పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ కేంద్రానికి నివేదిక పంపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ‘రివర్స్ టెండరింగ్’ చేపట్టింది. నిర్మాణ వ్యయం కింద సుమారు 4,000 కోట్లు రాష్ట్రానికి రావలసి ఉండగా, జూన్-జూలై సమయంలోనే రూ. 3,000 కోట్ల విడుదలకు కేంద్రం సిద్ధమైంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ చర్యల నేపథ్యంలో.. ఆ వ్యవహారం తేలాకే నిధులు విడుదల చేయవచ్చన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్టు తెలిసింది.

2019-10-04 Read More

రివర్స్ టెండరింగ్ పేరిట చేపట్టిన పోలవరం రీటెండరింగ్ ప్రక్రియలో ప్రధాన కాంట్రాక్టును మేఘ ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ప్రధాన ఆనకట్ట, జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రామాణిక విలువను రూ. 4,987 కోట్లుగా నిర్దేశించగా... టెండరు దాఖలు చేసిన ఏకైక సంస్థ ‘మేఘ’ రూ. 4,358 కోట్ల అంచనా వ్యయంతో బిడ్ దాఖలు చేసింది. ఒక్క సంస్థే బిడ్ దాఖలు చేసినా... ప్రభుత్వం సోమవారం దాన్ని ఖరారు చేసింది. నిర్దేశిత విలువ కంటే రూ. 629 కోట్లు (12.6 శాతం) తక్కువ కోట్ చేసినందున ఆమేరకు నిధులు మిగులుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

2019-09-23 Read More

పోలవరం టెండరును రద్దు చేసి మళ్ళీ పిలవడం వల్ల నిర్మాణం ఆలస్యమవుతుందని, వ్యయం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం హెడ్ వర్క్స్ చేస్తున్న నవయుగ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం తప్పించిన (ప్రీ క్లోజర్) నేపథ్యంలో పిపిఎ మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అథారిటీ ఛైర్మన్ ఆర్.కె. జైన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం అనంతరం ఓ ప్రకటన విడుదలైంది. తుది నిర్ణయం తీసుకోబోయే ముందు మరోసారి ఆలోచించాలని అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

2019-08-13

86 శాతం అసెంబ్లీ సీట్లతో స్థిరమైన ప్రభుత్వం, కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యత బలాలుగా సులభతరమైన అవినీతిరహిత పాలనను అందించగలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. శుక్రవారం విజయవాడలో 30 దేశాల దౌత్యప్రతినిధులతో సమావేశమైన సిఎం, రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్ధించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఎల) రద్దు విషయంలో తొలుత కొంత ఆందోళన వ్యక్తమైనా తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం కలుగుతుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

2019-08-10

జమ్మూ-కాశ్మీర్ విషయంలో కేంద్ర హోం శాఖ శుక్రవారం ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి అదనంగా 100 కంపెనీల (సుమారు 10 వేల మంది) పారామిలిటరీ బలగాలను పంపడానికి ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని బట్టి కాశ్మీర్లో కేంద్రం సరికొత్త చర్యలేవో తీసుకోబోతోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమరనాథ్ యాత్రకోసం 40 వేల అదనపు పారామిలిటరీ సిబ్బంది కాశ్మీర్లో ఉన్నారు. మరిన్ని బలగాల నిర్ణయంతో.. ఆర్టికల్ 35ఎ తొలగింపుపై ఊహాగానాలు మొదలయ్యాయి.

2019-07-26 Read More

ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ (ఇంతకు ముందు సిఎం క్యాంపు కార్యాలయం)లో బిశ్వభూషణ్ చేత ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయించారు. సిఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విభజిత ఏపీకి బిశ్వభూషణ్ తొలి పూర్తి స్థాయి గవర్నర్. ఇదివరకు ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి గవర్నరుగా నరసింహన్ వ్యవహరించారు.

2019-07-24 Read More

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ నిపుణుల కమిటీని ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన..‘సాక్షి’ వార్తా కథనంలోని అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉండగా అవినీతివల్ల పరిస్థితి మరింత దిగజారిందని వ్యాఖ్యానించారు. పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగుకు ఉన్న అవకాశాల్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

2019-06-22

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా ఆయన చిరకాల మిత్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయన కేబినెట్ ర్యాంకుతో ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించనున్నారు. సజ్జల జగన్ స్థాపించిన పత్రిక ‘సాక్షి’కి ఎడిటోరియల్ డైరెక్టర్ హోదాలో పని చేశారు.

2019-06-18

తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణానికి ఈ నెల 27వ తేదీన భూమిపూజ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. పాత సచివాలయం స్థానంలోనే కొత్త భవనాలను రూ. 400 కోట్లతోనూ, అసెంబ్లీ భవనాన్ని రూ. 100 కోట్లతో ఎర్రమంజిల్ లోనూ నిర్మిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని వారసత్వ సంపదలా కాపాడుతామని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం అనంతరం నిర్ణయాలను సిఎం స్వయంగా ప్రకటించారు.

2019-06-18

బీహార్ లోని ముజఫర్ పూర్ లో 100 మంది పిల్లలు ఎన్సెఫలైటిస్ కారణంగా మరణించినట్టు వచ్చిన వార్తలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి) స్వచ్ఛందంగా స్పందించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ వ్యవహారంపై సవివరమైన నివేదికలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పిల్లలకు చేసిన వైద్యానికి సంబంధించి కూడా వివరాలను కమిషన్ కోరింది.

2019-06-17 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page