భారతదేశం ప్రజాస్వామ్య హోదాను కోల్పోతూ నిరంకుశీకరణకు గురవుతోందని స్వీడన్ కు చెందిన పరిశోధనా సంస్థ ‘వి- డెెమ్’ స్పష్టం చేసింది. గోతెన్ బర్గ్ యూనివర్శిటీకి చెందిన ఈ సంస్థ తన ‘డెమోక్రసీ రిపోర్టు- 2020’ని తాజాగా విడుదల చేసింది. మోదీ ప్రభుత్వ హయాంలో మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాల స్థానం క్షీణించిందని, ఇండియా ప్రజాస్వామ్య హోదాను కోల్పోయే దశ అంచుల్లో ఉందని వి- డెెమ్ పేర్కొంది. నిరంకుశీకరణ ఇండియాతో పాటు అమెరికా, బ్రెజిల్ లను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, 2001 తర్వాత తొలిసారిగా నిరంకుశ రాజ్యాలు మెజారిటీ (54 శాతం ప్రజలతో కూడిన 92 దేశాలు) అయ్యాయని నివేదిక పేర్కొంది.

2020-10-26

ఇతర రాష్ట్రాల్లో తయారైన మద్యాన్ని రాష్ట్రంలోకి రవాణా చేయడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో అమలవుతున్న పన్నులు, సుంకాలు, ఫీజులు చెల్లించిన మద్యానికే అనుమతి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. అంటే, పొరుగు రాష్ట్రాల్లో పన్నులు చెల్లించినా తిరిగి ఇక్కడా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో విదేశీ మద్యానికి మాత్రం యథాతథంగా అనుమతి ఉంటుంది. పొరుగు మద్యం మూడు సీసాల వరకు తెచ్చుకునేలా గతంలో అవకాశం ఉండగా... ఏపీలో అధిక ధరల కారణంగా చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమ్మకాలపై ఇది ప్రభావాన్ని చూపడంతో

2020-10-26

విభజన హామీలలో ప్రధానమైన ‘ప్రత్యేక హోదా’కు గతంలోనే సమాధి కట్టిన కేంద్ర ప్రభుత్వం, రెండో ప్రధాన హామీ పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ముసుగు తొలగించింది. ప్రాజెక్టులో డ్యామ్ నిర్మాణానికి మాత్రమే తాము నిధులు ఇస్తామని, ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయ-పునరావాస ప్యాకేజీతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. విజయవాడ వాసి సౌరభ్ కుమార్ సమాచార హక్కు చట్టం కింద సమర్పించిన దరఖాస్తుకు కేంద్రం బదులిచ్చింది. ఇప్పటివరకు ఖర్చయిన రూ. 8,614 కోట్లలో కేంద్రం నుంచి నేరుగా రూ. 950 కోట్లు, నాబార్డు ద్వారా రూ. 7,664 కోట్లు వచ్చినట్టు ఆ సమాధానంలో పేర్కొన్నారు.

2020-10-26

విశాఖపట్నంలోని ‘గీతమ్’ విశ్వవిద్యాలయం ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిందంటూ కొన్ని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. శనివారం వేకువ జామునే జెసిబిలతో వెళ్లిన అధికారులు వర్శిటీ ప్రధాన ద్వారం, సెక్యూరిటీ గది, ప్రహరీ గోడలను కూల్చివేసి లోపలి వరకు హద్దు రాళ్లు పాతారు. రుషికొండ, ఎన్నాడ గ్రామాల పరిధిలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమి ‘గీతమ్’ ఆక్రమణలో ఉందని స్థానిక ఆర్డీవో కిషోర్ చెప్పారు. నోటిసులు ఇవ్వకుండా కూల్చివేశారని వర్శిటీ యాజమాన్యం ఆరోపించగా, కొద్ది నెలల క్రితమే మార్కింగ్ చేశామని... ఈ విషయం యాజమాన్యం ‘దృష్టి’లో ఉందని ఆర్డీవో పేర్కొన్నారు.

2020-10-24

దేశంలో ప్రజలందరికీ ‘కరోనా’ వ్యాక్సిన్ అందించడానికి గాను కేంద్ర ప్రభుత్వం రూ. 50,000 కోట్లు కేటాయించినట్టు ఓ ముఖ్యమైన వార్త గురువారం వెల్లడైంది. రెండు డాలర్ల ఖరీదైన ఇంజెక్షన్లు ఒక్కొక్కరికి రెండు చొప్పున ఇవ్వడానికి, ఇతర ఖర్చులకు కలిపి అంత మొత్తం అవుతుందని కేంద్రం అంచనా వేసిందట. మొత్తంగా తలసరి వ్యయం 6 నుంచి 7 డాలర్లు అవుతుందన్నది కేంద్రం అంచనా. ఈ మొత్తాన్ని నడుస్తున్న ఆర్థిక సంవత్సరమే కేటాయిస్తున్నందున నిధుల కొరత ఉండదని చెబుతున్నారు.

2020-10-22

లాక్ డౌన్ ముగిసినా ‘కరోనా’ ఇంకా ఉన్నదన్న విషయాన్ని అందరూ గమనంలో ఉంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పండుగలు సమీపిస్తున్నసందర్భంగా మంగళవారం సాయంత్రం ప్రధాని జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఆయన జాతిని ఉద్ధేశించి ప్రసంగించడం ఇది ఏడోసారి. అమెరికా, యుకె, బ్రెజిల్ వంటి దేశాల్లో ‘కరోనా’ మరణాలు 10 లక్షల జనాభాకు 600కు పైగా నమోదు కాగా, ఇండియాలో మరణాలు 83కి పరిమితమయ్యాయని మోదీ చెప్పారు. పౌరుల ప్రాణాలను కాపాడటంలో సంపన్న దేశాలకంటే ఇండియా విజయవంతమైందని పేర్కొన్నారు.

2020-10-20

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్.ఇ.సి) స్థానం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. తన తొలగింపు ఉత్తర్వులను కొట్టివేస్తూ.. తిరిగి కమిషనర్ గా నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని నిమ్మగడ్డ కోరారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వనందున తన తీర్పు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. గవర్నరును కలవాలని హైకోర్టే నిమ్మగడ్డకు సూచించింది. ‘కరోనా’ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకు నిమ్మగడ్డపై సిఎం జగన్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే.

2020-07-20

ఆర్టీసీ ఎండీ స్థానం నుంచి బదిలీ చేయడంపై మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఐపిఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పైన ప్రభుత్వం మండిపడింది. ఎ.పి.ఎస్.పి. బెటాలియన్స్ ఏడీజీ స్థానం నుంచి కూడా బదిలీ చేస్తూ.. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ నీలం సాహ్నీ ఆదేశించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా.. ఆయన వద్ద పని చేసిన అధికారుల్లో తనను మినహా మిగిలిన అందరినీ సీబీఐ ప్రశ్నించిందని, తన నిజాయితీకి అదే సాక్ష్యమని 3 రోజుల క్రితం మాదిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ‘అభ్యంతరకర ప్రకటన’లపై నీలం సాహ్నీ వివరణ కోరారు.

2020-07-16

13 జిల్లాలను 26గా విభజించే ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధ్యయన కమిటీని నియమించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కమిటీ కన్వీనరుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా సీసీఎల్ఎ, జీఎడి (సర్వీసెస్), ప్రణాళికా శాఖల కార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. 25 లోక్ సభ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మారుస్తామని సిఎం జగన్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. ‘అరకు’ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించినందున.. ఆ నియోజకవర్గాన్ని రెండుగా విభజించే అంశాన్ని పరిశీలించాలని సిఎం సూచించారు.

2020-07-15

కరోనా వైరస్ డిసీజ్ (కోవిడ్) బాధితులకు వైద్యం చేయడానికి నిరాకరించే ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ‘కోవిడ్’తో మరణించినవారి అంత్యక్రియలకు రూ. 15 వేలు ఇవ్వాలని సిఎం మంగళవారం ‘కరోనా’ సమీక్షా సమావేశంలో ఆదేశించారు. కరోనా బాధితుల అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కరోనా’ వ్యాప్తిని ఎదుర్కోవడానికి 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పైగా నర్సుల ‘డేటాబేస్’ సిద్ధం చేశామని అధికారులు సిఎంకు వివరించారు.

2020-07-14
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page