గాల్వన్ లోయ ఘర్షణలో మరణించిన పిఎల్ఎ సైనికులను అవమానించారంటూ ముగ్గురు వ్యక్తులను చైనా నిర్బంధించింది. అరెస్టయినవారిలో కియు జిమింగ్ (38) అనే జర్నలిస్టు ఉన్నారు. గాల్వన్ లోయలో గత ఏడాది జూన్ 15న జరిగిన ఘర్షణలో 21 మంది భారత సైనికులు మరణించగా, ప్రభుత్వం అప్పుడే వెల్లడించింది. అయితే, తమ వైపు నలుగురు మరణించినట్టు చైనా మొన్ననే వెల్లడించింది. ప్రకటనకు 8 నెలలు ఎందుకు పట్టిందని ‘వీబో’లో ప్రశ్నించిన జిమింగ్, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

2021-02-21

50 లక్షల టన్నుల సామర్ధ్యంతో మోడల్ స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని, ఇతర మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత తర్వగా ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆధిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. రైతులనుంచి మెరుగైన సేకరణ కోసం నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలని ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాంశు పాండే ఈ నెల 29న ముఖ్యమంత్రి యోగితో జరిగిన సమావేశంలో కోరారు. ఆ సమావేశంలో ఎఫ్.సి.ఐ. ఛైర్మన్ కూడా ఉన్నారు.

2021-01-30 Read More

ఎన్నికల కమిషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కయ్యం శనివారం మరో దశకు చేరింది. పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదలకు ముందు, తర్వాత కమిషనర్ రమేష్ కుమార్ నిర్వహించిన సమావేశాలకు ప్రభుత్వ అధికారులంతా డుమ్మా కొట్టారు. సిఎం జగన్ పంతానికి అనుగుణంగా వ్యవహరించారు. నోటిఫికేషన్ ప్రకటించాక జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రమేష్ కుమార్ కు అంతటా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కలెక్టర్లు, ఎస్పీలు సహా అంతా గైర్హాజరు కావడంతో.. సుమారు రెండు గంటల పాటు రమేష్ కుమార్ వేచి చూశారు.

2021-01-23

హైకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఎస్ఇసి స్పష్టం చేశారు. దీంతో తొలి దశ పోలింగ్ కు సంబంధించి శనివారమే నోటిఫికేషన్ వెలువడనుంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాలుగు దశల్లో ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో జరగనుంది. రెండో దశ నోటిఫికేషన్ 27న, మూడో దశకు సంబంధించి 31న, నాలుగో దశకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న వెలువడతాయి.

2021-01-21

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు విదేశీ ప్రభుత్వాధినేత ఎవరూ హాజరు కావడం లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ప్రకటించారు. ముఖ్య అతిధి లేకుండా గణతంత్ర దినోత్సవం (26న) జరగడం 55 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది. తొలుత యుకె ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించినా, ఆ దేశంలో సరికొత్త రకం కరోనా వైరస్ విజృంభణ, ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. తర్వాత భారత సంతతికి చెందిన సురినామ్ అధ్యక్షుడు హాజరవుతారని వార్తలొచ్చినా ఖాయం కాలేదు.

2021-01-14

2020 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న చైనా, దాన్ని సాధించింది. దేశంలో పేదరికంతో బాధపడిన ప్రజలందరినీ ప్రస్తుత ప్రమాణాల (వార్షికాదాయం 4,000 యువాన్లు లేదా సుమారు రూ. 45,000) ప్రకారం దారిద్య్రరేఖ ఎగువకు తీసుకొచ్చినట్టు ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ సోమవారం ప్రకటించారు. చైనాలో 2012 నుంచి ఏకంగా 9.9 కోట్ల మంది ఈ రేఖను అధిగమించారు. గ్విజౌ ప్రావిన్సులో పేదరికంతో బాధపడిన చివరి తొమ్మిది కౌంటీలు కూడా దారిద్య్రరహితంగా మారినట్టు ప్రకటించాక జిన్‌పింగ్ మాట్లాడారు.

2020-12-14

2022 ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం నీటిని పంట పొలాలకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలవరం డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన సిఎం, నిర్మాణ పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో 2021 ఫిబ్రవరి లేదా మార్చినాటికి సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.

2020-12-14

జాతీయ రాజధాని సరిహద్దుల్లో మంగళవారం మరిన్ని పోలీసు బలగాలను మోహరించింది కేంద్ర ప్రభుత్వం. పోలీసులు రోడ్లపైన అనేక వరుసల్లో బ్యారికేడ్లు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుపెట్టారు. ఢిల్లీలోకి ప్రవేశించే మరో రెండు మార్గాలను మూసివేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఉత్తర భారత రైతులు రెండు వారాలుగా రాజధాని సరిహద్దుల్లోని రహదారులపై మోహరించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ చుట్టూ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

2020-12-08

ఏపీలో 30.6 లక్షల మందికి డిసెంబర్ 25న (క్రిస్మస్ రోజు) ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 23 వేల కోట్ల విలువైన 66,518 ఎకరాలను సేకరించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం లబ్దిదారులకు డి-ఫాం పట్టాలు పంపిణీ చేస్తామని, కోర్టులో వివాదం పరిష్కారమయ్యాక కన్వేయన్స్ డీడ్ ఇస్తామని, 28.3 లక్షల మందికి ప్రభుత్వమే మూడేళ్లలోపు ఇళ్లు కట్టిస్తుందని కేబినెట్ అనంతరం మంత్రులు చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది.

2020-11-27

చైనాలో ఏది చేసినా అసాధారణ స్థాయిలోనే ఉంటుంది. తాజాా జింజియాంగ్ ప్రావిన్సులోని కాష్గర్ ప్రాంతంలో ఒక 17 సంవత్సరాల యువతికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో, ఆ ప్రాంతం మొత్తంలోని ప్రజలకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తోంది చైనా ప్రభుత్వం. సోమవారం నాటికి 28.4 లక్షల మందికి పరీక్షలు పూర్తి కాగా, మంగళవారం మరో 20 లక్షల మందిని పరీక్షిస్తున్నారు. సోమవారం నిర్వహించిన పరీక్షలలో లక్షణాలు లేని 161 కేసులు బయటపడ్డాయి. తొలుత కరోనా వైరస్ బయటపడిన ఊహాన్ నగరంలోని కోటీ 10 లక్షల మందికీ పరీక్షలు నిర్వహించిన చైనా, తర్వాత బీజింగ్, షాంగై, క్వింగ్డావో వంటి నగరాల్లో ప్రజలందరినీ పరీక్షించింది.

2020-10-27
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page