‘‘మంత్రివర్గంలో లాయర్లు, డాక్టర్లు, పీజీలు, పి.హెచ్.డి.లు ఉన్నారు’’ కేంద్ర ప్రభుత్వం ఘనంగా చాటుకుంటున్న విషయం ఇది. ఈ మంత్రివర్గపు మరో ముఖాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఆవిష్కరించింది. కేంద్ర మంత్రివర్గంలోని 78 మందిలో 33 మంది (42%) పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 24 మంది (31%) పైన హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఉండటం గమనార్హం. అమిత్ షా, గిరిరాజ్ సింగ్, శోభా కరంద్లాజే, నిత్యానంద రాయ్, ప్రహ్లాద్ జోషిలపైన మత సామరస్యానికి భంగం కలిగించారనే అభియోగాలున్నాయి.
2021-07-10మంత్రివర్గంలో 65 శాతం పోస్టులతోనే రెండేళ్ళకు పైగా గడిపిన ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం ఒక్కసారే భారీగా మార్పులు, చేర్పులు చేశారు. 12 మంది మంత్రులకు ఉద్వాసన పలకగా, 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 15 మందికి కేబినెట్ హోదా దక్కింది. ఉద్వాసనకు గురైన ఏడుగురు కేబినెట్ మంత్రుల స్థానాల్లోకి ఏడుగురు కొత్తవారు రాగా, ఇప్పటిదాకా ‘సహాయ’ మంత్రులుగా చేసిన 8 మందికి ప్రమోషన్ లభించింది. సహాయ మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన పలకగా 28 మంది కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు.
2021-07-07కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా ‘సహకార మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేసింది. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ మంత్రిత్వ శాఖ పరిపాలనాపరమైన, న్యాయ, విధానపరమైన నిర్మాణాన్ని అందిస్తుందని కేబినెట్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. సహకార సంస్థల్లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రక్రియలకు, బహుళ-రాష్ట్ర సహకార సంస్థ (ఎం.ఎస్.సి.ఎస్)ల అభివృద్ధికి ఈ మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
2021-07-06మాజీ సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జూలై 8న రైతు దినోత్సవం జరపాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. జూలై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించిన కేబినెట్, వైఎస్ఆర్ బీమా పథకానికి ఆమోద ముద్ర వేసింది. 100 సమీకృత అక్వా లేబొరేటరీలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 45 నూతన రైతు బజార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2021-06-30కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం, రూ. 6.29 లక్షల కోట్ల ప్యాకేజీలోని వివిధ పథకాలకు విడివిడిగా ఆమోదం తెలిపింది. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కాం)లలో సంస్కరణల ఆధారిత పంపిణీ పథకాన్ని రూ. 3.03 లక్షల కోట్లతో ప్రతిపాదించగా, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) బుధవారం ఆమోదించింది. ఎల్.జి.ఎస్.సి.ఎ.ఎస్, ఇ.సి.ఎల్.జి.ఎస్. రుణ పథకాలు, భారత్ నెట్ వంటి ప్రతిపాదనలకూ ఆమోదం లభించింది.
2021-06-30వ్యాక్సినేషన్లో చైనా దూసుకుపోతోంది. ఇప్పటివరకు చైనా ప్రజానీకానికి 118 కోట్ల డోసులు అందాయి. ఇండియాలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యకు ఇది 361 శాతం. ఇక్కడ రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, చైనాను మినహాయించి డేటా విడుదల చేస్తోంది. సోమవారం ప్రధాని మోదీ ట్విట్టర్లో పెట్టిన గ్రాఫ్ ప్రకారం అమెరికాలో 32.33 కోట్ల వ్యాక్సిన్లు వేయగా, ఇండియా 32.36 కోట్ల డోసులతో ఆ దేశాన్ని అధిగమించింది. రోజుకు 2 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేస్తున్న చైనాతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది.
2021-06-28ప్రజలకు వ్యాక్సిన్లు వేయడంలో ఇండియా తాజాగా అమెరికాను మించిపోయినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత వ్యాక్సిన్ కార్యక్రమం ఊపందుకున్నదంటూ మోదీ ఒక చార్టును ట్విట్టర్లో పంచుకున్నారు. దాని ప్రకారం ఇప్పటిదాకా అమెరికాలో 32.53 కోట్ల వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వగా, ఇండియాలో ఆ సంఖ్య 32.36 కోట్లు దాటింది. మోదీ ఇంకా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యుకె వంటి తక్కువ జనాభా ఉన్న ధనిక దేశాలను కూడా పోల్చారు. అందరికీ, ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు.
2021-06-28రాష్ట్రంలో 18-45 సంవత్సరాల వయసువారికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ (మే 1 నుంచి) వేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కోవిడ్ పరిస్థితిపై తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎం ఈ విషయాన్ని వెల్లడించారు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి గతంలో నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, యువత విషయంలో ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టిన సంగతి తెలిసిందే.
2021-04-23అపార్టుమెంట్లు, మొహల్లాలు, స్థానిక సమాజాలలో చిన్న కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా అందరూ కొవిడ్ నియమనిబంధనలను పాటించేలా సహాయపడాలని యువతకు విన్నవించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘‘మనం ఆ పని చేస్తే, ప్రభుత్వాలు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయనక్కర్లేదు. కర్ఫ్యూ, లాక్ డౌన్ విధించనవరం లేదు’’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా మహమ్మారి రెండో ఉప్పెన మరణ మృదంగం మోగిస్తున్న నేపథ్యంలో మోదీ మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
2021-04-20మయన్మార్ శరణార్థులను వెనక్కి తిప్పికొట్టాలంటూ ఈ నెల 26న జారీ చేసిన ఆదేశాలను మణిపూర్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మయన్మార్ లో సైనిక పాలకుల అణచివేత కారణంగా చాలామంది పొరుగు దేశాలకు వలస వస్తున్న నేపథ్యంలో, ఈ నెల 26న ఆ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. శరణార్థుల కోసం క్యాంపులు తెరవవద్దని, ఆహారం- వసతి ఏర్పాట్లు చేయవద్దని అందులో పేర్కొన్నారు. అయితే, దీనిపై పొరుగు రాష్ట్రం మిజోరాంలో ఆగ్రహం వ్యక్తమైంది.
2021-03-30 Read More