అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర... ఆంధ్రలో టీడీపీ ఉన్నా, వైసీపీ వచ్చినా... భారీ కాంట్రాక్టులలో ఓ కంపెనీ హవా సాగుతోంది. త్వరలో రూ. 65 వేల కోట్ల అంచనా వ్యయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టబోతున్న సాగునీటి ప్రాజెక్టులలో సగం పనులు ఈ ఒక్క కంపెనీకే వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. తనకు ఆసక్తి ఉన్న పనులన్నీ తనకు.. మిగిలిన కాంపొనెంట్స్ మాత్రం వేరేవారికి వెళ్ళేలా ఆ కంపెనీ వ్యూహరచన చేసినట్టు చెబుతున్నారు. ఈ కంపెనీకి ఇష్టం లేని కారణంగానే.. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్.ఎ.ఎం) ఆలోచనను ప్రభుత్వం విరమించుకుందని చర్చ జరుగుతోంది.
2020-05-06 Read Moreతెలంగాణలో మద్యం దుకాణాలను తెరవవలసిన అవసరం ఉందంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో మూతబడ్డ గుడుంబా కేంద్రాలు తెరుచుకున్నాయని, పొరుగున ఉన్న నాలుగు రాష్ట్రాల్లోనూ మద్యం షాపులు తెరవడంతో తెలంగాణవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్నిచోట్లా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. భౌతిక దూరం పాటించకపోతే గంటలోనే షాపు మూతబడుతుందని యజమానులను సిఎం హెచ్చరించారు.
2020-05-05తెలంగాణలో ‘లాక్ డౌన్’ను మే 29 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఏ వైరస్ కట్టడికైనా 70 రోజుల సైకిల్ చాలా ముఖ్యమని నిపుణులు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతుందని కేసీఆర్ చెప్పారు. రాత్రి వేళ కర్ఫ్యూ రాష్ట్రమంతా ఉంటుందని, సాయంత్రం 6 గంటలకే పని ముగించుకొని 7 గంటల లోపల ఇళ్ళకు చేరాలని ప్రజలకు సూచించారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవలసి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసులు కఠినంగా ఉంటారని, సహకరించాలని ప్రజలకు విన్నవించారు.
2020-05-05మద్యం ధరలు పెంచి అమ్మకాలను నియంత్రిస్తున్నందున కల్తీ మద్యం రావచ్చని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగొచ్చని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటివి ఎక్కడా కనిపించకూడదని కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో హుకుం జారీ చేశారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలను హెచ్చరించిన సిఎం, ఈ వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ‘‘ఈ విషయంలో నన్ను నిరాశపరచొద్దు’’ అని జగన్ వ్యాఖ్యానించారు. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకే ధరలను భారీగా పెంచామని చెప్పారు.
2020-05-05‘లాక్ డౌన్’ సమయంలో మద్యం షాపులు తెరిచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం, మంగళవారం ‘దిద్దుబాటు చర్యలు’ చేపట్టింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని అనుసరించి మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచింది. నిన్న ఏపీలో 25 శాతం పెంపుదలతో మద్యాన్ని అమ్మారు. అయితే, ‘లాక్ డౌన్’ నిబంధనలను కూడా పట్టించుకోకుండా మందుబాబులు షాపుల వద్ద బారులు తీరారు. ఢిల్లీలో కూడా అవే సీన్లు. దీంతో.. ధరలను 70 శాతం పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఉదయానికి ఏపీ ప్రభుత్వం కూడా మరో 50 శాతం రేట్లు పెంచింది. అలవాటు పడిన ప్రాణాలు ఇప్పుడైనా ఆగుతాయా?!
2020-05-05మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఏపీలో సోమవారం ఉదయం నుంచే ఊరూరా పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. దుకాణాలు తెరిచినందుకు సంతోషంతో మందు బాబులు బాణా సంచా కాల్చడం, చిందులు వేయడం వంటి దృశ్యాలు అక్కడక్కడా కనిపించాయి. కొన్ని చోట్ల మనిషికీ మనిషికీ మధ్య దూరం పాటించగా, చాలా చోట్ల ఆ కనీస జాగ్రత్త కూడా తీసుకోలేదు. రెడ్ జోన్లను మినహాయించి అన్నిచోట్లా మద్యం అమ్మకాలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం మద్యం రేట్లను భారీగా పెంచినా అలవాటుపడిన ప్రాణాలు ఏమాత్రం ఆగలేదు.
2020-05-04కేంద్రప్రభుత్వ ‘కరోనా’ ప్యాకేజీ ఏ మూలకూ సరిపోదన్న విమర్శల మధ్య.. పంపిణీ మరీ అధ్వానంగా ఉంది. దేశంలో 19 కోట్ల కుటుంబాలకు కేజీ చొప్పున పప్పులు అందించాలన్న నిర్ణయం ఆచరణలో అరకొరగా అమలవుతోంది. ఏప్రిల్ మాసం కోటాలో ఇప్పటిదాకా 15 శాతమే పంపిణీ చేశారు. లక్షా 96 వేల టన్నులు పంపిణీ చేయవలసి ఉండగా 30 వేల టన్నులు మాత్రమే ప్రజలకు అందింది. పిఎం గరీబ్ కళ్యాణ్ పథకం కింద మూడు నెలల పాటు ప్రతి కుటుంబానికీ కేజీ చొప్పున పప్పులు పంపిణీ చేయనున్నట్టు మార్చి 26న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2020-04-26గత నెలలో పెంచిన కరువు భత్యం (డిఎ) చెల్లింపులను వాయిదా వేయడం కాదు.. ఏకంగా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం!. ప్రస్తుతం ఉన్న 17 శాతం రేటునే 2021 జూలై1 వరకు అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. 2020 జనవరి నుంచి బకాయి ఉన్న మొత్తాన్ని కూడా రద్దు చేసింది. కేంద్ర ఉద్యోగులకు డి.ఎ.ను 21 శాతానికి పెంచుతూ గత నెలలో మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘కరోనా’ ప్రభావంతో ఆదాయం తగ్గడంతో.. డిఎ పెంపుదలను 2021 జూలై తర్వాతే అమలు చేయాలని తాజాగా నిర్ణయించారు. 49 లక్షల ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లపై ఈ ప్రభావం పడుతోంది.
2020-04-23మే 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమలవుతున్న ‘లాక్ డౌన్’ను తెలంగాణలో మే 7 వరకు పొడిగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఈ నెల 20 నుంచి దేశవ్యాప్తంగా ఇస్తున్న సడలింపులు కూడా తెలంగాణలో ఉండవని స్పష్టం చేశారు. ఆన్ లైన్ ఆర్డర్లతో ఆహారాన్ని డోర్ డెలివరీ చేయడంపై నిషేధం విధిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. మే 5న మరోసారి మంత్రివర్గం సమావేశమై తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో 858 ‘కరోనా’ కేసులు నమోదు కాగా 21 మంది మరణించారని చెప్పారు.
2020-04-19అత్యవసరం కాని సరుకులను సరఫరా చేయవద్దని ఇ కామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘లాక్ డౌన్ 2.0’ కోసం ఈ నెల 15, 16 తేదీల్లో ఇచ్చిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదివారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో... ఇ కామర్స్ వేదికల్లో అత్యవసరం కాని సరుకుల అమ్మకంపై నిషేదం అమలవుతుంది.
2020-04-19