‘ప్రత్యేక కేటగిరి హోదా’ అంశాన్ని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ‘నీతిఆయోగ్’ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు. ‘ప్రత్యేక కేటగిరి హోదా’ ఇవ్వడానికి నిర్దేశించుకున్న ప్రమాణాల్లో ‘ప్రకృతి వైపరీత్యాలు’ కూడా చేర్చాలని ఆయన విన్నవించారు. ఒడిషా రాష్ట్రం తుపాన్ల ధాటికి గురవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ... ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే రాష్ట్రాలను ‘ప్రత్యేక కేంద్రీకరణ రాష్ట్రాలు’గా గుర్తించి ‘ప్రత్యేక కేటగిరి హోదా’తో వచ్చే ప్రయోజనాలను కల్పించాలని కోరారు.
2019-06-15 Read Moreవిభజననాటి హామీ ప్రకారం రాష్ట్రానికి ‘ప్రత్యేక కేటగిరి హోదా’ ఇవ్వాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘నీతిఆయోగ్’ ఐదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జగన్ మాట్లాడారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తలసరిన రూ. 14,411గా ఉంటే ఏపీకి కేవలం రూ. 8,397 వచ్చిందని, 2015-20 కాలంలో ఏపీ రెవెన్యూ లోటు రూ. 22,113 కోట్లుగా ఆర్థిక సంఘం అంచనా వేస్తే 66,362 కోట్లకు పెరిగిందని జగన్ వివరించారు.
2019-06-15ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీకి సంబంధించి వివిధ కోణాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర రవాణా శాఖ ఒక నిపుణుల కమిటీని నియమించింది. మాజీ ఐపీఎస్ అధికారి సి. ఆంజనేయరెడ్డి ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఈడీ, పూణెలోని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ మాజీ డైరెక్టర్ సుదర్శనం, ఆర్థిక శాఖ కార్యదర్శి ఒకరు సభ్యులుగా ఉంటారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా ఈ కమిటీ పరిశీలనాంశాల్లో ఒకటి.
2019-06-14ఏపీ నూతన మంత్రివర్గం తొలి సమావేశం సోమవారం ఉదయం జరగనుంది. సామాజిక పింఛను మొత్తాన్ని రూ. 2,250కు, ఆశా వర్కర్ల వేతనాలను రూ. 10,000కు పెంచుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రైతు భరోసా పథకం కింద తొలి విడతగా అక్టోబర్లో రూ. 12,500, ఆర్టీసీ విలీనం, ఉద్యోగులకు మధ్యంతర భృతి, మున్సిపల్ కార్మికులకు, హోంగార్డులకు వేతనాలు పెంచడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు వంటి ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది.
2019-06-10ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ముగ్గురు మహిళలు సహా 25 మంది ఒకేసారి శనివారం మధ్యాహ్నం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వెలగపూడిలోని సచివాలయం ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు. మే 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజులకు మే 30న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ కూర్పునకు 9 రోజుల వ్యవధి తీసుకున్న జగన్, ఒకేసారి 25 మందితో తన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
2019-06-08సీనియర్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖలో పని చేసిన పీవీ రమేష్, తర్వాత డిప్యుటేషన్ పై రాష్ట్రం వదిలి వెళ్లారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి వచ్చిన ఆయనకు సిఎంఒలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. కాగా గతంలో ముఖ్యమంత్రికి ఒ.ఎస్.డి.గా నియమితులైన ఐఎఎస్ అధికారి జె. మురళి పోస్టింగ్ ను సిఎంకు అదనపు కార్యదర్శిగా మార్చారు.
2019-06-07ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఈ నెల 8వ తేదీన ఉదయం 11.49 గంటలకు అమరావతి సచివాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం గురువారం సమీక్షించారు. బందోబస్తు వివరాలను పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ వివరించారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేవారికోసం ఆహ్వాన పత్రికల వెనుకే రూట్ మ్యాప్ ముద్రించాలని సిఎస్ సూచించారు.
2019-06-06అవినీతి రహితంగా పారదర్శకంగా పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే, రహస్య జీవోల పరంపర మాత్రం కొనసాగుతోంది. గురువారం ఒక్క రోజే ఒక్క ఆర్థిక శాఖలోనే నాలుగు రహస్య జీవోలు విడుదలయ్యాయి. గురువారం ఆర్థిక శాఖ జారీ చేసింది ఈ నాలుగు జీవోలే కావడం గమనార్హం. జీవో ఆర్.టి. నెంబర్ 1094 నుంచి 1097వరకు జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
2019-06-06ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐదుగురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సహా 40 మందికి పైగా అధికారులకు స్థానచలనమైంది. 9 జిల్లాలకు కలెక్టర్లు మారారు. సీఆర్డీయే సహా ముఖ్యమైన స్థానాల్లోని అధికారులు మారిపోయారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న చాలామందికి పోస్టింగ్ ఇవ్వలేదు. సిఎం కార్యాలయంలో పని చేసినవారిలో ఒక్క గిరిజా శంకర్ కు మాత్రమే పోస్టింగ్ (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్) లభించింది.
2019-06-04ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో ఆయనను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అజేయ కల్లం సిఎం కార్యాలయానికి అధిపతిగా ఉంటారు. సిఎం కార్యాలయంలోని ఇతర అధికారులకు శాఖలను కేటాయిస్తారు. అన్ని శాఖలనుంచి సలహాలు కోరడానికి ఆయనకు అధికారం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులందరూ ఆయన జవాబుదారీగా ఉండాలి.
2019-06-04