రాష్ట్రంలో హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్), వ్యర్ధ పదార్ధాలపై పన్ను, ఎర్రచందనం అమ్మకం, సరైన ఇసుక విధానం వంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. సామాన్యులపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. శనివారం ఆర్థిక, ఆదాయార్జన శాఖల అధికారులతో జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

2019-06-01

దేశంలోని రైతులందరికీ ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ 2.0 తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఇంతకు ముందు 2 హెక్టార్ల వరకు పొలం ఉన్న రైతులకే ఏడాదికి రూ. 6000 చొప్పున ఇవ్వడానికి పథకాన్ని రూపొందించారు. దాని ప్రకారం లబ్దిదారుల సంఖ్య 12.50 కోట్లు కాగా.. తాజా నిర్ణయంతో మిగిలిన రెండు కోట్ల మందికీ సాయం అందుతుంది. వార్షిక వ్యయం రూ. 72 వేల కోట్లనుంచి రూ. 87 వేల కోట్లకు పెరుగుతుంది.

2019-05-31

కేంద్ర సాయుధ బలగాల పిల్లలకు స్కాలర్ షిప్ ఇచ్చే పథకాన్ని.. మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రాల పోలీసుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్ణయించారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్ నుంచి నెలవారీగా ఇచ్చే మొత్తాన్ని బాలురకు రూ. 2,000 నుంచి రూ. 2,500కు, బాలికలకు రూ. 2,250 నుంచి రూ. 3,000కు పెంచాలని నిర్ణయించారు. ఈ పథకంలో మార్పులకు ఆమోదించడమే తన ప్రభుత్వ మొదటి నిర్ణయమని మోదీ ప్రకటించారు.

2019-05-31
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page