వరకు ఇంత మొత్తంలో 44 ఇఒఐలు వచ్చినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని కేంద్రం పేర్కొంది. అన్ని ప్రతిపాదనలనూ సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని బుధవారం లోక్ సభలో సమాధానమిచ్చింది.

2020-03-05
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page