2018వ బ్యాచ్ ఐఎఎస్ అధికారుల్లో 11 మందిని ఏపీ కేడర్ కు, ఏడుగురిని తెలంగాణ కేడర్ కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకూ కలిపి 180 మంది ఐఎఎస్ అధికారులను కొత్తగా కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు కేటాయించినవారిలో ఎక్కువ భాగం ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. కాగా, ఇతర రాష్ట్రాలకు కేటాయించినవారిలో ఆంధ్రప్రదేశ్ వారెవరూ లేకపోవడం గమనార్హం. తెలంగాణ వారు మాత్రం ముగ్గురు ఇతర రాష్ట్రాల కేడర్లకు వెళ్తున్నారు.

2019-10-17

అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయెల్ రీఫ్మాన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో చర్చించారు. నగర పాలక సంస్థ చేపట్టిన కార్యకలాపాలను కమిషనర్ సృజన కాన్సుల్ జనరల్ బృందానికి వివరించారు.

2019-10-15

విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇతర ప్రభుత్వ శాఖలే భారీగా బిల్లులు బకాయి పెట్టాయి. జలవనరుల శాఖ రూ. 2 వేల కోట్లు, పంచాయితీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ. 500 కోట్లు బకాయి ఉన్నట్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం వెల్లడించారు. భారీగా బకాయి పడ్డ శాఖల్లో పురపాలక, వైద్య-ఆరోగ్య విభాగాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్ నుంచి బకాయిలు చెల్లించాలని సీఎస్ పంచాయితీరాజ్-గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

2019-10-15

‘వైఎస్ఆర్ రైతు భరోసా’ తమ పార్టీ మేనిఫెస్టోలోని మొదటి వాగ్ధానమని, దాన్ని చెప్పిన సమయం కంటే 8 నెలలు ముందుగానే అమల్లోకి తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా కాకుటూరు వద్ద ఆయన మంగళవారం ‘వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించారు. కొంతమంది లబ్దిదారులకు చెక్కులను వేదికపైనే పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లను సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని, జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని జగన్ చెప్పారు.

2019-10-15

‘వైఎస్ఆర్ రైతుభరోసా’ సాయాన్ని రూ. 1000 మేరకు పెంచనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేంద్రం ఇచ్చే రూ. 6000తో కలిపి అర్హులైన రైతులకు రూ. 12,500 ఇవ్వాలని ఇదివరకు నిర్ణయించగా, ఇప్పుడా మొత్తం రూ. 13,500కు పెరుగుతోంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే రూ. 13,500 ఇవ్వనుంది. రైతు భరోసా తొలి విడతగా అక్టోబర్ 15న 40 లక్షల మందికి సాయం అందజేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు చెప్పారు. ఈ పథకానికి రైతులు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2019-10-14

మెజారిటేరియనిజంతో జాతీయ భద్రత మెరుగుపడదని, నిజానికి అది బలహీనపరుస్తుందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. వాట్సన్ ఇనిస్టిట్యూట్ లో ఒపి జిందాల్ లెక్చర్ ఇచ్చిన రాజన్, ‘‘మెజారిటీ జాతీయవాదం దేశాన్ని అంతర్గతంగా విభజిస్తుంది. ఓ సమూహంలోని పౌరులను ‘ఇతరులు’ కింద పరిగణిస్తుంది’’ అని పేర్కొన్నారు. అంతర్గత సామరస్యం, ఆర్థికాభివృద్ధి మాత్రమే భారత జాతీయ భద్రతకు పునాధులు కాగలవని... విభజిత, జనరంజక మెజారిటీ వాదం కాదని రాజన్ ఉద్ఘాటించారు.

2019-10-14 Read More

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘నవరత్నాలు’లో ఒకటైన ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పథకానికి రూ. 5,510 కోట్లు విడుదలయ్యాయి. ఈమేరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బిఆర్ఒ) ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆదివారం జీవో ఆర్.టి. నెం. 1744 జారీ చేశారు. అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తానన్న రూ. 6000తో కలిపి మొత్తం రూ. 12,500 నేరుగా ఖాతాలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లా కాకుటూరులో ప్రారంభించనున్నారు.

2019-10-13 Read More

దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఓ తీపి వార్తను ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 17 శాతానికి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 49.93 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని, ఖజానాకు రూ .16 వేల కోట్లు ఖర్చవుతాయని సమాచార-ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.

2019-10-09 Read More

దసరా సమయంలో సమ్మెకు దిగడం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేసిన తీవ్రమైన తప్పిదమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాను లొంగబోనని, సమ్మెకు దిగినవారిలో గడువులోపు విధుల్లో చేరనివారిని తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారి స్థానంలో కొత్తగా నియమాకాలు చేపట్టాలని ఆదేశించిన కేసీఆర్, ‘కొత్తగా చేరే సిబ్బంది యూనియన్లలో చేరబోమని ఒప్పంద పత్రంపైన సంతకం చేయాలి’ అని హుకుం జారీ చేశారు.

2019-10-07 Read More

ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే పథకం ‘‘వైఎస్ఆర్ వాహన మిత్ర’’ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ. 10 వేల చొప్పున ఐదేళ్ళలో రూ. 50 వేలు అందిస్తామని జగన్ ఈ సందర్భంగానూ పునరుద్ఘాటించారు. అక్టోబర్ 30 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆటో డ్రైవర్ తరహాలో ఖాకీ చొక్కా ధరించిన జగన్, యూనియన్ల నేతలు చేసిన చిరు సత్కారాన్ని స్వీకరించారు.

2019-10-04 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page