నిన్న 2919 పాయింట్లు పడిపోయిన బిఎస్ఇ సెన్సెక్స్, శుక్రవారం (మార్చి 13న) ఓ దశలో 3434 పాయింట్లు (10.48%) పతనమై కల్లోలం సృష్టించింది.12 సంవత్సరాల్లో తొలిసారి బిఎస్ఇ, ఎన్ఎస్ఇలలో వాణిజ్యాన్ని నిలిపివేయవలసి వచ్చింది. అయితే.. తర్వాత కోలుకొని ఈ రోజు నష్టాన్ని పూర్తిగా పూడ్చుకోవడంతోపాటు, వాణిజ్యం ముగిసే సమయానికి 1325 పాయింట్లు (4.04%) లాభపడింది. అంటే.. కనిష్ఠానికి, ముగింపునకు మధ్య 4,760 పాయింట్ల తేడా ఉంది. ఇది అసాధారణమైన ఊగిసలాట. శుక్రవారం సెన్సెక్స్ 34,103 పాయింట్ల వద్ద ముగిసింది.

2020-03-13

నిన్న 2,919 పాయింట్ల పతనం తర్వాత శుక్రవారం (మార్చి 13) మార్కెట్ ప్రారంభంలో భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 30 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం 10.10 గంటల సమయంలో 29,194.97 పాయింట్లకు దిగజారింది. 3434.58 పాయింట్లు (10.48 శాతం) దిగజారడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. 10 శాతం పైగా పతనమైతే వాణిజ్యం నిలిపివేయాలన్న నిబంధన శుక్రవారం అక్కరకు వచ్చింది. 45 నిమిషాల విరామం తర్వాత ట్రేడింగ్ తిరిగి ప్రారంభం కాగా, సెన్సెక్స్ కోలుకుంది.

2020-03-13 Read More

గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. కానీ, ఈ గురువారం స్టాక్ మార్కెట్లలో అనేక మంది సంపదను తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా పతనమవుతున్న స్టాక్ మార్కెట్ల వరుసలోనే బిఎస్ఇ సెన్సెక్స్ అసాధారణంగా పడిపోతోంది. గురువారం తొలి గంటన్నరలోనే ఏకంగా రూ. 8,56,690 కోట్ల మేరకు ఇన్వెస్టర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. ఉదయం 10.30 సమయానికి దలాల్ వీధిలో మొత్తం మార్కెట్ విలువ రూ. 1,28,56,869 కోట్లకు తగ్గిపోయింది. బుధవారం వాణిజ్యం ముగిసే సమయానికి మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 1,37,13,559 కోట్లుగా ఉంది.

2020-03-12 Read More

గురువారం ఉదయం 11.10 గంటల సమయంలో బిఎస్ఇ సెన్సెక్స్ 33,075 పాయింట్లకు దిగజారింది. క్రితం రోజు ముగింపు (35,697) కంటే ఇది 2,622 పాయింట్లు తక్కువ. ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం దిగజారడం ఇదే ప్రథమం. ఓ అరగంట తర్వాత 33,214.71 పాయింట్ల వద్ద వాణిజ్యం కొనసాగుతోంది. గురువారమంతా స్టాక్ మార్కెట్లో అలజడే. ఎస్&పి బిఎస్ఇ 500 స్టాక్స్ లో దాదాపు సగం (217) 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి. 115 స్టాక్స్ ఏడాది క్రితం విలువలో 50 శాతం పైగా కోల్పోయాయి.

2020-03-12

చెప్పులు, దుస్తులు, సెల్ ఫోన్లు, ఎరువులపై జీఎస్టీ (వస్తు సేవల పన్ను)ని పెంచే అవకాశాలున్నాయి. ఈ నెల 14న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్ల మార్పుపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం.. మొబైల్ ఫోన్లపై 12 శాతం పన్ను ఉండగా, వాటిలో వినియోగించే కొన్ని పరికరాలపై 18 శాతం ఉంది. రూ. 1000 లోపు ధర ఉన్న చెప్పులపై 5 శాతం, ఎక్కువ ధర ఉన్నవాటిపై 18 శాతం పన్ను వేస్తున్నారు. వివిధ రకాల దుస్తులపై 5, 12, 18 శాతం చొప్పున ఉండగా.. ఎరువులపై 5 శాతం, వాటిలో వాడే సరుకులపై 12 శాతం పన్ను ఉంది.

2020-03-12 Read More

భారత స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. గురువారం వాణిజ్యం ప్రారంభం కాగానే ఈక్విటీ మార్కెట్లలో భారీగా పడిపోయాయి. 114 దేశాలకు వ్యాపించిన ‘కరోనా వైరస్’ను భూగోళ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ప్రకటించడం మార్కెట్లపై ప్రభావం చూపింది. సెన్సెక్స్, నిఫ్టీ 5 శాతం చొప్పున దిగజారాయి. బిఎస్ఇ సెన్సెక్స్ ప్రారంభంలో సుమారు 1800 పాయింట్లు పతనమై ప్రస్తుతం 1680 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ 10 వేల పాయింట్ల దిగువకు (9,925 స్థాయికి) పడిపోయింది.

2020-03-12 Read More

మొన్నటివరకు ఆసియాలోనే అతి పెద్ద సంపన్నుడు మన ముఖేష్ అంబానీ. నిన్న (మార్చి 9న) స్టాక్ మార్కెట్ పతనం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను 11 శాతం పడేయడంతో ఇప్పుడా సీటు పోయింది. ఆసియా నెం1 సంపన్నుడిగా తిరిగి చైనా టెక్ దిగ్గజం ‘జాక్ మా’ అవతరించాడు. నిన్న ఒక్క రోజే అంబానీ సంపద 5.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 43 వేల కోట్లు) హరించుకుపోవడంతో సంపన్నుల ర్యాంకులు తారుమారయ్యాయి. ‘కరోనా’ ప్రభావం కొనసాగుతుండగా.. నిన్న ప్రపంచ మార్కెట్లను చమురు ధరల పతనం కుదిపేసింది.

2020-03-10 Read More

సోమవారం భారత స్టాక్ మార్కెట్ రికార్డు పతనానికి ‘ఎస్’ బ్యాంకు కుంభకోణం ఓ కారణం. అయితే, బిఎస్ఇ సెన్సెక్స్ 1,941 పాయింట్లు పతనమైన రోజే ‘ఎస్’ బ్యాంకు షేరు విలువ 30.96 శాతం పెరిగింది. సోమవారం లాభాలతో ముగిసిన స్టాక్స్ లో ‘ఎస్’ బ్యాంకు అగ్ర స్థానంలో ఉండటం విశేషం. కుంభకోణాలతో సంక్షోభంలో కూరుకుపోయిన ఈ ప్రైవేటు బ్యాంకు నుంచి.. డిపాజిట్ల ఉపసంహరణపై గత వారం రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించింది. అప్పుడు భారీగా పడిపోయిన షేరు విలువ, ప్రభుత్వ అభయం తర్వాత తిరిగి పుంజుకుంటోంది.

2020-03-09

ముడి చమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు చేసే విధానం ఆచరణలో ప్రహసనంగా మారింది. సోమవారం ముడి చమురు ధరలు దాదాపు 30 శాతం తగ్గితే ఇండియాలో పెట్రోలు ధర 24 పైసలు, డీజిల్ ధర 25 పైసలు తగ్గింది. జనవరిలో బ్యారెల్ ముడి చమురు ధర 61 డాలర్లు ఉండగా మార్చి 9 నాటికి 30 డాలర్లకు తగ్గింది. అదే సమయంలో ఇండియాలో పెట్రోల్ ధర కేవలం రూ. 4.55 మేరకు తగ్గింది. ముడి చమురు ధరలు భారీగా పతనమైనా ఆ ప్రయోజనం వినియోగదారులకు చేరడంలేదు.

2020-03-09

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం పాతాళం వైపు పరుగులు తీశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల సమయానికి 2331 పాయింట్లు (సుమారు 6.2 శాతం) దిగజారింది. గత 15 నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి. కరోనా వైరస్, ఎస్ బ్యాంకు సంక్షోభం, క్రూడాయిల్ ధరల తగ్గుదల వంటి పరిణామాలతో మార్కెట్ పతనావస్థకు చేరుకుంది. క్రితం రోజు ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 37,573.62 పాయింట్ల వద్ద ఉంది. సోమవారం ఉదయం నుంచే మార్కెట్ అల్లకల్లోలంగా మారింది.

2020-03-09
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page